బాలీవుడ్లో ప్రముఖులుగా చలామణి అవుతున్నవారంతా డ్రగ్స్‌కు బానిసలేనంటూ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ సంచలన ఆరోపణలు చేశారు. ‘నాకు తెలిసిన ఓ స్టార్ హీరో నిత్యం డ్రగ్స్‌లో మునిగితెలేవాడు. ఓ సారి మోతాదుకు మించి డ్రగ్స్ తీసుకున్నాడు. ఆ సమయంలో నేను అతడితో డేటింగ్లో ఉన్నాను. డ్రగ్స్ తీసుకొని అతడు సైకోలా ప్రవర్తించేవాడు. అతడి టార్చర్ భరించలేక భార్యకు కూడా వదిలేసింది’అంటూ ఆమె పేర్కొన్నారు. ఇటీవల కంగనా ఓ టీవీ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా […]
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రమూకలు రెచ్చిపోతున్నాయి. స్థానికుల అండదండలతో చెలరేగిపోతున్నాయి. తాజాగా శ్రీనగర్‌లోని పంతాచౌక్ వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ దళాలపై ఉగ్రమూక ఒక్కసారిగా దాడులకు తెగబడింది. వెంటనే అలర్టయిన జవాన్లు ఎదురుదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారు. మరోవైపు సీఆర్పీఎఫ్కు చెందిన ఓ అసిస్టెంట్ సబ్ఇన్స్పెక్టర్ కూడా ప్రాణాలు కోల్పోయారు. కాగా ఈ ఘటనతో శ్రీనగర్ అట్టుడుకింది. ఇరు వర్గాలు దాదాపు గంటపాటు ఫైరింగ్ చేసుకున్నట్టు సమాచారం.
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కేసులు, మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.గత 24 గంట్లో కొత్తగా 78,761 కొత్తకేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 35,42,734కు చేరింది. కాగా, గత 24 గంటల్లో కరోనాతో 948 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, ఇప్పటివరకు 63,498 మంది కరోనా బారినపడి చనిపోయారు. 27,13,934 కోలుకోగా.. 7,65,302 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ టెస్టుల సంఖ్య గణనీయంగా పెంచుతున్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 4,14,61,636 మందికి కరోనా […]
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు మహిళా అధ్యక్షురాలు ఉండాలని తాను కోరుకుంటున్నాను. అయితే ఈ పదవికి కేవలం తన కూతురు ఇవాంక ట్రంప్ మాత్రమే అర్హురాలని ఆయన పేర్కొన్నారు. రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష పదవికి ట్రంప్ ఖరారైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్ తొలిసారిగా న్యూహాంప్షైర్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. ‘అమెరికా అధ్యక్షురాలిగా మహిళను చూడాలని నేను కూడా కోరుకుంటున్నాను. […]
100 మందికి మించకుండా సభలు, సమావేశాలు సెప్టెంబర్ 7 నుంచి దేశవ్యాప్తంగా మెట్రో సేవలు చిన్నారులు, గర్భిణులు, వృద్ధులు ఇళ్లకే పరిమితం కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్ 4.0 మార్గదర్శకాలు జారీ న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వైరస్ కారణంగా విధించిన లాన్‌డౌన్ నిబంధనలను సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు శనివారం అన్‌లాక్ 4.0 మార్గదర్శకాలు విడుదల చేసింది. సెప్టెంబర్ 30 వరకు స్కూళ్లు, మాల్స్ తెరవకూడదని కేంద్రప్రభుత్వం పేర్కొంది. అలాగే పలు […]
న్యూఢిల్లీ : కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కొత్తగా 76,472 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం 34,63,973 మంది కరోనా బారినపడ్డారు. గత 24 గంటల్లో 1,021 మంది కరోనాతో మృతిచెందారు. కాగా ఇప్పటివరకు మృతిచెందిన వారిసంఖ్య 62,550కు చేరింది. కోలుకుంటున్న వారిసంఖ్య కూడా అధికంగానే ఉంది. వైరస్ బారినపడ్డ వారిలో ఇప్పటివరకు 26,48,999 మంది కోలుకున్నారు. భారత్‌లో ప్రస్తుతం 7,52,424 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని.. అవసరం అయితేనే బయటకు రావాలని కేంద్ర […]
సారథి న్యూస్, హైదరాబాద్: వివిధ రంగాల్లో ఉత్తమ సేవలు అందించివారినికి ఇచ్చే పద్మ అవార్డులకు దరఖాస్తు చేసుకునేందుకు గడువును కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్15వ తేదీ వరకు పెంచింది. వివిధ రంగాల్లో విశేషంగా కృషిచేసిన వారికి గణతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్రం పద్మ పురస్కారాలను ఇవ్వనుంది. ఇప్పటివరకు 8,035 దరఖాస్తులు రాగా.. 6,361 దరఖాస్తుల పరిశీలన పూర్తయినట్లు కేంద్రం వెల్లడించింది.
హైదరాబాద్: కరోనా మహమ్మారి బారినపడిన జర్నలిస్టులకు కేంద్రప్రభుత్వం రూ.50వేలు నుంచి రూ.లక్ష వరకు ఆర్థిక సహాయం అందజేస్తోంది. అలాగే మృతిచెందిన వారికి రూ.ఐదులక్షల సాయం అందజేస్తోంది. కొవిడ్ట్రీట్మెంట్ అనంతరం డిశ్చార్జ్అయిన జర్నలిస్టులు ధ్రువీకరణ పత్రాలతో కింద తెలియజేసిన లింక్ లో ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. అన్ని వివరాలను కింద పేర్కొన్న లింక్‌లో పొందుపరిచారు. http://pibaccreditation.nic.in/jws/default.aspx