Breaking News

Day: July 30, 2020

సింగరేణిలో విధుల బహిష్కరణ

కరోనాతో సింగరేణి కార్మికుడి మృతి

సారథి న్యూస్​, గోదావరిఖని: సింగరేణిలో పనిచేస్తున్న ఓ కార్మికుడు కరోనా లక్షణాలతో మృతిచెందాడు. దీంతో గురువారం సింగరేణి వ్యాప్తంగా పనిచేస్తున్న కార్మికులు విధులను బహిష్కరించారు. సింగరేణిలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో యాజమాన్యం వెంటనే లాక్​డౌన్​ ప్రకటించాలని సింగరేణి ఎంప్లాయీస్​ యూనియన్ సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సారయ్య, గని కార్యదర్శి కే రంగారావు కోరారు. సింగరేణి ఆర్జీవన్​ డివిజన్​లోని జీడీకే రెండవ గనిలో పనిచేస్తున్న టామర్​ కార్మికుడు బుధవారం కరోనా లక్షణాలతో మృతిచెందాడు. దీంతో కార్మికవర్గం ఒక్కటైంది.

Read More
బెల్ట్​షాపులు నడిపితే తాట తీస్తాం

బెల్ట్​షాపులు నడిపితే తాటతీస్తాం

సారథి న్యూస్​, రామగుండం: గ్రామాల్లో ఎవరైనా బెల్ట్​షాపులు ఏర్పాటుచేసి అక్రమంగా మద్యం విక్రయిస్తే కఠినచర్యలు తీసుకుంటామని రామగుండం సీపీ సత్యనారాయణ హెచ్చరించారు. గురువారం పాలకుర్తి మండలం తక్కళ్లపల్లి గ్రామంలో పోలీసులు, టాస్క్​ఫోర్స్​ సిబ్బంది తనిఖీలు చేపట్టి ఓ ఇంట్లో నిలువ ఉంచిన రూ.31,405 విలువైన మద్యాన్ని సీజ్​చేశారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో రెండు రోజులుగా బెల్టు​షాపులపై దాడులు కొనసాగుతున్నాయి. తనిఖీల్లో టాస్క్ ఫోర్స్ సీఐ రాజ్ కుమార్, ఎస్సై షేక్ మస్తాన్, టాస్క్​ఫోర్స్​ సిబ్బంది శేఖర్, మహేందర్, […]

Read More
కరోనా కట్టడిలో విఫలం

కరోనా కట్టడిలో ఫెయిల్​

సారథి న్యూస్​, గద్వాల: కరోనాను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్​ నేత షేక్​ షావలీ ఆచారి విమర్శించారు. జోగుళాంబ గద్వాల జిల్లాలోని ప్రతి మండల కేంద్రంలో ప్రభుత్వం ఐసోలేషన్​ కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్​ చేశారు. కరోనా విస్తరిస్తున్న తరుణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేశాయని ఆరోపించారు. గద్వాల జిల్లాలో తక్కువ సంఖ్యలో టెస్టులు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అనారోగ్యంతో ఉన్నవారందరికీ టెస్టులు చేయాలని కోరారు. టీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు, మంత్రులు […]

Read More

రేషన్​ కార్డుకూ లంచం

సారథి న్యూస్​, వైరా: ప్రభుత్వ అధికారుల్లో కొందరు చేస్తున్న నీచమైన పనుల వల్ల మొత్తం వ్యవస్థకే మచ్చ ఏర్పడుతుంది. రేషన్​ కార్డు మంజూరు చేసేందుకు లంచం తీసుకుని తాజాగా ఓ ఉద్యోగి ఏసీబీకి చిక్కాడు. ఖమ్మం జిల్లా వైరా మండలం గొల్లపడికి చెందిన ఓ వ్యక్తి రేషన్​ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కార్డు మంజూరు చేయాలంటే రూ.1500 లంచం ఇవ్వాలంటూ వీఆర్వో కశ్యప్​ డిమాండ్​ చేశాడు. దీంతో సదరు వ్యక్తి ఏసీబీని ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన […]

Read More
చుక్క నీటిని వదులుకునేది లేదు

చుక్క నీటిని వదులుకునేది లేదు

సారథి న్యూస్,​ హైదరాబాద్: ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణా, గోదావరి నదుల్లో మన హక్కు నీటివాటాను కాపాడుకుని తీరాలని సీఎం కె.చంద్రశేఖర్ రావు సూచించారు. గురువారం మంత్రులు, ఉన్నతాధికారులతో ప్రగతిభవన్ లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఒక చుక్క నీటిని కూడా వదులుకునే ప్రసక్తే లేదని కేసీఆర్​ స్పష్టంచేశారు. ఎంతటి పోరాటానికైనా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందన్నారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఆగస్టు 5న ఏర్పాటు చేసేందుకు అభిప్రాయం చెప్పాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ముఖ్యకార్యదర్శి యూపీ సింగ్ […]

Read More
కరోనా.. బిల్లుల వసూలుపై కేటీఆర్​ఫైర్​

కరోనా.. బిల్లుల వసూలుపై కేటీఆర్​ ఫైర్​

సారథి న్యూస్, హైదరాబాద్: కోవిడ్ రోగాల నుంచి ఫిర్యాదులు ఎదుర్కొంటూ అధిక మొత్తంలో మెడికల్ బిల్లులు వసూలు చేస్తున్న ప్రైవేట్​ఆస్పత్రులపై కఠినచర్యలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్​కు మంత్రి కె.తారక రామారావు కోరారు. ప్రైవేట్​ఆస్పత్రి వల్ల తాను ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులను వివరిస్తూ మహేశ్వరం మండలం దుబ్బచెర్ల గ్రామానికి చెందిన అనురెడ్డి రాదేశ్​అనే యువకుడు గురువారం ట్విట్టర్ ద్వారా మంత్రికి ఫిర్యాదు చేశాడు. ‘కోవిడ్ – 19 కారణంగా నా తండ్రి, తల్లి, సోదరుడిని కోల్పోయాను. […]

Read More
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఇకపై ప్లాస్టిక్ పూర్తిగా బ్యాన్​ మున్సిపల్​ అధికారులకు ఆదేశాలు సారథి న్యూస్, హైదరాబాద్: సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ప్లాస్టిక్ వినియోగం, విక్రయాలు, నిల్వలపై భారీ జరిమానాలు విధించేందుకు మున్సిపల్​శాఖ సిద్ధమైంది. ప్లాస్టిక్ వాడకం.. పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతోందని, దీనిపై ప్రజలకు అవగాహన పెంచాలని రాష్ట్రంలోని మున్సిపాలిటీల అధికారులకు సూచించింది. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయాన్ని ప్రోత్సహించడమే కాకుండా.. రిటైలర్లు, వ్యాపారులు ప్లాస్టిక్ వాడకం, అమ్మకాలు జరపకుండా […]

Read More
కాంగ్రెస్​ నేత సంపత్​ అరెస్ట్​

కాంగ్రెస్​ నేత సంపత్​ అరెస్ట్​

సారథిన్యూస్​, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా వేలూరు గ్రామానికి బయలుదేరిన కాంగ్రెస్​ నేతలను పోలీసులు అరెస్ట్​ చేశారు. వేలూరు గ్రామంలో నర్సింహులు అనే దళిత రైతు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం నర్సింహులు చెందిన 13 గుంటల భూమిని ఇటీవల స్వాధీనం చేసుకున్నదని.. అందుకే అతడు ఆత్మహత్య చేసుకున్నాడని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం వేలూరు బయలుదేరిన ఏఐసీసీ కార్యదర్శి సంపత్​కుమార్​, సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డిని, కాంగ్రెస్​ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్​ చేశారు. కాంగ్రెస్​ […]

Read More