సామాజికసారథి, వనపర్తి: కంచే చేను మేసిందన్న చందంగా అవినీతి, అక్రమాలను అడ్డుకోవాల్సిన అధికారులే అడ్డదారులకు సహకరిస్తుండటం వనపర్తి జిల్లా విద్యాశాఖలో చర్చనీయాంశంగా మారింది. గవర్నమెంట్ స్కూళ్ల విద్యాభివృద్దికి ప్రభుత్వం చొరవ తీసుకుంటుండడాన్ని కొందరు విద్యాశాఖ అధికారులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ప్రస్తుత ప్రభుత్వం టీచర్లకు పదోన్నతులు ఇవ్వడంతో పాటు ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగాలను సైతం ఇటీవల భర్తీ చేసింది. దీంతో కొత్త టీచర్లు జాయిన్ కావడం, మరికొందరు ప్రమోషన్లతో ఇతర స్కూళ్లకు వెళ్లిపోవడంతో జిల్లాలో అక్కడక్కడా […]
సారథి న్యూస్, హైదరాబాద్: ఫిబ్రవరి 1నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో 9, 10వ తరగతులకు విద్యార్థులను పంపించేందుకు 60శాతం మంది తల్లిదండ్రులు అంగీకార పత్రాలు అందించారని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో విద్యాశాఖ అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యాసంస్థల పునఃప్రారంభం, ఇతర అంశాలపై అధికారులతో సమీక్షించారు. తరగతి గదిలో విద్యార్థుల మధ్య భౌతికదూరం పాటించాలని మంత్రి సూచించారు. 9వ తరగతిలోపు విద్యార్థులకు డిజిటల్ […]
నడిచే వెళ్తున్న 60 శాతం విద్యార్థులు బాలికలు మరో రెండు శాతం అధికం ప్రజారవాణాలో వెళ్లేది 12 శాతమే న్యూఢిల్లీ: దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 73 ఏళ్లు గడుస్తున్నా.. బడికి వెళ్లే విద్యార్థులకు బాధలు తప్పడం లేదు. ఇప్పటికీ దేశంలో 60శాతానికి పైగా పిల్లలు కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూళ్లకు కాలినడకన వెళ్తున్నారు. ప్రజారవాణా సరిగా లేక.. గిరిజన గూడేలు వంటి చోట అసలు రవాణా సదుపాయాలే లేకపోవడంతో భవిష్యత్భారతమంతా బ్యాగుల భారం మోస్తూ కాలినడకనే స్కూళ్లకు […]
సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లు, హెడ్‌మాస్టర్లు, ప్రిన్సిపల్స్, లెక్చరర్లు స్టేట్ లెవెల్ బెస్ట్ టీచర్ అవార్డుకు దరఖాస్తు చేసుకోవాలని స్కూలు ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేన కోరారు. ఆగస్టు 7లోగా డీఈవోలకు అప్లికేషన్స్ పంపించాలని సూచించారు. హెడ్‌మాస్టర్లు, ప్రిన్సిపల్స్ కు 10, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్టీజీ, పీజీటీ, టీజీటీలకు 31, డైట్, సీటీఈ, ఐఏఎస్ఈ లెక్చరర్లకు రెండు అవార్డుల చొప్పున ఇవ్వనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు సంబంధిత డీఈవో ఆఫీసుల్లో సంప్రదించాలని సూచించారు.