Breaking News

Day: May 24, 2021

వడ్ల కొనుగోళ్లను వేగవంతం చేయాలి

వడ్ల కొనుగోళ్లను వేగవంతం చేయాలి

సారథి ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో వరిధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన కలెక్టరేట్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను పరిష్కరించి అధికారులతో సమన్వయం చేసుకుంటూ కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. గన్నీ బ్యాగుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు ఎవరూ అధైర్యపడవద్దని, చివరి ధాన్యం వరకు ప్రభుత్వ మద్దతు ధరతో కొనుగోలుచేస్తుందని భరోసా ఇచ్చారు. వర్షాలు పడుతుండటంతో […]

Read More
రైతుల కోసం బీజేపీ దీక్ష

రైతుల కోసం బీజేపీ దీక్ష

సారథి, వేములవాడ: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ ఆదేశాల మేరకు ఆ పార్టీ రాజన్న సిరిసిల్ల అధ్యక్షుడు ప్రతాపరామకృష్ణ ఆధ్వర్యంలో సోమవారం వేములవాడలో రైతుగోస తెలంగాణ పోరు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ.. సీఎం కేసీఆర్ రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు. ఇసుక విషయంలో మనుషులను చంపి నడిపించే లారీలు అందుబాటులో ఉన్నాయని, రైతులు వరి ధాన్యం అమ్ముకుందామంటే లారీలను సమకూర్చలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందన్నారు. కొనుగోలు సెంటర్లలో వరి ధాన్యాన్ని తొందరగా […]

Read More
నిబంధనలు పాటించని షాప్ సీజ్

నిబంధనలు పాటించని షాప్ సీజ్

సారథి, పెద్దశంకరంపేట: ప్రభుత్వం నిర్ధేశించిన లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వస్త్రదుకాణాన్ని మెదక్ జిల్లా పెద్దశంకరంపేట ఎస్సై నరేందర్ సోమవారం సీజ్ చేసినట్లు ప్రకటించారు. పెద్దశంకరంపేటలో ఉదయం 10 గంటల తర్వాత దుకాణం తెరిచి ఉండటంతో ఎండీ ఆబిద్ హుస్సేన్ క్లాత్ మర్చంట్ దుకాణాన్ని సీజ్ చేశారు. లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రజలు అత్యవసర పని ఉంటేనే బయటికిరావాలని సూచించారు. నాందేడ్ అకోలా -హైదరాబాద్ 161వ జాతీయ రహదారిపై తనిఖీలు చేశారు. […]

Read More
యూనివర్సిటీలకు వీసీల నియామకం

యూనివర్సిటీలకు వీసీల నియామకం

సారథి, హైదరాబాద్: రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ లను ప్రభుత్వం నియమించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఏర్పాటుచేసిన సెర్చ్ కమిటీలు, రాష్ట్రంలోని యూనివర్సిటీ లకు వీసీల నియామక ప్రక్రియను చేపట్టింది. కరోనా నేపథ్యంలో కొంత ఆలస్యం జరిగినా, నిబంధనల ప్రకారం అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తిచేసి గవర్నర్ ఆమోదం కోసం సిఫారసు చేశారు. శనివారం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ వీసీల నియామకానికి ఆమోదం తెలిపారు.వీసీలు ఎవరంటే..ఉస్మానియా యూనివర్సిటీ(హైదరాబాద్) వీసీ […]

Read More
ఐసొలేషన్ సెంటర్ గా నవోదయ విద్యాలయం

ఐసొలేషన్ సెంటర్ గా నవోదయ విద్యాలయం

సారథి, చొప్పదండి: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటుకు చొప్పదండి పట్టణంలోని నవోదయ విద్యాలయాన్ని అడిషనల్ కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్, డీపీవో వీరబుచ్చయ్య సోమవారం పరిశీలించారు. ఐసొలేషన్ ఏర్పాటునకు అన్నిరకాల వసతులు ఉన్నందున ఎంపిక చేసినట్లు తెలిపారు. తహసీల్దా్ర్ అంబటి రజిత, మున్సిపల్ కమిషనర్ అంజయ్య, వైద్యాధికారి రమాదేవికి నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. పనులు వెంటనే ప్రారంభించేలా ఆదేశాలు జారీచేశారు. కార్యక్రమంలో నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ మంగతాయారు, ఎంపీవో జగన్మోహన్ రెడ్డి, రెవెన్యూ ఇన్ […]

Read More
కాల్చొద్దు.. కలియ దున్నుదాం

కాల్చొద్దు.. కలియ దున్నుదాం

పంటల వ్యర్థాలను దున్ని భూసారం పెంచవచ్చు పొలాల్లో నిప్పుతో పంటకు ముప్పే అవగాహన లేక వరిగడ్డి, పత్తిలొట్టను కాలుస్తున్న రైతులు హాని కలుగుతుందంటున్న వ్యవసాయ నిపుణులు వరి కోతల తర్వాత రైతులు వరి పండించిన మడులలో ఉన్న వరి గడ్డిని మంటపెడుతుంటారు. దీంతో నేలకు సారాన్ని ఇచ్చే క్రిమికీటకాలు చనిపోవడంతో పాటు భూసారం సమతుల్యత దెబ్బతిని తద్వారా సాగుచేసే పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వరి గడ్డిని కాల్చివేయకుండా భూమిలోనే కలియ దున్నితే ప్రయోజనకరంగా ఉంటుందని […]

Read More
రైతులకు అండగా రైతు సహాయ వేదిక

రైతులకు అండగా రైతు సహాయ వేదిక

సారథి, రామాయంపేట: విద్యుత్ తీగల స్తంభాల మధ్య దూరం తగ్గించి పంట పొలాల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా చూడాలని రైతు సహాయ వేదిక మెదక్ జిల్లా ప్రతినిధులు డి వెంకటేశం, ఎ.రవీందర్ సంబంధిత శాఖ అధికారులను కోరారు. నిజాంపేట మండల కేంద్రానికి చెందిన బత్తుల బాబు అనే రైతు ఎకరా పొలంలో వరి పంట సాగుచేశారు. కొద్దిరోజుల క్రితం జరిగిన అగ్నిప్రమాదంలో అరెకరా పొలం అగ్నికి ఆహుతైంది. ఈ విషయం తెలుసుకున్న రైతు సహాయ వేదిక గ్రూప్ […]

Read More
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

సారథి, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలోని పేరూరు గ్రామానికి చెందిన తోట భాస్కర్ కు ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ చొరవతో సీఎం రిలీఫ్ ఫండ్ రూ.60వేల చెక్కు మంజూరైంది. ఈ చెక్కును సోమవారం టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెనుమల్లు రామకృష్ణారెడ్డి, జడ్పీటీసీ తల్లడి పుష్పలత కలసి భాస్కర్ కు అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు టీఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Read More