దుబాయ్: ఐపీఎల్ సీజన్ 13లో భాగంగా దుబాయ్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్)తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ (ఆర్ఆర్) ఓటమి పాలైంది. దీంతో ఈ టోర్నీ నుంచి రాజస్తాన్ నిష్క్రమించింది. కేకేఆర్ నిర్దేశించిన 192 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 131 పరుగులకే ఓటమి పాలైంది. రాజస్తాన్ జట్టులో జోస్ బట్లర్(35; 22 బంతుల్లో 4×4, 6×1), తెవాటియా(31; 27 బంతుల్లో 4×2, 6×1), శ్రేయస్ […]
అబుదాబి: ఐపీఎల్ 13 సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇక ఇంటిబాట పట్టింది. ఆదివారం చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పరాజయం చెందడంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. తద్వారా ప్లే ఆఫ్ రేసు నుంచి వెళ్లిన రెండో జట్టుగా నిలిచింది. పంజాబ్ ముందుగా బ్యాటింగ్ చేసి 153 స్కోరు చేసింది. ఆ లక్ష్యాన్ని ధోని సేన 18.5 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి టార్గెట్ ఛేదించింది. డుప్లెసిస్(48; 34 బంతుల్లో 4×4, 6×2), రుతురాజ్ గైక్వాడ్(62 […]
సారథి న్యూస్, హుస్నాబాద్: దివ్యాంగులైన ఇద్దరు దంపతులకు ఓ పోలీసు అధికారి తన సొంతఖర్చులతో మరుదొడ్లను కట్టించి మానవతా హృదయం చాటుకున్నారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కట్కూర్ గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన బొజ్జ సంతోష, భర్త కొమురయ్య దంపతులు దివ్యాంగులు. వారి ఆలాన పాలన చూసుకోవడానికి సంతానం కూడా లేకపోవడంతో ప్రతిరోజు కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఆ దంపతులు పడుతున్న అవస్థలు అన్నీఇన్ని కావు. వారి ఇబ్బందులను స్వయంగా చూసి చలించిపోయిన అక్కన్నపేట ఎస్సై కొత్తపల్లి […]
సారథి న్యూస్, పెద్దశంకరంపేట: ఆశ్వయుజ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్దశంకరంపేటలో శనివారం రాత్రి భవానీ మాత పల్లకీ సేవను వైభవంగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన రథంపై అమ్మవారిని ఊరేగిస్తూ.. స్థానిక భవానీ మాత మందిరం నుంచి పట్టణ పురవీధుల గుండా పల్లకీ సేవ నిర్వహించారు. భక్తులు భజనలు, కీర్తనలు పాడుతూ ముందుకుసాగారు. మహిళలు మంగళహారతులతో వచ్చి ప్రత్యేకపూజలు చేశారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
సారథి న్యూస్, రామాయంపేట: మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని చల్మెడ గ్రామంలో ఆదివారం సీఎం రిలీఫ్‌ఫండ్ చెక్కులను ఆ గ్రామ ఎంపీటీసీ సభ్యుడు బాల్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. దొంతర బోయిన సత్తయ్యకు రూ.90వేలు, గొల్ల పోచవ్వ కూతురుకు రూ.60వేల చెక్కులను అందించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఆకుల మహేష్, వార్డ్ సభ్యుడు రవీందర్, గ్రామస్తులు తిర్మలయ్య, శ్రీను, మల్లేశం పాల్గొన్నారు.
సారథి న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: ఓపెన్ యూనివర్సిటీ ఎగ్జామ్స్ నిర్వహణ అభాసుపాలవుతోంది. నిర్వాహకులు బుక్స్, సెలఫోన్స్ ముందుపెట్టుకుని ఎగ్జామ్స్ రాయించడం చర్చనీయాంశంగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని రవి ఐటీఐ కాలేజీలో నాగార్జున యూనివర్సిటీ ఓపెన్ డిస్టెన్స్ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ జోరుగా మాస్ కాపీయింగ్ కొనసాగుతోంది. కోవిడ్ 19 నిబంధనలు పాటించకుండా ఒకే రూమ్ లో 40 మందిని కిక్కిరిసి కూర్చోబెట్టి పరీక్ష రాయిస్తున్నారు. నిర్వాహకులు విద్యార్థుల వద్ద ఒక్కో సబ్జెక్ట్ కు కొంత […]
డివిజన్ల వారీగా రిజర్వేషన్ల జాబితా సిద్ధం ఎస్టీలకు-2, ఎస్సీలకు -10, బీసీలకు- 50 మహిళలకు 75 స్థానాల కేటాయింపు అన్ రిజర్వ్డ్ డివిజన్లు 44 అంతా రెడీచేసిన బల్దియా అధికారులు హైదరాబాద్: హైదరాబాద్ మహానగర పాలకమండలి రిజర్వేషన్లు ఖరారయ్యాయి. రెండు దఫాలు యథాతథంగా కొనసాగించాలని ప్రభుత్వం గత అసెంబ్లీ సమావేశాల్లో చట్టం చేయడంతో గతంలో చేసిన రిజర్వేషన్లు ఈ దఫా కూడా కొనసాగనున్నాయి. ఈ మేరకు మొత్తం 150 స్థానాలకు గానూ జీహెచ్ఎంసీ అధికారులు డివిజన్ల వారీగా […]
సారథి న్యూస్, వాజేడు: ఏటూరు నాగారం టైగర్‌జోన్ ను నిలిపివేయాలని ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసం నాగరాజు అన్నారు. ఆదివారం ఆదివాసీ నవనిర్మాణ సేన ముఖ్యకార్యకర్తల సమావేశం ములుగు జిల్లా అధ్యక్షుడు యెట్టి విద్యాసాగర్ అధ్యక్షతన నిర్వహించారు. ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడానికి సామ్రాజ్యవాద అభివృద్ధి నమూనాను ముందుకు తెస్తున్నారని ఆరోపించారు. ఏటూరు నాగారం అటవీ ప్రాంతంలో అనేక ఆదివాసీ గ్రామాలు ఉన్నాయని, టైగర్ జోన్ ను ఏర్పాటుచేస్తే ఆదివాసీలు నిర్వాసితులు […]