సారథి, రామడుగు: తల్లిదండ్రులు కోల్పోయి అనాథగా మారిన ఎన్నారై ఒకరు సాయం చేశారు. రామడుగు మండలం తీర్మాలపూర్ గ్రామానికి చెందిన చెవుటు వీణాకు రైజింగ్ సన్ యూత్ క్లబ్ అమెరికాకు చెందిన ప్రముఖ ఎన్నారై జమలమడక అమృత సహకారంతో రూ.15వేల ఆర్థిక సహాయం అందజేశారు. యువజన సంఘం సభ్యులు శనివారం ఆమెకు ఇచ్చారు. ఈ సందర్భంగా రైజింగ్ సన్ యూత్ క్లబ్ అధ్యక్షుడు గజ్జెల అశోక్, బాధిత కుటుంబానికి ఆపన్నహస్తం అందించిన ఎన్నారై జమలమడక అమృతకు కృతజ్ఞతలు […]
మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి సారథి, వెల్దండ: దేశవ్యాప్తంగా ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న బీజేపీ పాలనకు స్వప్తి పలకాలని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి పౌరుడు కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి దేశాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. శుక్రవారం పెట్రోల్, డీజిల్ అధిక ధరల పెంపునకు నిరసనగా ఏఐసీసీ పిలుపులో భాగంగా కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు ఎం.మోతిలాల్ నాయక్ ఆధ్వర్యంలో స్థానిక పెట్రోల్ బంక్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. […]
సారథి, అచ్చంపేట: నిత్యం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుపేదల నడ్డి విరుస్తున్నాయని యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి పవన్ కుమార్ విమర్శించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ, సీఎం కేసీఆర్ పెట్రోలు రేట్లు పెంచుతూ పేదలను నిలువు దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సంక్షోభంతో ఏడాది నుంచి లక్షలాది మంది ఉపాధి కోల్పోయారని వివరించారు. 10నెలల కాలంలో పెట్రోల్‌పై రూ.25, డీజిల్‌పై 26 పెంచారని ఆయన […]
సారథి, చొప్పదండి: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) చొప్పదండి శాఖ ఆధ్వర్యంలో సొసైటీ మెగా సర్వీస్ డ్రైవ్ రెండవ రోజు భాగంగా శనివారం పట్టణంలోని బస్టాండ్ , పోలీస్ స్టేషన్, తహసీల్దార్ ఆఫీసు, పీహెచ్ సీల వద్ద సోడియం హైపోక్లోరైడ్ పిచికారీ చేశారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీ వద్ద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎండీ ఆసిఫ్ మాట్లాడుతూ.. దేశంలో ఏ ఆపద వచ్చినా ఏబీవీపీ ముందుండి విద్యార్థుల సమస్యలే కాకుండా […]
సారథి ప్రతినిధి, ములుగు: ములుగు ఎమ్మెల్యే సీతక్క మరోసారి గొప్ప హృదయాన్ని చాటుకున్నారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం గుర్రంపేటలో సుమారు 130 కుటుంబాలకు గురువారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. లాక్ డౌన్ వల్ల పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఒక్కపూట తిండికి కూడా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పేదల ఆకలి తీర్చడం కోసం కనీసం ముఖ్యమంత్రి ఆలోచించకపోవడం దారుణమని మండిపడ్డారు. ప్రతినెలా ప్రతి పేద కుటుంబానికి రూ.ఆరువేల […]
బీజేపీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్ రావు సారథి, కొల్లాపూర్: రాష్ట్ర ప్రభుత్వం చేతిలో దగాపడ్డ విద్యా వలంటీర్లకు అండగా ఉంటామని బీజేపీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు, కొల్లాపూర్ నియోజకవర్గ ఇన్ చార్జ్ ఎల్లేని సుధాకర్ రావు భరోసా ఇచ్చారు. నాగ్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలో గురువారం జరిగిన ‘దగాపడ్డ విద్యావలంటీర్లకు చేయూత’ కార్యక్రమంలో పాల్గొన్నారు. కరోనా కష్టకాలంలో వారి బతుకులు చితికిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. వారి న్యాయమైన డిమాండ్ల […]
సారథి, అచ్చంపేట: తమ భూములకు రక్షణ కల్పించాలని నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం అంబగిరి గ్రామానికి చెందిన గిరిజన రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం అటవీశాఖ అధికారులు గిరిజన రైతులను భయభ్రాంతులకు గురిచేస్తూ గతంలో ఉన్న ఫారెస్ట్ హద్దు కాకుండా సాగుభూముల్లో జేసీబీతో బౌండరీ తీయడానికి రావడంతో గిరిజనులు అడ్డుకున్నారు. ఈ భూములకు 2006లో అటవీహక్కుల చట్టం ప్రకారం దాదాపు 12 మంది రైతులకు పట్టాలిచ్చారు. అప్పటి నుంచి వారు వ్యవసాయం చేసుకుంటూ జీవనం […]
సారథి, రామాయంపేట: నకిలీ సీడ్స్, ఫర్టిలైజర్ గానీ రైతులకు అమ్మితే పీడీ యాక్ట్ కింద కేసునమోదు చేసి జైలుకు పంపిస్తామని నిజాంపేట ఎస్సై ప్రకాష్ గౌడ్ ఫర్టిలైజర్ షాప్ దుకాణాల యజమానులకు వార్నింగ్ ఇచ్చారు. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని పలు విత్తన, ఫర్టిలైజర్ షాపులను ఆయన తన సిబ్బందితో కలసి మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నకిలీ సీడ్స్ గురించి ఎలాంటి సమాచారం రైతుల దగ్గర ఉన్నా పోలీస్ సిబ్బంది, […]