Breaking News

Month: July 2020

మంత్రి కేటీఆర్ కు ఊహించ‌ని షాక్

మంత్రి కేటీఆర్ కు ఊహించ‌ని షాక్

సారథి న్యూస్, మ‌హ‌బూబ్ న‌గ‌ర్: జిల్లా పర్యటనలో మంత్రి కేటీఆర్ కు ఊహించ‌ని షాక్ త‌గిలింది. సోమవారం ప‌లు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వ‌చ్చిన ఆయ‌న వీర‌న్నపేటలో 660 డ‌బుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభించారు. అక్కడి నుంచి బ‌య‌లుదేరుతున్న స‌మ‌యంలో మంత్రి కాన్వాయ్ కు ఓ కుటుంబం అడ్డుకుంది. త‌మ భూమిని క‌బ్జా చేసి టీఆర్ఎస్ నేత‌లు డ‌బుల్ బెడ్ రూం ఇండ్లు క‌ట్టార‌ని, తమను బెదిరిస్తున్నార‌ని న్యాయం చేయాల‌ని వారు డిమాండ్ చేశారు. అయితే […]

Read More

స్వచ్ఛతకే ప్రాధాన్యం

సారథిన్యూస్​, రామాయంపేట: తెలంగాణ ప్రభుత్వం పరిశుభ్రతకే అధిక ప్రాధాన్యమిస్తున్నదని మెదక్​ ఎమ్మెల్యే పద్మాదేవేంర్​రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆమె మెదక్ ​జిల్లా నిజాంపేట మండలకేంద్రంతోపాటు మండలపరిధిలోని నస్కల్, రాంపూర్, నందగోకుల్, చల్మేడ గ్రామాలలో డంప్ యార్డ్ లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోవిడ్​ వైరస్ ను తరిమి కొట్టాలంటే ప్రతిఒక్కరూ మాస్క్​ ధరించాలని, భౌతికదూరం పాటించాలని కోరారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ అందే ఇందిరా, జెడ్పీటీసీ విజయ్ కుమార్, మండల స్పెషల్ ఆఫీసర్ రామాయంపేట మున్సిపల్ […]

Read More
షార్ట్ న్యూస్

పోలీసులు జాగ్రత్తగా ఉండాలి

నల్లగొండ: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో పోలీస్​ సిబ్బంది జాగ్రత్తగా ఉండాలని నల్లగొండ జిల్లా అదనపు ఎస్పీ నర్మద సూచించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో రీడ్ స్వచ్చంద సంస్థ ప్రతినిధి డాక్టర్ అనూష ఆధ్వర్యంలో జిల్లాలోని 2000 మంది పోలీస్​సిబ్బందికి రోగనిరోధకశక్తిని పెంచే హోమియో మందలను అందించారు. కార్యక్రమంలో మిర్యాలగూడ సీఐ రమేశ్​, సత్యం, డీపీవో సూపరింటెండెంట్​ దయాకర్, ఆర్​ఐ నర్సింహాచారి, డీటీఆర్సీ సీఐ అంజయ్య, కార్తీక్, శంకర్, నవీన్, […]

Read More

గ్రీన్​చాలెంజ్​ను స్వీకరించిన కలెక్టర్​

మహబూబాబాద్: మహబూబాబాద్​ జిల్లా కలెక్టర్​ గౌతమ్ గ్రీన్​చాలెంజ్​ను స్వీకరించి కలెక్టరేట్​ వద్ద మూడు మొక్కలు నాటారు. జిల్లా అదనపు కలెక్టర్ ఎం వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈవో సన్యాసయ్య, డీఆర్డీఏ పీడీ విద్యాచందన లకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ.. మొక్కలు నాటడం ఓ సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ కార్యాలయ సిబ్బంది కవిత, మున్సిపల్ సిబ్బంది గురు లింగం, పర్యావరణ సూపర్​వైజర్​ దైదా వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Read More

కరోనా నియంత్రణలో విఫలం

సారథిన్యూస్, రామడుగు: కరోనాను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ వెన్న రాజమల్లయ్య ఆరోపించారు. సోమవారం ఆయన తననివాసంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో దాదాపు 30 వేల కేసులు నమోదైనా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం కరోనా పరీక్షలు చేయడం లేదని విమర్శించారు. పారిశుధ్య కార్మికులు, డాక్టర్లు, పారామెడికల్​ సిబ్బంది, ఏఎన్​ఎంలు, జర్నలిస్టుల సేవలు వెలకట్టలేనివని కొనియాడారు.

Read More
ఏపీలో అన్ని ఎంట్రెన్స్​లు వాయిదా

ఏపీలో అన్ని ఎంట్రెన్స్​లు వాయిదా

అమరావతి: ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం ఎంసెట్ స‌హా అన్ని ర‌కాల‌ ఎంట్రెన్స్​లను వాయిదా వేసింది. కరోనా సమయంలో సీఎం వైఎస్​జగన్​మోహన్​రెడ్డి సూచనలతో ఎంసెట్, ఐసెట్, ఈసెట్, లాసెట్, ఎడ్‌సెట్‌, పీజీ సెట్‌ల‌తో క‌లిపి మొత్తం 8 సెట్ల ఎగ్జామ్స్​ను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ‌ మంత్రి ఆదిమూల‌పు సురేష్​ సోమవారం ప్రకటించారు. దీనికి సంబంధించి త్వరలోనే పరీక్షల తేదీలను వెల్లడిస్తామని తెలిపారు. సెప్టెంబ‌ర్ మూడవ వారంలో ఎంసెట్ నిర్వహిస్తామని, దీనికి సంబంధించిన ప‌రీక్ష తేదీల‌ను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు. డిగ్రీ, […]

Read More
తెలంగాణలో 1,550 కేసులు

తెలంగాణలో 1,550 కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 1,550 పాజిటివ్​కేసులు నమోదయ్యాయి. మొత్తంగా ఇప్పటివరకు 36,221 కేసులు నిర్ధారణ అయ్యాయి. మహమ్మారి బారినపడి ఒకేరోజు 9 మంది చనిపోగా, ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 365కు చేరింది. వైద్యం అనంతరం 23,679 మంది ఇప్పటిదాకా డిశ్చార్జ్​అయ్యారు. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే జీహెచ్ఎంసీ పరిధిలో 926 అత్యధికంగా నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 212, మేడ్చల్​53, సంగారెడ్డి 19, ఖమ్మం 38, […]

Read More
ఇసుకకు ప్రత్యేక కార్పొరేషన్?

ఇసుకకు ప్రత్యేక కార్పొరేషన్?

సారథి న్యూస్​, కర్నూలు: ఆంధ్రప్రదేశ్​ లో ఇసుక తవ్వకాలు, విక్రయాలను పూర్తిస్థాయిలో పర్యవేక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఇందుకోసం కార్పొరేషన్‌కు ఎండీ స్థాయి అధికారిని నియమించనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ పర్యవేక్షిస్తోంది. ఏపీఎండీసీ ఎండీని ముఖ్య​అధికారిగా నియమించే అవకాశాలు ఉన్నాయి. గనులశాఖ నుంచి జేడీ స్థాయి అధికారి, ఓఎస్‌డీ, ఏపీఎండీసీకి చెందిన కొందరు అధికారులను డిప్యుటేషన్‌పై నియమించనున్నట్లు సమాచారం. నిత్యం ఇసుక తవ్వకాలు, ఆన్‌లైన్‌, గ్రామ, వార్డు […]

Read More