యోగికి ఫోన్ చేసిన ప్రధాని నరేంద్రమోడీ లక్నో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ దళిత యువతి సామూహిక లైంగికదాడి కేసులో దోషులుగా తేలినవారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అన్నారు. ఈ ఘటన గురించి ప్రధాని మోడీ తనతో మాట్లాడారనీ, దోషులు ఎంతటివారైనా వదిలిపెట్టొద్దని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారని యోగి తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా పలు ట్వీట్లు చేశారు. యోగి స్పందిస్తూ.. ‘ఈ ఘటనకు […]
ఇటీవలే మనందరనీ విడిచిపెట్టి వెళ్లిపోయిన ప్రముఖ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం ఎంతటి నిరాడంబరుడో అంతటి మర్యాదస్తుడు. ఎంతటి సంస్కార వంతుడో అంత ప్రతిభాశాలి. ఎంతమంది కొత్త కళాకారులను ప్రోత్సహించాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాల్లో పాడుతున్న చాలా మంది సింగర్స్ ఆయన ప్రోద్బలంతో వచ్చినవారే. నిజానికి ఆయన ప్రతిభ అసమానం. కేంద్రప్రభుత్వం ఆయనకు 2001 లో పద్మశ్రీ ని, 2011 లో పద్మ భూషణ్ ని ప్రకటించింది. అంతేకాక ఆయన ఆరు సార్లు జాతీయ స్థాయి […]
ఐసీఎంఆర్ హెచ్చరిక న్యూఢిల్లీ: చైనాలో పుట్టిన కరోనా వైరస్‌తో ఇప్పటికే తల్లడిల్లుతున్న భారత్‌కు ఆ దేశం నుంచి మరో ప్రమాదకర వైరస్ వ్యాపించే ప్రమాదం ఉందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ప్రకటించింది. పందుల్లో ఉండే ‘క్యాట్ క్యూ వైరస్’ (సీక్యూవీ) దోమల ద్వారా భారత్‌లోకి ప్రవేశించే ప్రమాదం ఉందని సోమవారం హెచ్చరించింది. ఈ వైరస్ క్యూలెక్స్ దోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఐసీఎంఆర్, పుణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ కలిసి దేశవ్యాప్తంగా […]
భారీగా బకాయిలు పడ్డ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన సంవత్సరం మాత్రమే చెల్లింపు న్యూయార్క్ : అగ్ర రాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ మరో వివాదంలో చిక్కుకున్నారు. కొన్నేళ్ళుగా ఆయన ఆదాయపు పన్ను చెల్లించడం లేదని ‘న్యూయార్క్ టైమ్స్’ సంచలన కథనాన్ని ప్రచురించింది. గడిచిన పదిహేనేళ్లలో.. ఆయన అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన 2016-17 ఆర్థిక సంవత్సరంలో మాత్రమే ఆదాయపు పన్ను చెల్లించారని, అంతకుముందు దాదాపు పదేళ్లకు పైగా బకాయిలు ఉన్నాయని ఆ కథనం సారాంశం. మరికొద్ది రోజుల్లో అమెరికాలో అధ్యక్ష […]
పీఎం కేర్స్‌కు రూ.349 కోట్ల విరాళం సీఎస్ఆర్ కింద అందజేసిన ప్రభుత్వ బీమా సంస్థలు న్యూఢిల్లీ : కరోనా వ్యాప్తిని అరికట్టడానికి, దానిపై పోరాడుతున్న వైద్య సిబ్బందికి తగిన సదుపాయాలు కల్పించే ఉద్దేశంతో ప్రధాని మోడీ నేతృత్వంలో ఏర్పాటుచేసిన ప్రైమ్ మినిస్టర్ సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిట్యూయేషన్స్ (పీఎంకేర్స్)కు ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా సంస్థల నుంచి భారీగా విరాళాలు అందాయి. సుమారు ఏడు ప్రభుత్వరంగ బ్యాంకులు, బీమా సంస్థలు కలిపి ఈ […]
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతికేసు విచారణలో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ రాకెట్ పై ఫోకస్ పెట్టిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) దర్యాప్తును వేగవంతం చేసింది. ఇప్పటికే హీరోయిన్ రియా చక్రవర్తితో పాటు పలువురు డ్రగ్ డీలర్లను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొనే, శ్రద్ధాకపూర్, రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్ లను ఎన్సీబీ అధికారులు విచారించారు. వీరితో పాటు దీపికా మేనేజర్ కరిష్మా కపూర్ ఫ్యాషన్ డిజైనర్ […]
తాను ఇంతకాలం పెంచి పెద్దచేసిన కూతురు తన మాట వినకుండా ప్రియుడితో వెళ్లిపోవడాన్ని ఓ తల్లి సహించలేకపోయింది. అవమానం భారం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొన్నది. తమిళనాడులో రాష్ట్రంలో జరిగిందీ ఘటన.. తిరువళ్లూర్ జిల్లా తిరుత్తణి నెహ్రూనగర్‌కు చెందిన శ్రీనివాసన్, మహేశ్వరి దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. వారి కూతురు పదో తరగతి చదువుతున్నప్పటి నుంచే ఓ యువకుడిని ప్రేమించింది. ఈ నెల 10న అతనితో పారిపోయింది. తల్లిదండ్రులు, బంధువులు కుమార్తె కోసం పలు ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ […]
బాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణను వేగవంతం చేసింది ఎన్సీబీ. నలుగురు హీరోయిన్లను ప్రశ్నించి కీలక సమాచారం రాబట్టింది. ఈ కేసులో ఇప్పటికే రకుల్ ప్రీత్‌సింగ్‌ను ప్రశ్నించిన ఎన్సీబీ, శనివారం మరో ముగ్గురు హీరోయిన్లు.. దీపికా పదుకొణె, శ్రద్ధాకపూర్, సారా అలీఖాన్ ను వేర్వేరుగా విచారించింది. ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసినట్టు తెలుస్తోంది. ఈ డ్రగ్స్ కేసులో విచారణను ఎదుర్కొంటున్న ఈ నలుగురి హీరోయిన్ల ఫోన్లను అధికారులు సీజ్ చేసినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకే […]