Breaking News

Day: August 16, 2020

కోయిల్​సాగర్​నుంచి నీటివిడుదల

కోయిల్​సాగర్ ​నుంచి నీటి పరవళ్లు

సారథి న్యూస్, దేవరకద్ర: మహబూబ్​నగర్ ​జిల్లాలోని భారీ సాగునీటి పారుదల ప్రాజెక్టు కోయిల్ సాగర్ ఐదు షట్టర్లను ఆదివారం తెరిచి అధికారులు దిగువకు నీటిని విడుదల చేశారు. ఇటీవల కురుస్తున్న భారీవర్షాలకు ప్రాజెక్టులోకి వరద ఉధృతి కొనసాగుతోంది. పెద్దఎత్తున ప్రవాహం వచ్చి చేరుతుండడంతో ముందు జాగ్రత్త చర్యల్లో గేట్లు ఎత్తివేశారు. ప్రాజెక్టు పూర్తి నీటినిల్వ సామర్థ్యం 32.5 ఫీట్లు ఉండగా, ప్రస్తుతం 32 ఫీట్లకు చేరింది. ప్రాజెక్టుకు కోయిలకొండ, అంకిళ్ల వాగుల నుంచి పెద్దఎత్తున వరద వచ్చి […]

Read More
ఆంధ్రప్రదేశ్​లో 8,732 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్​లో 8,732 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్​లో ఆదివారం కొత్తగా 8,732 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,81,817కు చేరింది. మహమ్మారి బారినపడి తాజాగా 87 మంది చనిపోయారు. దీంతో ఇప్పటివరకు మృతుల సంఖ్య 2,650కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 88,138 యాక్టివ్​ కేసులు ఉన్నాయి. 1,91,117 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ ​అయ్యారు. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. అనంతపురం 580, చిత్తూరు 981, ఈస్ట్ ​గోదావరి 875, గుంటూరు 590, కడప 286, కృష్ణా […]

Read More
మంత్రి సుడిగాలి పర్యటన

మంత్రి సుడిగాలి పర్యటన

సారథి న్యూస్, వనపర్తి: వనపర్తి జిల్లా ఘణపురం మండల కేంద్రంలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి ఆదివారం పర్యటించారు. స్థానిక గ్రామపంచాయతీ ఆవరణలో ఉన్న రైతుబజార్, మాంసం, కూరగాయల మార్కెట్ ను పరిశీలించారు. ఆయన వెంట ఎంపీపీ కృష్ణనాయక్, జడ్పీటీసీ సభ్యుడు సామ్యా నాయక్, ఎంపీటీసీలు, వివిధ గ్రామాల సర్పంచ్ లు ఉన్నారు.

Read More
పోలీస్​ కమిషనరేట్​ను కంప్లీట్​ చేయండి

పోలీస్​ కమిషనరేట్​ను కంప్లీట్​ చేయండి

సారథి న్యూస్, సిద్దిపేట: సిద్దిపేట నూతన పోలీస్ కమిషనరేట్ పనులను తొందరగా పూర్తిచేయాలని అధికారులు, కాంట్రాక్టర్లను మంత్రి టి.హరీశ్​రావు ఆదేశించారు. సిద్దిపేట జిల్లా దుద్దెడ గ్రామశివారులో నిర్మిస్తున్న కొత్త పోలీస్ కమిషనరేట్ పనులను ఆదివారం జిల్లా కలెక్టర్​ పి.వెంకట్రామరెడ్డి, పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ తో కలిసి పరిశీలించారు. హైవేకు ఆనుకుని కమిషనరేట్​కు వచ్చేలా దారి అంశంపై పోలీస్ అధికారులతో చర్చించారు. 7.30 ఎకరాల విస్తీర్ణంలో పోలీస్ పరేడ్ గ్రౌండ్, పోలీస్ క్వార్టర్స్, ఏఆర్ హెడ్ క్వార్టర్స్​తదితర […]

Read More
మాజీ ఓపెనర్​ చేతన్ చౌహాన్‌ కన్నుమూత

మాజీ ఓపెనర్​ చేతన్ చౌహాన్‌ కన్నుమూత

ఢిల్లీ: టీమిండియా మాజీ ఓపెనర్‌ చేతన్‌ చౌహాన్ (73)‌ కరోనాతో పోరాడుతూ ప్రాణాలు విడిచారు. ఈ విషయాన్ని అతని సోదరుడు పుష్పేంద్ర చౌహాన్ మీడియాకు వెల్లడించారు. జులై 12న కరోనా వైరస్‌ బారిన పడడంతో అతని మొదట లఖ్‌నౌవూలోని ఓ ఆస్పత్రిలో చేర్చారు. ఆరోగ్యం మరింత క్షీణిస్తుండడంతో గురుగ్రామ్‌లోని మరో ఆస్పత్రికి తరలించారు. అతని కిడ్నీతో సహా కొన్ని అవయవాలు పాడవడంతో పరిస్థితి విషమంగా మారింది. దీంతో అతణ్ని వెంటిలేటర్‌పై ఉంచారు. ఈ క్రమంలో చేతన్‌ చౌహాన్‌ […]

Read More
ముంపు బాధితులకు అండగా ఉంటాం

ముంపు బాధితులకు అండగా ఉంటాం

సారథి న్యూస్​, వరంగల్​: వరంగల్ మహానగరంలో భారీవర్షాలకు నీటమునిగిన లోతట్టు కాలనీలు, పలు ప్రాంతాలను తెలంగాణ రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ, పంచాయతీ రాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదివారం పరిశీలించారు. ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పునరావాస ప్రాంతాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. నగరంలోని ములుగు రోడ్డు, కాశీబుగ్గ, పద్మానగర్, ఎస్ఆర్ నగర్, చిన్నవడ్డేపల్లి చెరువు, తులసి బార్, సమ్మయ్య నగర్, నయీనగర్ తదితర ప్రాంతాల్లో విస్తృతంగా కలియ […]

Read More
ధైర్యంగా ఉండండి.. ఆందోళన వద్దు

ధైర్యంగా ఉండండి.. ఆందోళన వద్దు

మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ భరోసా మున్నేరు ముంపు పునరావాస కేంద్రాల పరిశీలన సారథి న్యూస్​, ఖమ్మం: ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ప్రవహిస్తున్న మున్నేరు కాల్వ ఒడ్డు ముంపు ప్రాంతవాసులకు నయాబజార్ స్కూలు​, ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాలను రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదివారం సందర్శించారు. నిర్వాసితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. […]

Read More
మట్టిమిద్దెల్లో ఉండేటోళ్లు జాగ్రత్తగా ఉండాలే

మట్టిమిద్దెల్లో ఉండేటోళ్లు జాగ్రత్తగా ఉండాలే

సారథి న్యూస్, వెల్దండ: బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా కురుస్తున్న వర్షాలకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని నాగర్​కర్నూల్​ జిల్లా వెల్దండ తహసీల్దార్ జి.సైదులు సూచించారు. గ్రామాల్లో పాత మట్టిమిద్దెల్లో నివాసం ఉంటున్నవారు ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించకుండా ముందస్తుగా సురక్షిత నివాస ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. వర్షాలకు గ్రామాల్లో దెబ్బతిన్న ఇళ్ల సమాచారాన్ని ఎప్పటికప్పుడు సంబంధిత వీఆర్వో, వీఆర్ఏలకు తెలియజేయాలని కోరారు. రెవెన్యూ సిబ్బంది గ్రామాల్లో అందుబాటులో ఉంటారని స్పష్టంచేశారు. ఇళ్లు కోల్పోయి ఇబ్బంది పడుతున్న వారు ప్రభుత్వ […]

Read More