Breaking News

వరంగల్

ఐనవోలు జాతరకు ముమ్మర ఏర్పాట్లు

ఐనవోలు జాతరకు ముమ్మర ఏర్పాట్లు

అధికారులతో మంత్రి దయాకర్ రావు సమీక్ష సామాజికసారథి, ఐనవోలు: వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఐనవోలు మల్లికార్జున స్వామి జాతరకు ఏర్పాట్లు చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఆలయాధికారులు, అర్చకులను ఆదేశించారు. జనవరి 13,14,15 తేదీల్లో మూడు రోజులపాటు జరిగే జాతరకు భక్తులు అశేషంగా తరలివస్తారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, భద్రత, డార్మెటరీలు, చలువ పందిళ్లు, మంచినీటి వసతి, స్నానాల గదులు, బట్టలు మార్చుకునే గదులు, మహిళలకు ప్రత్యేక వసతులు, క్యూ లైన్లు, విద్యుత్‌, సీసీకెమెరాలు, […]

Read More
రైతాంగ ఉద్యమం చారిత్రాత్మకం

రైతాంగ ఉద్యమం చారిత్రాత్మకం

  • December 12, 2021
  • Comments Off on రైతాంగ ఉద్యమం చారిత్రాత్మకం

 ఏఐకేఎస్ సీసీ రాష్ట్ర కన్వీనర్ వల్లెపు ఉపేందర్ రెడ్డి సామాజిక సారథి, వరంగల్: రైతాంగ ఐక్య ఉద్యమం మోడీ ప్రభుత్వ మెడలు వంచి వ్యవసాయ వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయించి చరిత్రను సృష్టించిందని, ఇదే స్ఫూర్తితో మద్దతు ధర, రుణ విముక్తి చట్టాలను సాధించేంతవరకు దశలవారీ పోరాటాలకు సిద్ధం కావాలని ఏఐకేఎస్ సీసీ రాష్ట్ర కన్వీనర్ వల్లెపు ఉపేందర్ రెడ్డి, జిల్లా కన్వీనర్ పెద్దారపు రమేష్, కో కన్వీనర్లు రాచర్ల బాలరాజు, సోమిడి శ్రీనివాస్ లు […]

Read More
డోర్నకల్‌ అభివృద్ధి బాధ్యత నాదే..

డోర్నకల్‌ అభివృద్ధి బాధ్యత నాదే..

క్రిస్మస్‌ వేడుకల్లో ప్రకటించిన మంత్రి సత్యవతి రాథోడ్‌ సామాజిక సారథి, మహబూబాబాద్‌:  డోర్నకల్‌ ప్రజలు నన్ను వారి ఆడబిడ్డగా భావించి ఎప్పుడూ ఆదరించారని, ఈ ప్రాంత అభివృద్ధి బాధ్యత తనదేనని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. డోర్నకల్‌లోని సీఎస్‌ఐ చర్చిలో గురువారం జరిగిన 38వ ఆలోచన మహాసభల్లో మంత్రి పాల్గొని ప్రసంగించారు. క్రిస్టియన్‌ సోదర, సోదరీమణులకు అడ్వాన్స్‌ క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘నేను 10 తరగతి చదవడానికి ఇక్కడ బిషప్‌ స్కూల్‌కు వచ్చాను. కానీ […]

Read More
ఏజెన్సీలో వెలసిన మావోయిస్టుల కరపత్రాలు

ఏజెన్సీలో మావోయిస్టుల కరపత్రాలు

 పోలీసు ఇన్ఫార్మర్లకు హెచ్చరికలు సామాజిక సారథి, వెంకటాపురం: ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని కొండాపురం‌ గ్రామ సమీపంలోని భద్రాచలం, వెంకటాపురం ప్రధాన రహదారిపై వెలసిన మావోయిస్టు కరపత్రాలు వెలువడ్డాయి. మావోయిస్టుల వారోత్సవాలు ముగిసిన అనంతరం లేఖ వెలువడటంతో ఈలేఖ స్థానికంగా కలకలం రేపుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయం గుప్పిట్లో ఏజెన్సీ గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులుకు ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్న బొల్లారం, పెంకవాగు, కలిపాక, సీతారాంపురం గ్రామాలకు చెందిన వ్యక్తులు మావోయిస్టుల గురించి పోలీసులకు సమాచారం ఇస్తున్నారని పోలీసులు చూపే ప్రలోభాలకు, […]

Read More
అపోహలు సృష్టించొద్దు

అపోహలు సృష్టించొద్దు

చేర్యాల మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి సామాజిక సారథి, జనగామ: ధాన్యం కొనుగోలుతో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని, సీఎం కేసీఆర్, మంత్రి నిరంజన్‌రెడ్డి అనడం అత్యంత చేతకాని సిగ్గుమాలిన చర్య అని చేర్యాల మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుల పేరుతో రూ. 1లక్ష10వేల కోట్ల అప్పులు చేసి, కమీషన్లతో కేసీఆర్ ఆరాచకపాలన కొనసాగుస్తూరని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ వ్యవసాయశాఖ మంత్రి […]

Read More
సెలవురోజున కూలీపనిలో సబ్ రిజిస్టరార్

సెలవు రోజున కూలీపనిలో సబ్ రిజిస్ట్రర్

సామజిక సారథి, ములుగు ప్రతినిధి: వ్యవసాయంపై మక్కువతో ఎప్పటిలాగే సెలవు రోజున సెల్క పనికి వెళ్ళారు. ములుగు, భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా ఆదివారం సెలవు రోజున ములుగు జిల్లా మాన్ సింగ్ తాండ పరిధి, భాగ్యతండాలో అలవాత్ బధ్యా, భుల్లి దంపతుల పత్తి చేనులో కూలీలతో కలిసి పత్తి (ఏరారు ) తీశారు. ఒక సాధారణ వ్యక్తిలా కూలీలతో కలిసి అన్నం తిన్నారు. ఎండనక, వానానక కాయకష్టం చేసుకొనే కర్షకులకు బాసటగా నిలుద్ధామని ములుగు,భూపాలపల్లి […]

Read More
రైల్వే స్టేషన్ లో కొండముచ్చు హల్ చల్

రైల్వే స్టేషన్ లో కొండముచ్చు హల్ చల్

సామాజిక సారథి‌, మధిర: ఖమ్మం జిల్లా మధిర రైల్వే స్టేషన్ లో ఓ కొండముచ్చు హల్ చల్ చేస్తోంది. శుక్ర, శనివారాల్లో ఓ కొండముచ్చు 8మందిపై దాడి చేసి గాయపరిచింది. ఓ కొండముచ్చు రైల్వే స్టేషన్ కు వచ్చే ప్రయాణికులతో పాటు అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని భయాందోళనకు గురిచేస్తోంది. శుక్రవారం కొండముచ్చు దాడిలో ఐదుగురు గాయపడగా, శనివారం రాత్రి ఓ కానిస్టేబుల్,  రైల్వే స్టేషన్ లో పనిచేస్తున్న ఉద్యోగిపై దాడి చేయడంతో పట్టాలపై పడి గాయాల పాలయ్యాడు. […]

Read More
ఉనికి చాటుకున్న మావోయిస్టులు

ఉనికి చాటుకున్న మావోయిస్టులు

సామాజిక సారథి, ఏటూరు నాగారం: పీఎల్జీఏ 21వ వార్షిక వారోత్సవాలు డిసెంబర్ 2నుంచి డిసెంబర్10 వరకు జరుపుకోవాలని మావోయిస్టులు పిలుపునివ్వడంతో పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. ఏజెన్సీ సరిహద్దు ప్రాంతంలో భద్రత కట్టుదిట్టం చేశారు. ప్రత్యేక పోలీసు బలగాలతో అడవులను జల్లడ పడుతున్నారు. రహదారులు, గోదావరి పరీవాహక ప్రాంతాలపై డేగ కన్నుతో సోదాలు నిర్వహిస్తూ అనుమానిత వ్యక్తుల వివరాలు సేకరిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసుల కళ్లుగప్పి మావోయిస్టులు వారి ఉనికిని చాటుకున్న ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారం […]

Read More