న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ విడుదల, పంపిణీపై కేంద్ర ఎక్స్ పర్ట్ కమిటీ కీలక సమావేశం జరుపనుంది. ఇండియాకు సరిపోయే వ్యాక్సిన్ ను ఎంపిక చేయడం, దాని తయారీ, డెలివరీలతో పాటు ముందుగా వ్యాక్సిన్ ఎవరికి ఇవ్వాలన్న విషయాలపై ఈ కమిటీ చర్చించనుందని తెలుస్తోంది. నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పౌల్ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు, వ్యాక్సిన్ తయారీ సంస్థలు భాగం కానున్నాయని ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ వెల్లడించారు. ఇదే […]
సారథి న్యూస్, హైదరాబాద్: జినోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ కోసం ఇప్పుడు దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా? అని ఇతర దేశాలు కూడా ఎదురు చూస్తున్నాయి. భారత్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన వ్యాక్సిన్ నిమ్స్ లో చివరి దశలో ఫస్ట్ ఫేజ్ క్లినికల్ ట్రయల్స్ ఉన్నాయని అధికారులు వెల్లడించారు. మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా వాలంటీర్లకు బూస్టర్ డోస్ ఇచ్చింది వైద్య […]
వాషింగ్టన్: కమలా హ్యారిస్‌కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. డెమొక్రటిక్ పార్టీ తరఫున కమలా హ్యరీస్ అమెరికా ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థికి ఎంపికైనా విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖలు ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు. తాజాగా బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఆమెకు అభినందనలు తెలిపారు. ‘ కమలా హ్యారిస్ ఎంపిక అన్ని వర్గాలకు చెందిన మహిళలకు, ముఖ్యంగా నల్లజాతి, దక్షిణాసియా మహిళలకు గర్వకారణమని చెప్పుకోవచ్చు’ అంటూ ఇన్‌స్టాగ్రాంలో ఆమె ఫోటోను షేర్ చేశారు.
తెలుగులో విజయం సాధించిన ‘వినాయకుడు’ చిత్రాన్ని బాలీవుడ్లో రీమేక్ చేయనున్నట్టు సమాచారం. కొంతకాలంగా తెలుగులో సూపర్ హిట్ అయిన చిత్రాలను బాలీవుడ్లో రీమేక్ చేసేందుకు అక్కడి దర్శకనిర్మాతలు పోటీపడుతున్నారు. ఇప్పటికే పలు సినిమాలు బాలీవుడ్ రీమేక్ కు రెడీ అయ్యాయి. చాలా కాలం క్రితం తెలుగులో హిట్ అయిన దూకుడు, అరుంధతి వంటి సినిమాలను ప్రస్తుతం రీమేక్ చేస్తున్నారు బాలీవుడ్ నిర్మాతలు. కాగా దాదాపు 12 ఏళ్ల క్రితం కృష్ణుడు హీరోగా నటించిన ‘వినాయకుడు’ సినిమాను హిందీ […]
సారథి న్యూస్, హైదరాబాద్: సీఎం కె.చంద్రశేఖర్‌రావు మార్గదర్శకం, కృషివల్ల తెలంగాణలో జలవిప్లవం వచ్చిందని, లక్షలాది ఎకరాల బీడు భూములు కృష్ణా, గోదావరి నదుల నీటితో సస్యశ్యామలం అవుతోందని పరిశ్రమలశాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. తెలంగాణ ఆహారశుద్ధి, లాజిస్టిక్స్ పాలసీలపై చర్చించి గైడ్ లైన్స్ రూపకల్పనకు బుధవారం ప్రగతి భవన్ లో మంత్రులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో నీలివిప్లవం(మత్స్య పరిశ్రమ), గులాబీ విప్లవం (మాంస ఉత్పత్తి పరిశ్రమ) శ్వేతవిప్లవం (పాడి […]
సారథి న్యూస్, ఎమ్మిగనూరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో పూర్తిగా విఫలమైందని ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వరరెడ్డి మండిపడ్డారు. దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 3వ స్థానంలో ఉందని గుర్తుచేశారు. బుధవారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. జాతీయస్థాయిలో కరోనా కేసుల రికవరీ రేటు శాతం దాదాపు 69.29% ఉండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10% తక్కువగా 60.8% నమోదవుతుందన్నారు. కరోనా క్వారంటైన్ […]
సారథి న్యూస్, ఎమ్మిగనూరు: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో వైఎస్సార్ చేయూత పథకాన్ని ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసి, మైనారిటీ అక్కాచెల్లెళ్లకు దశలవారీగా రూ.75వేలు ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు. కార్పొరేషన్లను ప్రక్షాళన చేసి వారి ఆర్థిక ప్రగతికి బాటలు వేస్తామన్నారు. మహిళలకు మొదటి విడత కింద ఒక్కొక్కరికీ రూ.18,750 చొప్పున మొత్తం 9,949 మంది లబ్ధిదారులకు రూ.18.65కోట్ల మెగా చెక్కును లబ్ధిదారులకు […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో బుధవారం 1,897 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తంగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 84,544 నమోదైంది. తాజాగా కరోనా బారినపడి 9 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 654కు చేరింది. 24 గంటల్లో 22,972 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇలా ఇప్పటివరకు 6,65,847 మందికి కరోనా టెస్టులు చేశారు. ఇదిలాఉండగా, కరోనా నుంచి కొత్తగా 1920 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. వ్యాధిబారి నుంచి […]