సారథి న్యూస్, ఖమ్మం: రానున్న ఖమ్మం, వరంగల్, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సన్నాహక సమావేశంలో భాగంగా పాలేరు నియోజకవర్గ స్థాయి సమావేశం ఆదివారం నాయుడుపేటలోని రామలీల ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పార్టీ శ్రేణులతో మాట్లాడారు. పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతిఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్నిర్ణయించిన అభ్యర్థి ఎవరైనా తమ వంతుగా గెలిపించుకోవాలని పాలేరు ఎమ్మెల్యే కందుల ఉపేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. సమావేశంలో […]
సారథి న్యూస్, హుస్నాబాద్: ప్రభుత్వ నిషేధిత గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నట్లు బెజ్జంకి ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. మండల కేంద్రంలో పొగాకు, గుట్కా ప్యాకెట్లు విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో పట్టణంలోని పలు కిరాణా షాపుల్లో పోలీస్ సిబ్బందితో తనిఖీలు నిర్వహించగా రూ.42,800 విలువైన అంబర్, గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ప్రభుత్వం నిషేధించిన పొగాకు గుట్కా ప్యాకెట్లు అమ్ముతున్న ఏ.సంతోష్, ఎం.రమేష్, డి.నాగరాజు, ఎండీ మసూద్ హైమద్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో ఆదివారం(24 గంటల్లో) కొత్తగా 2,137 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,71,306కు చేరింది. 2,192 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్అయ్యారు. ఇప్పటివరకూ కోలుకున్నవారి సంఖ్య 1,39,700కు చేరింది. మహమ్మారి బారినపడి తాజాగా 8 మంది మృత్యువాతపడ్డారు. మొత్తంగా వ్యాధి కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 1,033కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 30,573 మంది చికిత్స పొందుతున్నారు. కాగా, శనివారం ఒక్కరోజే 53,811 […]
నడిచే వెళ్తున్న 60 శాతం విద్యార్థులు బాలికలు మరో రెండు శాతం అధికం ప్రజారవాణాలో వెళ్లేది 12 శాతమే న్యూఢిల్లీ: దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 73 ఏళ్లు గడుస్తున్నా.. బడికి వెళ్లే విద్యార్థులకు బాధలు తప్పడం లేదు. ఇప్పటికీ దేశంలో 60శాతానికి పైగా పిల్లలు కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూళ్లకు కాలినడకన వెళ్తున్నారు. ప్రజారవాణా సరిగా లేక.. గిరిజన గూడేలు వంటి చోట అసలు రవాణా సదుపాయాలే లేకపోవడంతో భవిష్యత్భారతమంతా బ్యాగుల భారం మోస్తూ కాలినడకనే స్కూళ్లకు […]
సారథి న్యూస్, మెదక్: మెదక్ జిల్లా ఎస్పీ చందనాదీప్తి ఆదేశాల మేరకు జిల్లా ఐటీ కోర్ ఎస్సై ప్రభాకర్ జిల్లాలో కోర్టు విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగానే నేరస్తులకు సమన్లు, నాన్ బెయిలబుల్ వారెంట్లు సీసీటీఎన్ఎస్లో నమోదుచేసే విధానంపై శిక్షణ ఇచ్చారు. క్రిమినల్ జస్టిస్ సిస్టం ద్వారా ఎంట్రీ చేసిన డాటా దేశంలో ఎక్కడైనా ఏ అధికారి అయినా చూసుకునే అవకాశం ఉంటుందని, కావునా ప్రతి ఒక్కరూ […]
సారథి న్యూస్, కర్నూలు: జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలకు సన్నాహాలు పూర్తయ్యాయి. జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్(సంక్షేమం) సయ్యద్ ఖాజామోహిద్దీన్, జడ్పీ సీఈవో వెంకటసుబ్బయ్య, ఇతర అధికారులు పనిలో నిమగ్నమయ్యారు. ప్రభుత్వం నిర్ణయించిన విధంగా ఈనెల 20 నుంచి 26వ తేదీ వరకు ఆదోని, ఎమ్మిగనూరు, ఆళ్లగడ్డ, నంద్యాల, డోన్, కర్నూలు క్లస్టర్ల పరిధిలో ఉదయం 127 పరీక్ష కేంద్రాలు, మధ్యాహ్నం 67 కేంద్రాలు మొత్తం కలిపి 194 కేంద్రాల్లోని 5,542 […]
సారథి న్యూస్, కర్నూలు: ఎస్ వీ సుబ్బారెడ్డి ఫౌండేషన్ ద్వారా సచివాలయ ఉద్యోగాలకు ఉచిత కోచింగ్ తీసుకుంటున్న అభ్యర్థులకు కరెంట్ అఫైర్స్గ్రాండ్ ఫైనల్ టెస్ట్ప్రశ్నపత్రాన్ని మాజీమంత్రి ఎస్వీ సుబ్బారెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్దాసరి శ్రీనివాసులు శనివారం ఆవిష్కరించారు. అభ్యర్థులు కష్టపడి చదివి విజయం సాధించాలని కోరారు. అనంతరం అధ్యాపక బృందానికి కృతజ్క్షతలు తెలిపారు. కార్యక్రమంలో కోఆర్డినేటర్ వైవీ శివయ్య, షరీఫ్, మధు, బాషా, చంద్రారెడ్డి, ఎస్టీ బాబు పాల్గొన్నారు.
సారథి న్యూస్, రామడుగు: అందమైన అమ్మాయిల ఫొటోలు, ఆకర్షణీయమైన ప్రొఫైల్ పిక్స్‌తో కొందరు ఫేస్బక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తుంటారు. మరికొందరేమో పోలీస్ అధికారులు, సెలబ్రిటీల పేరుతో ఫేక్ ఐడీలు క్రియేట్ చేసుకుంటారు. అటువంటి వారికి మనం ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపినా.. మనకు వచ్చిన రిక్వెస్టులను యాక్సెప్ట్ చేసినా చిక్కుల పడడం ఖాయమని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఈ విషయంపై శనివారం కరీంనగర్ జిల్లా రామడుగు ఎస్సై అనూష మాట్లాడుతూ.. పోలీస్ అధికారి పేరుతో ఫేస్బుక్లో చాలా తప్పడు ఐడీలు […]