సారథి న్యూస్, దేవరకద్ర: మహబూబ్‌నగర్ జిల్లాలోని భారీ నీటిపారుదల ప్రాజెక్టు కోయిల్ సాగర్ నిండుకుండలా మారింది.. భారీవర్షాలకు జలకళ సంతరించుకుంది. ప్రస్తుతం నీటిమట్టం 30 ఫీట్లకు చేరింది. కోయిల్‌సాగర్ ప్రాజెక్టును 1954 లో నిర్మించారు. అప్పటి కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి కేఎం ఖర్జూ ప్రాజెక్టును ప్రారంభించి మొట్టమొదటిసారిగా ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టును అప్పట్లో కేవలం వర్షాధారం ప్రాతిపదికగానే 12వేల ఎకరాలకు సాగునీటిని అందించేలా నిర్మించారు. ఆ తర్వాత ఎత్తిపోతల పథకంగా మార్చారు. ఇక్కడి నుంచి […]
హైదరాబాద్: సోషల్ మీడియా పోస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తిచేశారు. సోషల్ మీడియాలో తప్పడు పోస్టులు బెంగళూరులో ఎంత విద్వేషానికి దారి తీశాయో, ఎంత ప్రాణ, ఆస్తినష్టానికి కారణమైందో తెలుసుకోవాలని కోరారు. శాంతి భద్రతలను దెబ్బతీసే అలాంటి పోస్టులు పెట్టొద్దని సూచించారు. సోషల్ మీడియాలో విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిని తెలంగాణ పోలీసులు నిరంతరం గమనిస్తున్నారని, అలాంటి వారిపై వెంటనే కేసులు పెట్టి, కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో గురువారం 1,931 కరోనా కేసులు నమోదయ్యాయి. వ్యాధిబారినపడి తాజాగా 11 మంది మృతిచెందారు. అయితే మహమ్మారి బారినపడి ఇప్పటి వరకు 665 మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 86,475 కేసుల నిర్ధారణ అయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఒకేరోజు 293 కేసులు నిర్ధారణ అయ్యాయి. 24 గంటల్లో 1,780 మంది కరోనా నుంచి రికవరీ అయినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం యాక్టివ్‌కేసులు 22,736 ఉన్నాయి. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. వరంగల్ అర్బన్ […]
సారథి న్యూస్, రామడుగు: కరోనాపై సామాజిక మాధ్యమాల్లో తప్పడు ప్రచారం చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని కరీంనగర్ జిల్లా రామడుగు ఎస్సై అనూష హెచ్చరించారు. కరోనా వచ్చిందని రోగుల వివరాలు బయటపెడితే చర్యలు తప్పవన్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే గ్రూప్ అడ్మిన్లపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఐపీసీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆక్ట్, ఎపిడమిక్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కరోనా కట్టడిలో మండల ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.
సారథి న్యూస్, చిన్నశంకరంపేట: మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం చందాపూర్ గ్రామంలో బుధవారం రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రావణి తెలిపారు. మొత్తం 11 మందికి టెస్టులు నిర్వహించగా వారిలో ఇద్దరికి పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే మాస్కులు ధరించి బయటకు రావాలని సూచించారు. కరోనా లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంప్రదించి టెస్టులు చేసుకోవాలన్నారు.
సారథి న్యూస్, రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండంలో బుధవారం అఖిలభారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీపీఐ నగర కార్యదర్శి కె.కనకరాజు జెండాను ఆవిష్కరించారు. ఏఐఎస్ఎఫ్ మతోన్మాద శక్తులకు వ్యతిరేంగా పోరాటాన్ని కొనసాగిస్తుందని చెప్పుకొచ్చారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నగర అధ్యక్ష, కార్యదర్శులు రేణుగుంట ప్రీతం, ఈర్ల రామచందర్ పాల్గొన్నారు.