Breaking News

Month: February 2021

కరోనాపై అలర్ట్​గా ఉండండి

కరోనాపై అలర్ట్​గా ఉండండి

హైదరాబాద్‌: పొరుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ వైద్యారోగ్యశాఖను సీఎం కె.చంద్రశేఖర్​రావు అలర్ట్​ చేశారు. ఈ మేరకు వైద్యశాఖమంత్రి ఈటల రాజేందర్, ఇతర అధికారుల‌తో సమీక్షించారు. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో ఉన్న జిల్లాలపై ప్రత్యేకదృష్టి సారించాలని సీఎం ఆదేశించారు. కేసులు పెరగకుండా కట్టడికి చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో మరిన్ని కరోనా పరీక్షలు చేయాలని, అలాగే హోం ఐసోలేషన్‌ కిట్లు అందజేయాలని కోరారు. ప్రస్తుతానికి తెలంగాణలో కేసులు భారీగా పెరిగిన దాఖలాలు […]

Read More
మావోయిస్టు మిలీషియా సభ్యుల అరెస్ట్

మావోయిస్టు మిలీషియా సభ్యుల అరెస్ట్

సారథి న్యూస్, వెంకటాపురం: ములుగు జిల్లా నూగురు వెంకటాపురం మండలంలోని పామునూరు అటవీప్రాంతంలో మంగళవారం పేలుడు సామగ్రిని అమర్చుతూ కనిపించిన ఏడుగురు మావోయిస్టు మిలీషియా సభ్యులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ సంగ్రామ్​జీ పాటిల్​వెల్లడించారు. వారి నుంచి మందుగుండు సామగ్రి, టిఫిన్ బాక్స్ లు, వైర్, బ్లేడ్ లు, కత్తులు, గొడ్డళ్లు, బాణాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Read More
ఇగ 6,7,8 క్లాసెస్​షురూ

ఇగ 6,7,8 క్లాసెస్ ​షురూ

సారథి న్యూస్​, హైదరాబాద్‌: తెలంగాణలో బుధవారం నుంచి 6, 7, 8వ తరగతి విద్యార్థులకు తరగతులను ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు తరగతులు ప్రారంభించాలని నిర్ణయించినట్లు ఆమె వెల్లడించారు. అయితే తరగతులను మార్చి 1వ తేదీలోగా ప్రారంభించుకోవచ్చని సూచించారు. స్కూళ్లకు హాజరయ్యే విద్యార్థులు కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి తీసుకోవాలని మంత్రి స్పష్టంచేశారు.

Read More
‘గొర్రెల పంపిణీ’ పేరుతో మోసం

‘గొర్రెల పంపిణీ’ పేరుతో మోసం

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: మాయమాటలు చెప్పి ప్రజలను సీఎం కేసీఆర్​ మోసగిస్తున్నారని మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ విమర్శించారు. గొర్రెల పంపిణీ పథకం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం గొల్ల కురుమలకు అన్యాయం చేసిందన్నారు. మంగళవారం చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని శ్రీనివాస గార్డెన్​లో పార్టీ మండలాధ్యక్షుడు మంగలి యాదగిరి ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశం నిర్వహించారు. 50 ఏళ్లు నిండిన గొల్ల కురుమలకు రూ.3వేల పింఛన్​, రూ.ఆరులక్షల బీమా ఇవ్వాలని డిమాండ్​ చేశారు. ఈనెల 26న జిల్లా […]

Read More
ఉధృతంగా టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు

ఉధృతంగా టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: మండలంలోని జంబికుంట, కమలాపూర్, చీలపల్లి, గ్రామాల్లో మంగళవారం టీఆర్ఎస్​పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. పార్టీ మండలాధ్యక్షుడు మురళిపంతులు, ఎంపీపీ జంగం శ్రీనన్న, కిషన్, సర్పంచ్ లు కుంట్ల రాములు, సాయిలు, ప్రకాష్, ఎంపీటీసీ సభ్యుడు దామోదర్, సహకార సంఘం చైర్మన్ సంజీవ్ రెడ్డి, మాణిక్ రెడ్డి, అంజిరెడ్డి, పాండు, శంకరయ్య, భూమిరెడ్డి, రోశిరెడ్డి, లక్ష్మారెడ్డి, కిష్టారెడ్డి, అశోక్, సాయిరెడ్డి, మాణిక్యం, చీలపల్లి ఉపసర్పంచ్ పాల్గొన్నారు.

Read More
చిటారు కొమ్మన చిరుత

చిటారు కొమ్మన చిరుత

సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలోని దులాపురం అటవీప్రాంతంలో ఓ చిరుత పులి హల్ చల్ చేసింది. సోమవారం ఉదయం కొంగాల గ్రామానికి చెందిన కొందరు ఇల్లు కప్పేందుకు గుట్ట గడ్డి కోసం దులాపురానికి సుమారు 3.కి.మీ. దూరంలో ఉన్న మాసెలొద్ది గుట్టకు వెళ్లారు. వారంతా గడ్డి కోస్తున్న సమయంలో ఏవో పెద్ద పెద్ద అరుపులు వినిపించడంతో భయాందోళనకు గురయ్యారు. అరుపులు వింటూ అటుగా వెళ్లగా, ఎండిన పెద్దచెట్టుపై చిరుత పులిని చూసి ఉలిక్కిపడ్డారు. […]

Read More
నేడు, రేపు వర్షాలు

నేడు, రేపు వర్షాలు

హైదరాబాద్: ఉపరితల ద్రోణి ప్రభావంతో హైదరాబాద్‌ సహా పలు ప్రాంతాల్లో గురువారం రాత్రి నుంచి శుక్రవారం రాత్రి వరకు తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణమంతా చల్లబడి చల్లగాలులు వీస్తున్నాయి. దీంతో ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు గజగజవణికిపోతున్నారు. శని, ఆదివారాల్లో కూడా తెలంగాణలోని పలు ప్రాంతాలకు వర్షసూచన ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్​లోనూ శుక్రవారం పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. శనివారం ఉత్తర కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు జల్లులు, దక్షిణ కోస్తాలో ఉరుములు, […]

Read More
మోసం చేయడం ఆయన నైజం: భట్టి

మోసం చేయడం ఆయన నైజం : భట్టి

సారథి న్యూస్, తుంగపాడు(మిర్యాలగూడ): నూతన వ్యవసాయ చట్టాలు అమలైతే ఐకేపీ సెంటర్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎత్తేయడం ద్వారా ఇటు మహిళలు, అటు రైతులు కోలుకోలేని విధంగా నష్టపోతారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రుణమాఫీ అమలు చేయకుండా రైతులను సీఎం కేసీఆర్ ​మోసం చేస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాయమాటలు చెప్పడం ఆ తర్వాత మోసం చేయడం ఆయన నైజమని ధ్వజమెత్తారు. రైతులతో ముఖముఖి కార్యక్రమంలో భాగంగా ఆయన శుక్రవారం నల్లగొండ […]

Read More