Breaking News

Day: January 19, 2021

కరోనాను ఎదుర్కొనే శక్తి.. గొప్ప వరం

సారథి న్యూస్, మానవపాడు: ఏడాది పాటు ఒకరికి మరొకరు కలవకుండా, తల్లికి పిల్లభారమనేలా కరోనా చేసిందని, మహమ్మారిని తట్టుకునే శక్తి మనకు దేవుడిచ్చిన గొప్ప వరమని జోగుళాంబ గద్వాల జిల్లా జడ్పీ చైర్​పర్సన్ ​సరిత అన్నారు. జిల్లాలోని మానవపాడు ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రంలో మంగళవారం కరోనా వ్యాక్సినేషన్ ​ప్రక్రియను డాక్టర్ దివ్య, డాక్టర్ ఇర్షద్, డాక్టర్ సవిత సమక్షంలో ఆమె ప్రారంభించారు. వాక్సిన్ ను మొదట హెల్త్ వర్కర్, రెండో వ్యాక్సిన్ డాక్టర్ కు ఇచ్చారు. కరోనా […]

Read More
ఉద్రిక్తంగా మారిన ‘చలో రాజ్ భవన్’

ఉద్రిక్తంగా మారిన ‘చలో రాజ్ భవన్’

భట్టి విక్రమార్క సహా కాంగ్రెస్ నేతల అరెస్ట్ పోలీసులు, నాయకులకు మధ్య తోపులాట సారథి న్యూస్​, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. రాష్ట్రం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను కొనసాగించాలని కోరారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్​ చేస్తూ కాంగ్రెస్​ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘చలో రాజ్ భవన్ ’ ఉద్రిక్తంగా మారింది. భట్టి విక్రమార్క, ఇతర […]

Read More
కాళేశ్వరం సంతోషానిచ్చింది

కాళేశ్వరం సంతోషానిచ్చింది

తెలంగాణ సాగునీటి ముఖచిత్రాన్నే మార్చేసింది ఇదే స్ఫూర్తితో తుపాకులగూడెం, దుమ్ముగూడెం పనులు కాళేశ్వరం పర్యటనలో సీఎం కె.చంద్రశేఖర్​రావు ముక్తేశ్వరస్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు సారథి న్యూస్, భూపాలపల్లి: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అనుకున్న సమయంలో ఆశించిన రీతిలో పూర్తయి నీటి పంపింగ్ కూడా నిరాటంకంగా సాగుతోందని సీఎం కె.చంద్రశేఖర్​రావు సంతోషం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన పూర్తికావడంలో కృషిచేసిన నీటిపారుదల శాఖాధికారులు, వర్కింగ్ ఏజెన్సీలు, ఇతర శాఖల ఉద్యోగులను ఆయన అభినందించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన […]

Read More
అన్ని సామాజిక వర్గాలకు సంక్షేమ పథకాలు

అన్ని సామాజిక వర్గాలకు సంక్షేమ పథకాలు

సారథి న్యూస్, మెదక్: రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం మెదక్ ఆర్అండ్ బీ గెస్ట్​ హౌస్​లో మెదక్ నియోజకవర్గ పరిధిలోని 25 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన రూ.15లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, మెదక్ జడ్పీ వైస్ చైర్ పర్సన్ లావణ్యరెడ్డి, నిజాంపేట్ జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్, కౌన్సిలర్ ఆర్ కే శ్రీనివాస్ […]

Read More
టీఆర్​ఎస్​వీ క్యాలెండర్ల ఆవిష్కరణ

టీఆర్​ఎస్​వీ క్యాలెండర్ల ఆవిష్కరణ

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: మెదక్ నియోజకవర్గ టీఆర్​ఎస్​వీ క్యాలెండర్ ను మెదక్​ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి మంగళవారం కొంపల్లిలోని తన నివాసంలో ఆవిష్కరించారు. టీఆర్​ఎస్​వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల సతీశ్​ పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్​ఎస్​వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల సతీష్, మెదక్ నియోజకవర్గ అధ్యక్షుడు రంజిత్​ గౌడ్​, నరేష్, లింగం రాజ్, మల్లేష్, దుర్గగౌడ్, శ్రవణ్ గౌడ్, ముస్తఫా, సాయికిరణ్, ప్రశాంత్ పాల్గొన్నారు.

Read More
ఆర్మీ రిక్రూట్​మెంట్​లో 50 మంది ఎంపిక

ఆర్మీ రిక్రూట్​మెంట్​లో 50 మంది ఎంపిక

సారథి న్యూస్, రామగుండం: సింగరేణి ఆర్జీ–1 డివిజన్ పరిధిలోని జవహర్​ లాల్ నెహ్రూ స్టేడియంలో మంగళవారం నిర్వహించిన ఆర్మీ రిక్రూట్ మెంట్​ టెస్టులో 50 మంది యువకులు ఎంపికయ్యారు. దరఖాస్తు చేసుకున్న 147 మంది అభ్యర్థులకు అన్నిరకాల పరీక్షలు నిర్వహించారు. జీఎం కె.నారాయణ ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఊపి ఆర్మీ రిక్రూట్​మెంట్​ ర్యాలీని ప్రారంభించారు. ఎంపికైన అభ్యర్థులకు 45 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు జి.దామోదర్ రావు, ఎస్ వో–2 జీఎం […]

Read More
సింగరేణిలో కరోనా వ్యాక్సినేషన్​

సింగరేణిలో కరోనా వ్యాక్సినేషన్​

సారథి న్యూస్, రామగుండం: సింగరేణి ఏరియా హాస్పిటల్ లో డాక్టర్లు, మెడికల్ సిబ్బందికి ప్రభుత్వ వైద్యఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కరోనా వ్యాక్సినేషన్​ ప్రక్రియను ఆర్​జీ –1 జీఎం కె.నారాయణ మంగళవారం ప్రారంభించారు. మొదటి దఫాలో ప్రభుత్వం సూచన మేరకు సింగరేణి ఏరియా హాస్పిటల్ లో పనిచేస్తున్న వైద్య, పారిశుద్ధ్య సిబ్బందికి వ్యాక్సిన్​ వేశారు.

Read More
20 నుంచి కార్మిక, కర్షక పోరుయాత్ర

20 నుంచి కార్మిక, కర్షక పోరుయాత్ర

సారథి న్యూస్, రామగుండం: జనవరి 20 నుంచి ఫిబ్రవరి 2 వరకు జరిగే కార్మిక, కర్షక పోరుయాత్రను జయప్రదం చేయాలని సీఐటీయూ పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక శాంతిభవన్​లో పెద్దపెల్లి జిల్లా సీఐటీయూ ఆఫీస్ బేరర్స్​సమావేశం బుర్ర తిరుపతి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దుచేయాలని డిమాండ్​చేశారు. చలిలో పోరాడుతున్న రైతులను పట్టించుకోవడం లేదన్నారు. 30న గోదావరిఖనిలో ముగింపు […]

Read More