Breaking News

Day: August 4, 2020

పేద యువతికి ఎన్నారై సాయం

ఎన్​ఆర్​ఐ ఔదార్యం

సారథి న్యూస్, రామడుగు: పేద యువతి వివాహానికి సహాయంచేసి ఓ ఎన్​ఆర్​ఐ పెద్దమనసు చాటుకున్నారు. కరీంనగర్​ జిల్లా రామడుగుకు చెందిన తోట సత్యం అమెరికాలో స్థిరపడ్డారు. తన సొంత గ్రామానికి చేతనైన సాయం చేస్తుంటాడు. రామడుగుకు చెందిన జిట్టవేని రజిత అనే యువతికి కొంతకాలం క్రితం తల్లిదండ్రులు చనిపోయారు. ఈ క్రమంలో ఆమె వివాహానికి సత్యం రూ.20వేల సాయం చేశారు. ఈ మొత్తాన్ని గ్రామ సర్పంచ్​ ప్రమీల జగన్​మోహన్​గౌడ్ కు పంపించగా ఆమె బాధిత యువతికి అందజేశారు. […]

Read More
నితిన్​కు నో చెప్పిన పూజ

నితిన్​కు నో చెప్పిన బుట్టబొమ్మ

బాలీవుడ్​లో సూపర్​హిట్​ అయిన ‘అంధాధున్​’ చిత్రాన్ని తెలుగులో రీమేక్​ చేస్తున్న విషయం తెలిసిందే. నితిన్​ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఆయనే సొంత బ్యానర్​ పై నిర్మిస్తున్నాడు. మేర్లపాక గాంధీ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. కాగా ఆంధాదున్​లో టబు, రాధికాఆప్టే చేసిన పాత్రలను తెలుగులో ఎవరు చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొన్నది. రాధికా చేసిన పాత్రకు చిత్రనిర్మాతలు పూజా హెగ్డేను సంప్రదించగా ఆమె నో చెప్పిందట. భారీ రెమ్యునరేషన్ ఇస్తామన్నా చేసినా ఆమె ఒప్పుకోలేదట. వరుస సినిమాలతో […]

Read More
SMITHA SINGER

కరోనా ఎలా సోకిందో తెలియట్లేదు

కరోనా మహమ్మారి సెలబ్రిటీలను, రాజకీయ ప్రముఖులను సైతం వదలడం లేదు. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులకు కరోనా పాజిటివ్​ గా నిర్ధారణ అయ్యింది. తాజాగా పాప్ సింగర్ స్మిత, ఆమె భర్తకు కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తన ట్విట్టర్​లో వెల్లడించారు. ‘నిన్న ఎంతో ఇబ్బందికర రోజు. బాగా ఒళ్లు నొప్పులు అయ్యాయి. ఎందుకైనా మంచిదని కరోనా టెస్ట్ చేయించుకోగా, నాకూ.. అలాగే నా భర్త శశాంక్‌కు కరోనా పాజిటివ్‌గా వచ్చింది. పెద్దగా లక్షణాలు […]

Read More
శ్రమించారు.. సాధించారు

శ్రమించారు.. సాధించారు

తెలుగు రాష్ట్రాల నుంచి పలువురికి టాప్​ ​ర్యాంక్​లు పాలమూరు బిడ్డకు 272వ ర్యాంకు, 135వ ర్యాంక్ సాధించిన కర్నూలు యువకుడు కానిస్టేబుల్​ కుమారుడికి 516వ ర్యాంకు సారథి న్యూస్, నారాయణపేట, కర్నూలు, పెద్దశంకరంపేట: యూపీఎస్సీ నిర్వహించిన 2019 సివిల్‌ సర్వీసెస్‌ ఫలితాల్లో తెలుగు తేజాలు విశేషప్రతిభ చూపారు. ఆలిండియా స్థాయిలో ఉత్తమ ర్యాంకులతో తాము ఆశించిన గోల్​సాధించారు. ఐఏఎస్​గా ఎంపికై తల్లిదండ్రుల కలలను సాకారం చేశారు. కరీంనగర్ ఎన్‌సీసీ తొమ్మిదో బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ అజయ్ […]

Read More
ఘనంగా రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు

ఘనంగా రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలు

సారథి న్యూస్, గద్వాల: భక్తుల పాలిట కల్పతరువు మంత్రాలయం గురురాఘవేంద్ర స్వామి 349వ ఆరాధనోత్సవాలు మంత్రాలయం పీఠాధిపతులు సుభుదేంద్ర స్వామి ఆదేశాల మేరకు జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని నదిఅగ్రహారం రోడ్డులోని రాఘవేంద్రస్వామి మఠంలో మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. అర్చకులు ప్రహ్లాద్ ఆచారి, ప్రమోద్ ప్రసన్నచారి స్వామివారి బృందావనానికి పంచామృతాభిషేకం, తులసి అర్చన, పుష్పాభిషేకం, హస్తోదకం కార్యక్రమాలను నిర్వహించారు. మూడు రోజుల పాటు జరిగే ఆరాధనోత్సవాలకు భక్తులు మాస్కులు కట్టుకుని.. భౌతిక దూరం పాటిస్తూ దర్శనానికి రావాలని […]

Read More
మూడో కన్ను.. నాలుగు దిక్కులా

మూడో కన్ను.. నాలుగు దిక్కులా

సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు నగరం నలుదిశలా విస్తరిస్తోంది. నగర పాలక సంస్థ పరిధిలో నేరాల నియంత్రణతో పాటు పౌరసేవల పర్యవేక్షణ, మున్సిపల్, పోలీస్ శాఖల సమన్వయంతో పలు కీలక కూడళ్లలో ఆధునిక సాంకేతికతను జోడించిన సీసీ కెమెరాలను అమర్చనున్నారు. చెన్నైకు చెందిన అనలాగ్ అండ్ డిబిటల్ లాబ్స్ వారి ఆధ్వర్యంలో సీసీ కెమెరాల ఏర్పాటు పనులు షురూ అయ్యాయి. ఈ మేరకు మంగళవారం నగరంలోని కొండారెడ్డి బురుజు, రాజ్ విహార్, బళ్లారి చౌరస్తా, హైవే, ఐటీసీ […]

Read More
కరోనా రోగులకు మంచి వైద్యం

కరోనా రోగులకు మంచి ట్రీట్​మెంట్​

సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో కరోనా నివారణ చర్యలపై ఏపీ డిప్యూటీ సీఎం, వైద్యాశాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్(ఆళ్ల నాని), ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షించారు. అనంతరం రోగులు, వైద్యసిబ్బందితో వీడియోకాన్ఫరెన్స్​ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో కోవిడ్ నివారణ చర్యలకు ప్రతినెలా రూ.350 కోట్లు, ఒక్కో కరోనా పేషెంట్​భోజనానికి ఒకరోజుకు రూ.500 చొప్పున […]

Read More
కరోనాతో సీపీఎం నేత షడ్రక్​మృతి

కరోనాతో సీపీఎం నేత షడ్రక్​ మృతి

సారథి న్యూస్, కర్నూలు: సీపీఎం సీనియర్ నేత, పార్టీ కర్నూలు జిల్లా కమిటీ సభ్యుడు టి.షడ్రక్(62)​మంగళవారం కరోనాతో తనువు చాలించారు. కొద్దిరోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతుండగా హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్​ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ప్రాణం విడిచారు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఏ గఫూర్ కర్నూలు ఎమ్మెల్యే హఫిజ్​ఖాన్ సంతాపం ప్రకటించారు. ఆయన మృతి ప్రజాఉద్యమాలకు తీరని లోటని జిల్లా […]

Read More