Breaking News

Day: September 22, 2020

జూరాల 27గేట్ల ఎత్తివేత

జూరాల 27గేట్ల ఎత్తివేత

సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జోగుళాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు నీటి ఉధృతి పెరుగుతోంది. గతవారం 27 గేట్లను ఎత్తగా, అదేస్థాయిలో మంగళవారం సాయంత్రం కూడా 27 గేట్లను ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. గంటగంటకూ వరద పెరుగుతుండడంతో నదీతీర ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీచేస్తున్నారు. ప్రస్తుతం 2.27లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

Read More

కరంటోళ్ల నిర్లక్ష్యం.. ఒకరు బలి

సారథి న్యూస్, కంగ్టి(నారాయణఖేడ్): విద్యుత్​ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైంది. మెదక్​ జిల్లా కంగ్టి మండలం తడ్కల్ గ్రామానికి చెందిన హైమద్ షేక్(45) విద్యుత్ శాఖలో రోజువారీ కూలీగా పనిచేస్తున్నాడు. మంగళవారం విద్యుత్​శాఖ విధుల్లో భాగంగా తడ్కల్​లోని ఓ పొలంలో విద్యుత్​ వైర్లను బిగిస్తున్నాడు. కానీ విద్యుత్​ సిబ్బంది, అధికారుల సమన్వయ లోపంతో ఆ సమయంలో విద్యుత్​ సిబ్బంది కరెంట్​ వేశారు. దీంతో హైమద్​ విద్యుత్​ షాక్​తో అక్కడికక్కడే మృతిచెందాడు. విద్యుత్ అధికారుల […]

Read More

సేంద్రియం.. లాభదాయం

సారథి న్యూస్, రామడుగు: రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సాధించాలంటే సేంద్రియ వ్యవసాయం చేసుకోవాలని రామడుగు ఎంపీపీ కె.కవిత సూచించారు. మంగళవారం రామడుగు మండలం శనగర్ లో ఆత్మ, వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. వరి, పత్తిలో చీడపీడల నివారణపై పలువరు శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో చొప్పదండి ఏడీఏ రామారావు, మండల వ్యవసాయ అధికారి యాస్మిన్, జడ్ఆర్ఎస్ఎస్ మెంబర్​ గర్రెపల్లి కర్ణాకర్, వీడీసీ చైర్మన్​ కర్ణాకర్, ఉపసర్పంచ్ వెంకట్ నర్సయ్య, ఆత్మ […]

Read More

సులభ్​ కాంప్లెక్స్​ కోసం వినతి

సారథిన్యూస్, రామడుగు: రామడుగు మండల కేంద్రంలో సులభ్​ కాంప్లెక్స్​ నిర్మించాలని గ్రామ యువకులు.. కార్యదర్శి జ్యోతికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సులభ్​ కాంప్లెక్స్​ లేకపోవడంతో వివిధ గ్రామాల నుంచి రామడుగు మండల కేంద్రానికి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో అనుపురం పరుశరాం, పురేళ్ల శ్రీకాంత్, మామిడి అంజి, ఉత్తేమ్, మహేశ్​ తదితరులు ఉన్నారు.

Read More
గ్రాడ్యుయేట్​ఎన్నికల ఓటరు నమోదు షురూ

గ్రాడ్యుయేట్ ​ఎన్నికల ఓటరు నమోదు షురూ

సారథి న్యూస్, హైదరాబాద్: ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్, ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎన్నికల ఓటర్ నమోదు ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించింది. వచ్చేనెల 1వ తేదీ నుంచి ఓటరు నమోదుకు నోటీస్ జారీచేసింది. నవంబర్ 6వ తేదీ వరకు కొత్త ఓటరు నమోదుకు దరఖాస్తులను స్వీకరించనుంది. డిసెంబర్ 1న ఓటరు జాబితా ముసాయిదా విడుదల చేయనుంది. డిసెంబర్ 31వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించి.. 2021 జనవరి 12వ తేదీ […]

Read More
ప్రభాస్ సినిమాకు క్రియేటివ్ హెడ్ గా ‘సింగీతం’

ప్రభాస్ సినిమాకు క్రియేటివ్ హెడ్ గా ‘సింగీతం’

ప్రభాస్ సినిమా అంటేనే ఓ క్రేజీ. సినిమా అనౌన్స్​మెంట్​ అయిన దగ్గరి నుంచి హీరోయిన్ ఎవరు? విలన్ ఎవరు? మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? అన్న క్రేజీ డౌట్స్ ఎక్కువ అయిపోతుంటాయి ఫ్యాన్స్ కు. ప్రస్తుతం రాధాకృష్ణ డైరెక్షన్​లో ‘రాధేశ్యామ్’ చేస్తున్న ప్రభాస్ నాగ్ అశ్విన్ డైరెక్షన్​, బాలీవుడ్ డైరెక్షర్ ఓంరౌత్ డైరెక్షన్​లో రెండు సినిమాలకు కమిట్ మెంట్ ఇచ్చాడు. ఒకటి మైథలాజికల్ మూవీ అయితే నాగ్ అశ్విన్ మాత్రం ప్రభాస్ కోసం సైన్స్ ఫిక్షన్ జానర్​ను ఎన్నుకున్నాడు. […]

Read More
‘నిశ్శబ్దం’పై భారీ అంచనాలు

‘నిశ్శబ్దం’పై భారీ అంచనాలు

‘భాగమతి’ సినిమా తర్వాత అనుష్క చాలా గ్యాప్ తీసుకుని చేస్తున్న మూవీ కావడంతో ‘నిశ్శబ్దం’పై భారీ అంచనాలే ఉన్నాయి. అదికాకుండా ఈ మూవీని థియేటర్ లో మాత్రమే రిలీజ్ చేయాలనుకుంది టీమ్. అందుకు మరికొంత సమయం పట్టడం ఆడియాన్స్​లో క్యూరియాసిటీ తగ్గిపోతుందేమోనన్న ఆలోచనతో అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. అనుష్క, ఆర్.మాధవన్ ప్రధాన పాత్రల్లో సస్పెన్స్ థ్రిల్లర్ ‘నిశ్శబ్దం’ మూవీని తెరకెక్కించాడు డైరెక్టర్ హేమంత్ మధుకర్. తెలుగు తమిళ […]

Read More
గ్రేటర్​ ఎన్నికలు ఉన్నాయనే కాంగ్రెస్​ డ్రామాలు

గ్రేటర్​ ఎన్నికలు ఉన్నాయనే కాంగ్రెస్​ డ్రామాలు

సారథి న్యూస్​, హైదరాబాద్​: హైదరాబాద్ లో డబుల్ బెడ్ రూమ్​ఇళ్లు కట్టామని తాము ఒకచోట చెబితే కాంగ్రెస్​నేతలు మరోచోటుకు వెళ్లారని మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​విమర్శించారు. కాంగ్రెస్​ ప్రభుత్వ హయాంలో జరిగిన భీమ్​రావు వాడ వివాదం అందరికీ తెలిసిందేనని అన్నారు. జీహెచ్​ఎంసీ ఎన్నికలు ఉన్నాయనే కాంగ్రెస్​ డ్రామాలు ఆడుతోందని విమర్శించారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్​ నేతల తీరు కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టుందిగా ఉందని ఎద్దేవాచేశారు. దేశాన్ని, రాష్ట్రాన్ని […]

Read More