Breaking News

Day: July 30, 2020

తెలంగాణలో 1,811 పాజిటివ్ కేసులు

తెలంగాణలో 1,811 పాజిటివ్ కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గురువారం కొత్తగా 1,811 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి 60,717 కేసుల నిర్ధారణ అయ్యాయి. ఒకేరోజు 13 మంది మృతిచెందారు. ఇప్పటివరకు 505 మంది మృత్యువాతపడ్డారు. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 521 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 289 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. ఆదిలాబాద్​18, భద్రాద్రి కొత్తగూడెం 27, జగిత్యాల 15, జనగాం 22, జయశంకర్​భూపాలపల్లి 20, జోగుళాంబ […]

Read More
బకాయి జీతం వస్తలేదు

బకాయి జీతం వస్తలేదు

కూలి పనులకు వెళ్తున్న విద్యావలంటీర్లు కరోనా ప్రభావంతో బతుకులు ఆగమాగం పెండింగ్ జీతాలైనా ఇవ్వండని వేడుకోలు :: సుంకే కుమార్,​ కౌడిపల్లికరోనా మహమ్మారి మధ్యతరగతి ప్రజల జీవనంపై దెబ్బకొట్టింది. ఓ వైపు ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తూ.. మరోవైపు ప్రాణాలను హరించేస్తోంది. ఎంతో మంది తమ జీవనోపాధిని కోల్పోయి బతుకుజీవుడా అని కాలం వెళ్లదీస్తున్నారు. నెలవారి జీతంతో బతికే కుటుంబాల పరిస్థితి దిక్కుతోచని స్థితిలో పడింది. కరోనా పుణ్యమా! అని ఉన్నత చదువులు చదివిన విద్యావలంటీర్లు రోజువారీ […]

Read More
నల్లవాగుకు జలకళ

నయనానందకరం నల్లవాగు

నారాయణఖేడ్, సారథి న్యూస్: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్ పరిధిలోని సిర్గాపూర్ మండలంలోని నల్లవాగు ప్రాజెక్ట్​ జలకళను సంతరించుకున్నది. బుధవారం స్థానిక ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్​రెడ్డి నల్లవాగుకు పూజలు చేశారు. అనంతరం గేట్​ను ఎత్తి నీటి విడుదల చేశారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు వెంకట్ రామ్ రెడ్డి, డీసీసీబీ జిల్లా డైరెక్టర్ నరేందర్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్​ రమావత్ రాంసింగ్, ఎంపీపీ మహిపాల్ రెడ్డి, జెడ్పీటీసీ రాఘవరెడ్డి, కల్హేర్ జెడ్పీటీసీ నర్సింహా […]

Read More

కాంట్రాక్ట్​ కార్మికులను ఆదుకోండి

సారథిన్యూస్​, గోదావరిఖని: సింగరేణి కాంట్రాక్ట్​ కార్మికులను ఆదుకోవాలని సీఐటీయూ నాయకులు డిమాండ్​ చేశారు. కాంట్రాక్ట్​ కార్మికులకు కోవిడ్ క్వారంటైన్ వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. ఈ మేరకు సింగరేణి ఎండీకి లేఖ పంపినట్టు సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు తిరుపతి, మధు తెలిపారు. సింగరేణిలో కాంట్రాక్ట్​, పర్మినెంట్​ కార్మికులందరినీ కరోనా మహమ్మారి వెంటాడుతున్నదని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పర్మినెంట్​ ఉద్యోగులకు కల్పిస్తున్న సౌకర్యాలను కాంట్రాక్ట్​ ఉద్యోగులకు కూడా కల్పించాలని డిమాండ్​ చేశారు.

Read More
సింగరేణి లాక్​డౌన్​

లాక్​డౌన్​ ప్రకటించండి

సారథిన్యూస్​, గోదావరిఖని: సింగరేణిలో లాక్​డౌన్​ ప్రకటించి కార్మికుల ప్రాణాలు కాపాడాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్​ చేశారు. బుధవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్, ఏఐటీయూసీ, సింగరేణి కాలరీస్​ ఎంప్లాయీస్​ యూనియన్​, సీఐటీయూ నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సింగరేణిలో కరోనా వైరస్ లక్షణాలతో కార్మికులు చనిపోతున్నారని పేర్కొన్నారు. ఉద్యోగులు విధులు నిర్వర్తించడానికి ఎంతో భయపడతున్నారని చెప్పారు. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ […]

Read More
శాంతియుతంగా బక్రీద్​

బక్రీద్​ శాంతియుతంగా జరుపుకోండి

సారథి న్యూస్, బెజ్జంకి: ముస్లిం సోదరులు బక్రీద్​ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని చేర్యాల సీఐ శ్రీనివాసరెడ్డి సూచించారు. బుధవారం ఆయన కరీంనగర్​ జిల్లా చేర్యాలలో ముస్లిం మత పెద్దలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. గోవులను అక్రమంగా రవాణాచేస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందుకోసం ప్రత్యేకంగా చెక్​పోస్టులు ఏర్పాటుచేశామన్నారు. మత ఘర్షణలు ప్రేరేపించేలా ఎవరైనా సోషల్​మీడియాలో పోస్టులు పెడితే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో చేర్యాల ఎస్సై మోహన్ బాబు, చేర్యాల తాజుమ్ ప్రెసిడెంట్ అబ్దుల్ […]

Read More