Breaking News

Day: July 24, 2020

కోలుకున్నవారు 8 లక్షలు

ఢిల్లీ: భారత్​లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోలుకుంటున్న వారి సంఖ్య అధికంగానే ఉంటున్నదని వైద్యశాఖ గణాంకాలు తెలుపుతున్నాయి. ఇప్పటివరకు భారత్​లో 8 లక్షల మంది కోరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. కాగా గత 24 గంటల్లో 49,310 మంది కొత్తగా కరోనా బారినపడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 12,87,945 లకు ఎగబాకింది. ఇప్పటివరకు 30,601 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ప్రస్తుతం 4,40,135 […]

Read More

ఆర్జీవీ x పవన్​ఫ్యాన్స్..​ లాభం ఎవరికి?

సంచలన దర్శకుడు రాంగోపాల్​వర్మ ‘పవర్​స్టార్​’ అంటూ ఓ సినిమాను ప్రకటించడంతోపాటు దాని ట్రైలర్​ను విడుదల చేశాడు. కొంతకాలం పాటు సైలెంట్​గా ఉన్న పవన్​కల్యాణ్ ఫ్యాన్స్​ ట్రైలర్​ విడుదల కాగానే రెచ్చిపోయారు. ఆర్జీవీ ‘పవర్​స్టార్’​కు కౌంటర్​గా ‘పరాన్నజీవి’ అనే సినిమాను నిర్మించబోతున్నట్టు ప్రకటించారు. అనంతరం చిత్రంలో ఆర్జీవీని టార్గెట్​ చేస్తూ ఓ పాటను రిలీజ్​ చేశారు. కానీ ఈ పాట పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. గురువారం ఏకంగా హైదరాబాద్​లోని ఆర్జీవీ కార్యాలయంపై ఓయూ జేఏసీ పేరిట దాడి జరిగింది. ఈ […]

Read More
మహారాష్ట్రలో పెరుగుతున్న కేసులు

మహారాష్ట్రలో 9వేల కొత్తకేసులు

ముంబై: మహారాష్ట్రలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గత 24 గంటల్లో కొత్తగా 9,895 కొత్తకేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 3,47,502కు చేరింది. ఇప్పటివరకు కరోనాతో మహారాష్ట్రలో 12,854 మంది మృతిచెందారు. గత 24 గంటల్లోనే 298 మంది మృత్యువాత పడ్డారు. కాగా ఇప్పటివరకు 1,94, 253 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. కాగా దేశంలో ఇప్పటికే సామాజిక వ్యాప్తి ప్రారంభమైందని కొందరు వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. రానున్న మూడు, నాలుగు వారాల్లో వ్యాధి తీవ్రత మరిత పెరిగే […]

Read More

ఢిల్లీలో పక్కాగా కట్టడి

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ రాష్ట్రంలో కరోనా అదుపులోకి వచ్చింది. దీంతో ఇప్పడందరూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ను ప్రశంసిస్తున్నారు. అత్యధిక టెస్టులు చేయడం.. సకాలంలో వైద్యం చేయడం, ప్రజలకు కరోనాపై విస్తృత అవగాహన కల్పించడమే కేజ్రీవాల్​ విజయరహస్యం అని పలువురు అభిప్రాయపడుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చొరవ తీసుకోవడం కూడా కారణమని మరికొందరు పేర్కొంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఢిల్లీలో కరోనా కంట్రోల్​లోకి రావడం స్వాగతించవలిసిన అంశమే. గత 24 గంటల్లో ఆ రాష్ట్రంలో […]

Read More
అందరికీ కరోనా టెస్టులు చేయాలి

అందరికీ కరోనా టెస్టులు చేయాలి

సారథి న్యూస్, వాజేడు(ములుగు): అందరికీ కరోనా టెస్టులు చేయాలని టీఏజీఎస్ అధ్యక్షుడు దబ్బకట్ల లక్ష్మయ్య ఆధ్వర్యంలో ములుగు జిల్లా వాజేడు తహసీల్దార్​కు వినతిపత్రం అందజేశారు. అన్ని ఆస్పత్రుల్లో కరోనాకు వైద్యం చేయాలని డిమాండ్​చేశారు. ప్రతి పేద కుటుంబానికి రూ.7,500 ఇవ్వాలని కోరారు. ప్రతి రేషన్​కార్డుదారుడికి 10 కేజీల బియ్యం ఇవ్వాలని డిమాండ్​ చేశారు. ఉపాధి పనిదినాలు రెండొందల రోజులకు పెంచాలన్నారు. రోజుకు రూ.600 వేతనం ఇస్తూ.. ఫీల్డ్​ అసిస్టెంట్లతో పనులు చేయించాలన్నారు. మధ్యాహ్న భోజనం ఇంటివద్దకే పంపించాలని, […]

Read More
పుణ్యఫలాలన్నీ ఒక్క చెడ్డపనితో ఫట్​

పుణ్యఫలాలన్నీ ఒక్క చెడ్డపనితో ఫట్​

కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. కృష్ణుడు పాండవులను తీసుకుని హస్తినాపురానికి వస్తాడు. తన వందమంది పుత్రులను పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడు శోకంలో మునిగిపోయి ఉంటాడు. కృష్ణుడి రాకను గమనించిన ధృతరాష్ట్రుడు ఎదురువెళ్లి బోరున విలపిస్తాడు. చిన్నపిల్లాడిలా ఏడుస్తున్న అతని కృష్ణుడు ఓదార్చేందుకు ప్రయత్నిస్తాడు. ధృతరాష్ట్రుడి దు:ఖం కోపంగా మారి కృష్ణుడిని నిలదీస్తాడు. ‘అన్నీ తెలిసి కూడా, మొదటి నుంచీ జరిగేదంతా చూస్తూ కూడా సాక్షాత్తూ భగవంతుడవైన నువ్వు ఎందుకు మిన్నకుండిపోయావు? ఇంత ఘోరాన్ని ఎందుకు ఆపలేదు? కావాలని ఇదంతా ఎందుకు […]

Read More
నిబంధనలకు అనుగుణంగానే వినాయక చవితి

నిబంధనలకు అనుగుణంగానే గణేష్​ ఉత్సవాలు

సారథి న్యూస్​, హైదరాబాద్​: హైదరాబాద్​ మహానగరంలో గణేష్‌ నవరాత్రి ఉత్సవాలను కోవిడ్‌–19 మార్గదర్శకాల ప్రకారమే జరుపుకోవాలని భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ సమితి పిలుపునిచ్చింది. ఈ మేరకు బేగంబజార్‌లోని బహేతిభవన్‌లో అధ్యక్షుడు జి.రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శి భగవంతరావు, ఉపాధ్యక్షుడు రామరాజు నేతృత్వంలో సమితి సభ్యులు సమావేశమయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కోవిడ్‌ మార్గదర్శకాలను అనుసరించి భక్తులు మాస్కులు కట్టుకోవడం, భౌతికదూరం పాటించడం, శానిటైజర్లు వాడాలని సూచించారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ప్రభుత్వం భక్తులకు తగిన ఏర్పాట్లు […]

Read More
మరో ఉక్కు వంతెనకు శ్రీకారం

మరో ఉక్కు వంతెనకు శ్రీకారం

సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని అరికట్టేందుకు మరో ఉక్కు వంతెన నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఎస్ఆర్ డీపీ కింద ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో నల్లగొండ క్రాస్ రోడ్ నుంచి ఓవైసీ జంక్షన్ వరకు నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి గురువారం మంత్రులు శంకుస్థాపన చేశారు. రూ 523.37 కోట్ల వ్యయంతో నల్లగొండ క్రాస్ రోడ్స్ నుంచి ఓవైసీ జంక్షన్ వరకు సుమారు మూడున్నర కి.మీ. […]

Read More