ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి నీటి విడుదల జూరాల నుంచి శ్రీశైలం వైపునకు కృష్ణానది పరవళ్లు సారథి న్యూస్, కర్నూలు: కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు ఆల్మట్టి, నారాయణపూర్, ఉజ్జాయిని ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో జూరాలకు వరద ఉరకలెత్తుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 7.759 టీఎంసీల నిల్వ ఉంది. ప్రాజెక్టు నీటిమట్టం 318.516 మీటర్లు కాగా, ప్రస్తుతం 317.560 […]
వర్షాలు, వరదలు వస్తున్నందున జాగ్రత్తగా ఉండండి సహాయక చర్యలకు ఎంతఖర్చయినా వెనుకాడొద్దు ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించండి ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో సీఎం కె.చంద్రశేఖర్‌రావు సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా భారీవర్షాలు, వరదలు సంభవిస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండి ప్రాణ, ఆస్తినష్టం సంభవించకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రజాప్రతినిధులు, అధికారులను ఆదేశించారు. ఏ ఒక్కరి ప్రాణం పోకుండా కాపాడడమే ప్రధాన లక్ష్యంగా అధికార యంత్రాంగం […]
సారథి న్యూస్, హైదరాబాద్: సెప్టెంబర్ 7 నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. సోమవారం ప్రగతి భవన్ లో ఆయన పలువురు మంత్రులతో చర్చించారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక ముఖ్యమైన అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నందున అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించారు. 20రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం ద్వారా పలు అంశాలపై సమగ్రచర్చ జరిపే అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి, మంత్రులు అభిప్రాయపడ్డారు. కనీసం 15 రోజుల పనిదినాలైనా […]
నడియాడ్: ఎదురెదురుగా వస్తున్న రెండుకార్లు ఢీకొన్న ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పయారు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్-వడోదర 8వ నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి చోటుచేసుకున్నది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను నడియాడ్‌లోని సివిల్ ఆస్పత్రికి తరలించినట్లు అగ్నిమాపకశాఖ సూపరింటెండెంట్ దీక్షిత్ పటేల్ తెలిపారు. కేసు నమోదుచేసిన పోలీసులు, ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు.
విజయవాడ రమేశ్ హాస్పిటల్స్ వ్యవహారంపై సంచలన ట్వీట్లు పెట్టిన రామ్ పోతినేని వెనక్కి తగ్గాడు. ఇకమీదట తాను ఈ ఘటనపై ఎటువంటి ట్వీట్లు పెట్టబోనని మరో ట్వీట్పెట్టాడు. న్యాయంపై తనకు నమ్మకుందని చెప్పుకొచ్చాడు. నిజమైన దోషులకు శిక్షపడుతుందని భావిస్తున్నా అని చెప్పాడు. రామ్ ట్వీట్లు సంచలనంగా మారడంతో.. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా విభాగం ఓ రేంజ్లో విరుచుకుపడింది. స్వర్ణప్యాలెస్‌లో 10 మంది చనిపోతే స్పందించని రామ్.. ఇప్పడు ఆయన బంధువు మీదకొచ్చేసరికి నీతులు బోధిస్తున్నాడంటూ ఫైర్ అయ్యారు […]
ఢిల్లీ: ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్బుక్.. భారతీయజనతాపార్టీకి సహకరిస్తోందని అమెరికాకు చెందిన ‘ది వాల్‌స్ట్రీట్ జర్నల్’ ఓ కథనం ప్రచరించింది. ఇందుకోసం బీజేపీ తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ పెట్టిన పోస్టులను ఆ కథనంలో ప్రస్తావించారు. కాగా ఈ కథనం ఆధారంగా కాంగ్రెస్ బీజేపీపై విరుచుకుపడింది. రాహుల్‌గాంధీ కూడా ఫేస్బుక్ బీజేపీకి సహకరిస్తోందంటూ ఆరోపించారు. ఇన్నిరోజులకు అమెరికాకు చెందిన మీడియా వార్తలు ప్రచురిందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఫేస్బుక్ స్పందించింది. తమకు ఏ రాజకీయపార్టీతోనూ సంబంధం లేదని […]
న్యూఢిల్లీ: కొందరు తనను చంపేందుకు కుట్ర పన్నుతున్నారని.. తన ప్రాణాలను కాపాడాలని ఫేస్బుక్ పబ్లిక్ పాలసీ డైరెక్టర్ అంకిదాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై పోలీసులు వెంటనే కేసు నమోదు చేయాలని ఆమె పోలీసులను కోరారు. అమెరికాకు చెందిన వాల్‌స్ట్రీట్ జర్నల్(డబ్ల్యూఎస్‌జే) ఫేస్‌బుక్‌పై ఓ సంచలన కథనం ప్రచురించింది. ఈ కథనం మనదేశ రాజకీయాల్లో తీవ్రదుమారం రేపింది. భారత్‌లో ఫేస్బుక్.. బీజేపీ ములాఖత్ అయ్యాయని అందుకే బీజేపీకి చెందినవారు హింసాత్మక పోస్టులు చేసిన ఫేస్బుక్ తొలిగించడం […]
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యపరిస్థితి విషమంగానే ఉంది. ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్టు ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రి సోమవారం ప్రకటన విడుదల చేసింది. కాగా, ప్రణబ్ శరీరం చికిత్సకు కొంతమేర సహకరిస్తున్నదని వారు చెప్పారు. ప్రణబ్ ముఖర్జీ ఈ నెల 10న ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో చేరారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆయనకు ఓ మేజర్ శస్త్రచికిత్స చేశారు వైద్యులు. తర్వాత ఆయనకు కరోనా కూడా సోకడంతో పరిస్థితి మరింత విషమించింది. ప్రస్తుతం ట్రీట్మెంట్ […]