Breaking News

జాతీయం

కృష్ణమ్మ.. జలసవ్వడి

కృష్ణమ్మ.. జలసవ్వడి

ఆల్మట్టి, నారాయణపూర్‌ నుంచి నీటి విడుదల జూరాల నుంచి శ్రీశైలం వైపునకు కృష్ణానది పరవళ్లు సారథి న్యూస్, కర్నూలు: కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు ఆల్మట్టి, నారాయణపూర్‌, ఉజ్జాయిని ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో జూరాలకు వరద ఉరకలెత్తుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 7.759 టీఎంసీల నిల్వ ఉంది. ప్రాజెక్టు నీటిమట్టం 318.516 మీటర్లు కాగా, ప్రస్తుతం 317.560 […]

Read More

ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

నడియాడ్‌: ఎదురెదురుగా వస్తున్న రెండుకార్లు ఢీకొన్న ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పయారు. ఈ ఘటన గుజరాత్​ రాష్ట్రంలోని అహ్మదాబాద్-వడోదర 8వ నంబర్‌ జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి చోటుచేసుకున్నది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను నడియాడ్‌లోని సివిల్‌ ఆస్పత్రికి తరలించినట్లు అగ్నిమాప‌క‌శాఖ సూప‌రింటెండెంట్ దీక్షిత్ ప‌టేల్‌ తెలిపారు. కేసు నమోదుచేసిన పోలీసులు, ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు.

Read More

‘బీజేపీతో ములాఖత్’ ఫేస్​బుక్​ వివరణ

ఢిల్లీ: ప్రముఖ సోషల్​ మీడియా సంస్థ ఫేస్​బుక్​.. భారతీయజనతాపార్టీకి సహకరిస్తోందని అమెరికాకు చెందిన ‘ది వాల్​స్ట్రీట్​ జర్నల్​’ ఓ కథనం ప్రచరించింది. ఇందుకోసం బీజేపీ తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్​ పెట్టిన పోస్టులను ఆ కథనంలో ప్రస్తావించారు. కాగా ఈ కథనం ఆధారంగా కాంగ్రెస్​ బీజేపీపై విరుచుకుపడింది. రాహుల్​గాంధీ కూడా ఫేస్​బుక్​ బీజేపీకి సహకరిస్తోందంటూ ఆరోపించారు. ఇన్నిరోజులకు అమెరికాకు చెందిన మీడియా వార్తలు ప్రచురిందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఫేస్​బుక్​ స్పందించింది. తమకు ఏ రాజకీయపార్టీతోనూ సంబంధం లేదని […]

Read More

నాకు ప్రాణహాని ఉంది.. కాపాడండి

న్యూఢిల్లీ: కొందరు తనను చంపేందుకు కుట్ర పన్నుతున్నారని.. తన ప్రాణాలను కాపాడాలని ఫేస్​బుక్​ పబ్లిక్​ పాలసీ డైరెక్టర్​ అంకిదాస్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై పోలీసులు వెంటనే కేసు నమోదు చేయాలని ఆమె పోలీసులను కోరారు. అమెరికాకు చెందిన వాల్​స్ట్రీట్​ జర్నల్‌(డబ్ల్యూఎస్‌జే) ఫేస్​బుక్​పై ఓ సంచలన కథనం ప్రచురించింది. ఈ కథనం మనదేశ రాజకీయాల్లో తీవ్రదుమారం రేపింది. భారత్​లో ఫేస్​బుక్​.. బీజేపీ ములాఖత్​ అయ్యాయని అందుకే బీజేపీకి చెందినవారు హింసాత్మక పోస్టులు చేసిన ఫేస్​బుక్​ తొలిగించడం […]

Read More

విషమంగానే ప్రణబ్​ ఆరోగ్యం

న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్యపరిస్థితి విషమంగానే ఉంది. ఆయనకు వెంటిలేటర్​పై చికిత్స అందిస్తున్నట్టు ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రి సోమవారం ప్రకటన విడుదల చేసింది. కాగా, ప్రణబ్​ శరీరం చికిత్సకు కొంతమేర సహకరిస్తున్నదని వారు చెప్పారు. ప్రణబ్​ ముఖర్జీ ఈ నెల 10న ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో చేరారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆయనకు ఓ మేజర్​ శస్త్రచికిత్స చేశారు వైద్యులు. తర్వాత ఆయనకు కరోనా కూడా సోకడంతో పరిస్థితి మరింత విషమించింది. ప్రస్తుతం ట్రీట్​మెంట్​ […]

Read More

జేఈఈ, నీట్​ పరీక్షల వాయిదాకు సుప్రీం నో

న్యూఢిల్లీ: జేఈఈ, నీట్​ను వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ముందుగా నిర్ణయించన ప్రకారమే పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేసింది. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో జేఈఈ, నీట్​ను వాయిదా వేయాలని 11 మంది విద్యార్థులు సుప్రీంను ఆశ్రయించారు. సోమవారం వారి పిటిషన్​ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం పలు కీలకవ్యాఖ్యలు చేసింది. పరీక్షలు వాయిదా వేస్తే విద్యార్థులు నష్టపోతారని కోర్టు అభిప్రాయపడింది. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ పరీక్షలను నిర్వహించాలని జస్టిస్​ అరుణ్​ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. వచ్చే […]

Read More

50వేలు దాటిన మరణాలు

ఢిల్లీ: మనదేశంలో ఇప్పటివరకు 50,921 మంది కరోనాతో మృతిచెందారు. గత 24 గంటల్లో 57,981 కొత్తకేసులు నమోదయ్యాయి. కోలుకుంటున్నవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉన్నదని కేంద్రవైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 19,19,842 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కాగా మొత్తం కేసుల సంఖ్య 26,47,663కు చేరుకున్నది. 6, 76,900 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని.. అత్యవసరమైతేనే బయటకు రావాలని.. తప్పకుండా మాస్కులు కట్టుకోవాలని కేంద్రవైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్పష్టంచేశారు.

Read More

విజయ్​ కొత్తపార్టీ.. తమిళనాట సంచలనం

చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. తమిళ నటుడు, మాస్ ​హీరో, అక్కడి ప్రేక్షకులతో తళపతిగా పిలిపించుకునే విజయ్​ రాజకీయాల్లోకి రానున్నట్టు సమాచారం. ఈ మేరకు పలు మీడియా సంస్థల్లో వార్తలు వెలువడ్డాయి. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీచేయనున్నట్టు సమాచారం. అయితే విజయ్​ సొంతంగా ఓ రాజకీయపార్టీని స్థాపించి ఎన్నకలబరిలోకి దిగనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం ఆయన తండ్రి, ప్రముఖదర్శకుడు ఎస్​ఏ చంద్రశేఖర్​ రంగంలోకి దిగారని సమాచారం. త్వరలోనే రాజకీయపార్టీని రిజిస్టర్​ చేయుంచనున్నట్టు […]

Read More