Breaking News

Day: November 26, 2021

సంక్షేమ పథకాలతోనే పల్లెలు అభివృద్ధి

సంక్షేమ పథకాలతోనే పల్లెలు అభివృద్ధి

సామాజిక సారథి, ఐనవోలు/ హన్మకొండ: తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి పథకాలతో పల్లెలన్నీ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతున్నాయని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. ఐనవోలు మండలం లోని పంతిని గ్రామంలో రూ.12.60లక్షల వ్యయంతో నిర్మించిన వైకుంఠ దామాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ చేపడుతున్న సంక్షేమ పథకాలతో పల్లెలన్నీ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. పంతిని నుంచి చెన్నారం గ్రామానికి రూ.2.50కోట్ల వ్యయంతో బీటీ రోడ్ మంజూరయ్యిందని, త్వరలో పనులు పూర్తి […]

Read More
ఏకగ్రీవ ఎమ్మెల్సీలు ఎవరంటే..

ఏకగ్రీవ ఎమ్మెల్సీలు ఎవరంటే..

సామాజిక సారథి, హైదరాబాద్​ప్రతినిధి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. నాలుగు జిల్లాల్లో ఆరు స్థానాల ఎన్నిక ఏకగ్రీవం కాగా, ఐదు జిల్లాల్లో ఎన్నిక జరగనుంది. మొత్తం 12 స్థానాలకు నోటిఫికేషన్‌ వెలువడింది. ఇందులో ఆరు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మరో ఆరు స్థానాలకు డిసెంబర్‌ 10న పోలింగ్‌ నిర్వహించనున్నారు. నిజామాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల నుంచి కల్వకుంట్ల కవిత, రంగారెడ్డి నుంచి పట్నం మహేందర్‌ రెడ్డి, […]

Read More
జవాన్లకు సాయమే అందలేదు

జవాన్లకు సాయమే అందలేదు

రైతులకు అందడానికి ఎన్ని యుగాలు పడుతుందో బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్​ప్రవీణ్‌ కుమార్​ సామాజిక సారథి, హైదరాబాద్‌: గల్వాన్‌ లోయ ఘటనలో అమరులైన జవాన్లకు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఆర్థికసాయం ఇంకా అందలేదని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్​డాక్టర్​ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఢిల్లీలో రైతు చట్టాలను రద్దు చేయాలని ఏడాదిగా చేస్తున్న నిరసనల్లో చనిపోయిన రైతు కుటుంబాలకు తాజాగా సీఎం కేసీఆర్‌ ఎక్స్‌ గ్రేషియా ప్రకటించారు. కాగా, అప్పుడెప్పుడో జవాన్లకు ప్రకటించిన సాయమే ఇంకా అందలేదు.. మరి రైతులకు […]

Read More
యాదగిరీశుడికి ఎమ్మెల్యే మర్రి ‘బంగారు’ కానుక

యాదగిరీశుడికి ఎమ్మెల్యే మర్రి ‘బంగారు’ కానుక

సామాజిక సారథి, నాగర్​కర్నూల్ ​ప్రతినిధి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఆలయ విమాన గోపురం స్వర్ణం తాపడానికి నాగర్​కర్నూల్​ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్​రెడ్డి రెండు కేజీల బంగారాన్ని శుక్రవారం ఆలయ ఈవో గీతారెడ్డికి అందజేశారు. తెలంగాణ కళావైభవం చాటేలా, ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. గతంలో ఆయన సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ముందుకొచ్చి.. తాజాగా రెండు కేజీల బంగారాన్ని అందజేశారు. నారసింహుడి ఆలయాన్ని ఎమ్మెల్యే మర్రి జనార్ధన్​రెడ్డి కుటుంబసమేతంగా […]

Read More
వట్టెం నవోదయ ఆభివృద్ధికి ఎంపీ హామీ

వట్టెం నవోదయ ఆభివృద్ధికి ఎంపీ హామీ

సామాజిక సారథి, బిజినేపల్లి: వట్టెం నవోదయ విద్యాలయం ఉమ్మడి జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలోని ప్రతిభావంతులైన విద్యార్థులను తీర్చిదిద్దాలని నాగర్ కర్నూల్ ​ఎంపీ పి.రాములు ఆకాంక్షించారు. శుక్రవారం నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ భాస్కర్ కుమార్, అధ్యాపకులు భాస్కరాచారి హైదరాబాద్ లో ఆయనను కలిసి బొకే ఇచ్చి, శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీ రాములు మాట్లాడుతూ.. వట్టెం నవోదయ విద్యాలయంలో విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థులు వివిధ రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో స్థిరపడి గుర్తింపు పొందడం అభినందనీయమన్నారు. […]

Read More
‘ఏఐజీ’ కాదు.. ‘గాంధీ’లో చేరండి

‘ఏఐజీ’ కాదు.. ‘గాంధీ’లో చేరండి

సామాజిక సారథి, హైదరాబాద్: అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా పాజిటివ్​ కావడంతో ప్రభుత్వ ఆస్పత్రిలో కాకుండా కార్పొరేట్ ​హాస్పిటల్​ ఏఐజీ(ఏషియన్ ఇనిస్టిట్యూట్​ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ)లో చేరడం ప్రభుత్వానికి సిగ్గుచేటని జైభీమ్​ యూత్​ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు ముకురాల శ్రీహరి విమర్శించారు. అత్యున్నతమైన స్థానంలో ఉన్న స్పీకర్ ప్రభుత్వ ఆస్పత్రులపై సామాన్యులకు నమ్మకం కలిగించాల్సింది పోయి ప్రజల సొమ్ముతో కార్పొరేట్​ఆస్పత్రిలో వైద్యం చేయించుకోవడం చాలా దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇది ప్రభుత్వ డాక్టర్లను అవమానించడమే అవుతుందన్నారు. ఈ […]

Read More
ఎమ్మెల్సీ దామోదర్​రెడ్డికి మంత్రి శుభాకాంక్షలు

ఎమ్మెల్సీ దామోదర్​రెడ్డికి విషెస్​ చెప్పిన మంత్రి హరీశ్​రావు

సామాజిక సారథి, నాగర్​కర్నూల్ ప్రతినిధి: మహబూబ్​నగర్ జిల్లా స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా కూచకుళ్ల దామోదర్​రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. తన తనయుడు డాక్టర్ ​కూచకుళ్ల రాజేశ్​రెడ్డితో కలిసి ఆయన శుక్రవారం ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్​రావును హైదరాబాద్ లో నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఏకగ్రీవంగా ఎన్నికైన దామోదర్ రెడ్డికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన విజయం కోసం పనిచేసిన ఉమ్మడి మహబూబ్​నగర్ ​జిల్లా టీఆర్ఎస్ ​ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, స్థానిక సంస్థల ప్రతినిధుల కృషిని […]

Read More
సారు.. సర్కారుకు షాక్!

సారు.. సర్కారుకు షాక్!

అటు విమ‌ర్శలు.. ఇటు రాజీనామాలు ఢిల్లీలో రైతులకు ప్రకటించిన సాయం తిరస్కరణ టీఆర్ఎస్​కు త‌ల‌బొప్పి కట్టిన తాజా పరిణామాలు బీజేపీకి టీఆర్ఎస్ బీ టీమ్ అంటూ టికాయత్​విమర్శలు క‌రీంన‌గ‌ర్ మాజీ మేయ‌ర్ రవీందర్ సింగ్, సీనియర్​నేత గట్టు రామ‌చందర్​రావు రాజీనామా ఉద్యమకారులకు పార్టీలో గౌరవం లేదని లేఖలు సామాజిక సారథి, హైదరాబాద్ ప్రతినిధి: కారు.. సారుకు ఊహించ‌ని షాక్ త‌గిలింది. ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో ఏడాదిగా కాలంగా జరుగుతున్న రైతు ఉద్యమంలో అసువులు బాసిన 700 మంది రైతన్నల […]

Read More