Breaking News

జాతీయం

పైలట్​ దురాశ వల్లే సంక్షోభం

పైలట్​ దురాశవల్లే సంక్షోభం

జైపూర్​: సచిన్​ పైలట్​ దురాశ వల్లే రాజస్థాన్​లో రాజకీయ సంక్షోభం ఏర్పడిందని ఆ రాష్ట్ర సీఎం అశోక్​ గెహ్లాట్​ వ్యాఖ్యానించారు. అతను మళ్లీ కాంగ్రెస్​లోకి రావాలనుకుంటే తాను ఆహ్వానిస్తానని చెప్పారు. కాంగ్రెస్​ జాతీయపార్టీ అని.. ఇక్కడ వేచి చూస్తే తగిన సమయంలో పదవి దక్కుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఓ వైపు సచిన్​ పైలట్​ వర్గం ఎమ్మెల్యేలపై స్పీకర్​ చర్యలు తీసుకోకుండా హైకోర్టు స్టే విధించింది. దీంతో కాంగ్రెస్​ పార్టీ కొత్త ఎత్తుగడలను ప్రారంభించిందని విశ్లేషకులు అభిప్రాయపడతున్నారు.

Read More

హైకోర్టులోనూ పైలట్​కే అనుకూలం

జైపూర్​: రాజస్థాన్​ రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. సచిన్​ పైలట్​కు హైకోర్టులో మరోసారి ఊరట దక్కింది. సచిన్​ పైలట్​ వర్గం ఎమ్మెల్యేలపై రాజస్థాన్ స్పీకర్​ అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. కాగా దీనిపై పైలట్​ ఇప్పటికే కోర్టుకు వెళ్లారు. గురువారం దీనిపై కోర్టు తీర్పు వెలువరించాల్సి ఉంది. ఈ క్రమంలో ఈకేసులో కేంద్రాన్ని కూడా చేర్చాలంటూ పైలట్​ మరోసారి కోర్టును ఆశ్రయించారు. దీనిని కోర్టు స్వీకరించింది. ఈ కేసులో తుదితీర్పు ఆలస్యమయ్యే అవకాశం ఉన్నందున ఎమ్మెల్యేల అనర్హత […]

Read More
కరోనా పేషెంట్​పై లైంగికదాడి

కరోనా పేషెంట్​పై లైంగికదాడికి యత్నం

ఢిల్లీ: కరోనాతో బాధపడుతూ దవాఖానలో చేరిన ఓ బాలిక(14)ను మరో కరోనా పేషెంట్​ లైంగికంగా వేధించాడు. ఈ దారుణ ఘటన ఢిల్లీలోని కోవిడ్ కేర్​సెంటర్​లో గురువారం వెలుగుచూసింది. ఢిల్లీకి చెందిన ఓ బాలికకు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ కావడంతో కోవిడ్ సెంటర్​లో చికిత్సపొందుతున్నది. కాగా అక్కడే చికిత్సపొందుతున్న మరో కరోనా బాధితుడు బాలికపై టాయిలెట్​రూంలో లైంగికదాడికి యత్నించాడు. ఈ దృశ్యాన్ని మరో వ్యక్తి తన మొబైల్​ ఫోన్​లో చిత్రీకరించాడు. బాలిక కేకలు పెట్టడంతో ఇతర రోగులు అక్కడికి […]

Read More

కరోనా బాధితుల ఇంటికి సీల్​

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో అమానుష ఘటన చోటుచేసుకున్నది. కరోనా నిర్ధారణ అయిన రోగుల ఇండ్లను మున్సిపల్​ సిబ్బంది మెటల్​తో సీలు చేశారు. బెంగళూరులోని ఓ అపార్ట్​మెంట్​లో ఉంటున్న రెండు కుటుంబాలవారికి కరోనా సోకింది. దీంతో మున్సిపల్​ సిబ్బంది వారి ఇండ్ల తలుపులకు ఇనుప రేకులను బిగించి వాటిని మేకులతో కొట్టి బిగించారు. ఇందుకు సంబంధించిన చిత్రాలను ఓ వ్యక్తి సోషల్ ​మీడియాలో పోస్ట్​ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కాగా ఈ ఘటనపై సోషల్ […]

Read More

కోలుకున్నవారు 8 లక్షలు

ఢిల్లీ: భారత్​లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోలుకుంటున్న వారి సంఖ్య అధికంగానే ఉంటున్నదని వైద్యశాఖ గణాంకాలు తెలుపుతున్నాయి. ఇప్పటివరకు భారత్​లో 8 లక్షల మంది కోరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. కాగా గత 24 గంటల్లో 49,310 మంది కొత్తగా కరోనా బారినపడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 12,87,945 లకు ఎగబాకింది. ఇప్పటివరకు 30,601 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ప్రస్తుతం 4,40,135 […]

Read More
మహారాష్ట్రలో పెరుగుతున్న కేసులు

మహారాష్ట్రలో 9వేల కొత్తకేసులు

ముంబై: మహారాష్ట్రలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గత 24 గంటల్లో కొత్తగా 9,895 కొత్తకేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 3,47,502కు చేరింది. ఇప్పటివరకు కరోనాతో మహారాష్ట్రలో 12,854 మంది మృతిచెందారు. గత 24 గంటల్లోనే 298 మంది మృత్యువాత పడ్డారు. కాగా ఇప్పటివరకు 1,94, 253 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. కాగా దేశంలో ఇప్పటికే సామాజిక వ్యాప్తి ప్రారంభమైందని కొందరు వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. రానున్న మూడు, నాలుగు వారాల్లో వ్యాధి తీవ్రత మరిత పెరిగే […]

Read More

ఢిల్లీలో పక్కాగా కట్టడి

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ రాష్ట్రంలో కరోనా అదుపులోకి వచ్చింది. దీంతో ఇప్పడందరూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ను ప్రశంసిస్తున్నారు. అత్యధిక టెస్టులు చేయడం.. సకాలంలో వైద్యం చేయడం, ప్రజలకు కరోనాపై విస్తృత అవగాహన కల్పించడమే కేజ్రీవాల్​ విజయరహస్యం అని పలువురు అభిప్రాయపడుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చొరవ తీసుకోవడం కూడా కారణమని మరికొందరు పేర్కొంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఢిల్లీలో కరోనా కంట్రోల్​లోకి రావడం స్వాగతించవలిసిన అంశమే. గత 24 గంటల్లో ఆ రాష్ట్రంలో […]

Read More
పంద్రాగస్టు.. వీళ్లే ఆహ్వానితులు

పంద్రాగస్టు.. వీళ్లే ఆహ్వానితులు

సారథి న్యూస్, హైదరాబాద్: పంద్రాగస్టు వేడుకలకు కేంద్ర ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు విడుదల చేసింది. క‌రోనా వైర‌స్ బారిన‌ప‌డి కోలుకున్న వారిని ఆగస్టు 15న‌ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలకు ప్రత్యేక ఆహ్వానితులుగా పిలవాలని రాష్ట్రాలకు సూచించింది. ఇక‌, రాష్ట్ర రాజధానుల్లో ఉదయం 9 గంటలకు వేడుకలు నిర్వహించాలని సూచించారు. పోలీసు, ఆర్మీ, పారామిలటరీ, ఎన్‌సీసీ దళాలు మార్చ్‌ఫాస్ట్‌కు మాస్క్‌ ధరించాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. కరోనా దృష్ట్యా భారీస్థాయిలో ప్రజలు వేడుకల్లో పాల్గొనకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాలకు […]

Read More