Breaking News

20 నుంచి కార్మిక, కర్షక పోరుయాత్ర

20 నుంచి కార్మిక, కర్షక పోరుయాత్ర

సారథి న్యూస్, రామగుండం: జనవరి 20 నుంచి ఫిబ్రవరి 2 వరకు జరిగే కార్మిక, కర్షక పోరుయాత్రను జయప్రదం చేయాలని సీఐటీయూ పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక శాంతిభవన్​లో పెద్దపెల్లి జిల్లా సీఐటీయూ ఆఫీస్ బేరర్స్​సమావేశం బుర్ర తిరుపతి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దుచేయాలని డిమాండ్​చేశారు. చలిలో పోరాడుతున్న రైతులను పట్టించుకోవడం లేదన్నారు. 30న గోదావరిఖనిలో ముగింపు సభ ఉంటుందని స్పష్టంచేశారు. సమావేశంలో శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శులు జ్యోతి, వేల్పుల కుమారస్వామి, కోశాధికారి రామాచారి తదితరులు పాల్గొన్నారు.