సారథి న్యూస్, ములుగు: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ములుగు జిల్లా కలెక్టర్ ఎస్.క్రిష్ణ ఆదిత్య కోరారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా పరిశ్రమల ప్రమోషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెర్ప్ ద్వారా జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ఆర్థిక స్తోమత ఉన్నవారిని గుర్తించి ప్రభుత్వపరంగా పరిశ్రమల స్థాపనకు సహకరించాలన్నారు. జనాభాపరంగా అన్ని సామాజికవర్గాలకు లబ్ధి చేకూరాలన్నారు. టీ-ప్రైడ్ పథకం ద్వారా 8 దరఖాస్తులు రాగా, ఏడింటిని పరిశీలించి […]
సారథి న్యూస్, వాజేడు: పస్రా ఫారెస్ట్‌రేంజ్ పరిధిలో ఉన్న చల్వాయి నర్సరీ కేంద్రాన్ని గురువారం ములుగు డీఎఫ్ వో ప్రదీప్ కుమార్ శెట్టి ఆకస్మిక తనిఖీ చేశారు. నర్సరీలో ఉన్న మొక్కల వివరాలను అడిగి తెలుసుకుని కొన్ని సూచనలు చేశారు. అనంతరం లక్నవరంలోని ఎకో పార్క్ ను సందర్శించిన డీఎఫ్ వో ప్రదీప్ కుమార్ శెట్టి సిబ్బందిని ఫుడ్ కోర్ట్ ఏర్పాటుచేయాలని ఆదేశించారు. అలాగే పర్యాటకుల కోసం మరిన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. అనంతరం లక్నవరంలోని వాచ్ టవర్ […]
సారథి న్యూస్, వాజేడు, తాడ్వాయి: ప్రమాదవశాత్తు జంపన్నవాగులో పడి బాలుడు గల్లంతయ్యాడు. ఈ ఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో గ్రామంలో బుధవారం విషాదం నింపింది. మేడారం గ్రామానికి చెందిన మహేందర్, యాద లక్ష్మిల కుమారుడు పల్లపు తరుణ్(14) బుధవారం బంధువుల పిల్లలతో కలిసి జంపన్న వాగు అవతల ఉన్న కొత్తూరు గ్రామానికి వెళ్లి తిరిగివస్తుండగా కొంగల మడుగు వద్ద గల లోవెల్ బ్రిడ్జిపై దాటుతుండగా ప్రవాహం పెరిగి వాగులో పడిపోయాడు. ఈత రాకపోవడం వల్ల […]
సారథి న్యూస్, ములుగు: గోదావరి నదిపై కరకట్ట నిర్మించేందుకు నిధులు విడుదల చేయాలని నీటిపారుదలశాఖ కార్యదర్శి రజత్ కుమార్ కు ములుగు ఎమ్మెల్యే సీతక్క వినతిపత్రం ఇచ్చారు. సోమవారం ఆమె హైదరాబాద్‌లో రజత్‌కుమార్‌ను కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. ములుగు నియోజకవర్గంలోని మూడు మండలాల గుండా దాదాపు 100 కి.మీ.మేర గోదావరి ప్రవహిస్తుందని చెప్పారు. ఏటా వచ్చే వరదల వల్ల వందలాది ఎకరాల పంట పొలాలు కోతకు గురవుతున్నాయని చెప్పారు. […]
సారథి న్యూస్, వెంకటాపురం: కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులు రైతులకు గుదిబండ లాంటిదని ములుగు ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. ఏఐసీసీ పిలుపుమేరకు ములుగు జిల్లా నుగూరు వెంకటాపురం మండలకేంద్రంలో ఆందోళన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లు అధాని, అంబానీ కోసమేనని విమర్శించారు. బిల్లు ప్రకారం సప్లై చైన్ లో రైతులనుంచి రీటైలర్ వరకూ ఎవరు ఎంతైనా స్టోర్ చేసుకోవచ్చని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నల్లేల కుమారస్వామి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్ […]
ములుగు జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య సారథి న్యూస్, ములుగు: మహాత్మాగాంధీ మార్గాన్ని ఆదర్శంగా తీసుకుని, ఆయన అడుగు జాడల్లో ప్రతిఒక్కరూ నడవాలని జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య పిలుపునిచ్చారు. శుక్రవారం మహాత్మాగాంధీ 151వ జయంతిని పురస్కరించుకుని కలెక్టరేట్ లో గాంధీజీ చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాజిక రుగ్మతలు లేకుండా దేశం అభివృద్ధిపథంలో నడిపేందుకు కృషిచేసిన గాంధీజీ అడుగుజాడల్లో నడవడమే ఆయనకు ఇచ్చిన ఘనమైన […]
సారథి న్యూస్, వాజేడు(ములుగు): ములుగు జిల్లాలోని వాజేడు మండలం చికుపల్లి అటవీ పాంత్రంలో ఉన్న బొగత జలపాతాన్ని వెంకటాపురం రేంజ్ ఆఫీసర్, వాజేడు ఎస్సై తిరుపతి రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. బొగత జలపాతానికి వచ్చే పర్యాటకులు అటవీ అధికారులు చెప్పిన జాగ్రత్తలు పాటించాలన్నారు. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటించాలని, మాస్క్ తప్పనిసరి కట్టుకుని బొగత జలపాతం సందర్శనకు రావాలని సూచించారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. […]
సారథి న్యూస్, ములుగు: రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు తీసుకోవాలని ములుగు కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య పేర్కొన్నారు. సోమవారం ఆయన కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా స్థాయి రోడ్డు భద్రతా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో ప్రమాదాల నివారణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. జిల్లాలోని అన్ని రహదారుల్లో ప్రమాద స్థలాలు, బ్లాక్ స్పాట్స్ గుర్తించాలన్నారు. ఓవర్ లోడ్, లైసెన్స్, హెల్మెట్ లేకుండా వాహనాలు నడపటం పై చర్యలు […]