సారథి న్యూస్, హైదరాబాద్: వ్యవసాయ శాఖ పై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరచడానికి, స్వతంత్ర భారతంలో గతంలో ఎన్నడూ..ఎక్కడా జరగనంత ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతోందని సమావేశంలో పాల్గొన్న అధికారులను, మంత్రులనుద్దేశించి మాట్లాడారు. కోట్లాది రూపాయల ఖర్చుతో ప్రాజెక్టుల నిర్మిస్తున్నట్లు తెలిపారు. రైతులకు ఉచితంగా సాగునీరు అందిస్తూ.. ఒక్క రూపాయి భూమిశిస్తు తీసుకోవద్దనే లక్ష్యంతో నీటి తరువాయి విధానాన్ని రద్దు […]
సారథిన్యూస్, మానోపాడు: జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి చిన్న ఆముదాలపాడు మధ్యన ఉన్న జూరాల లింక్ ఆర్ డీఎస్ ప్రధాన కాల్వకు భారీ గండి పడింది. దీంతో రెండు రోజులుగా పంటపొలాల్లో కాలువ నీరు ప్రహిస్తుండంతో పొలాలు ఆగమవుతున్నయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏటా ఈ కాలువ పరిస్థితి ఇదేవిధంగా ఉందని అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని రైతులు అంటున్నారు. ప్రధాన కాలువలో సీల్టు తీయకపోవడం వల్లే ఈ గండ్లు ఏర్పడుతున్నాయని సమీప బాధిత […]
భోపాల్: కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో 10 రోజుల పాటు సంపూర్ణ లాక్డౌన్ విధించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయించింది. పరిశ్రమలు, ప్రభుత్వ కార్యాలయాలు, పాలు, కూరగాయలు, రేషన్ దుకాణాలకు మినహాయింపు ఇచ్చినట్టు హోంమంత్రి నరోత్తం మిశ్రా ప్రకటించారు. ఈ నెల 24 (శుక్రవారం) నుంచి 10 రోజులపాటు లాక్డౌన్ అమల్లో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు.
సారథి న్యూస్, శ్రీశైలం : ఎగువన కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్ట్‌లోకి ఇన్‌ఫ్లో 56,614 క్యూసెక్కులు కాగా… అవుట్ ఫ్లో 38,140 క్యూసెక్కులుగా ఉంది. అలాగే జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం నీటి మట్టం 848.70 అడుగులుగా నమోదు అయ్యింది.ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 77.1732 టీఎంసీలు కాగా.. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలుగా ఉంది. వరద నీటి ప్రవాహంతో […]
సారథి న్యూస్, హైదరాబాద్: నడిపేది ట్రాలీ ఆటో.. జీవన శైలిలో విలాసవంతమైన మార్పు. అప్పులు తీసుకునే స్థాయి నుంచి ఇచ్చే స్థాయికి చేరిక.. 2.35 ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు.. ఇదంతా ఎలా సాధ్యమంటూ ఆరా తీస్తే.. అసలు సంగతి తెలిసి ఔరా అంటూ ఎల్బీనగర్ పోలీసులు ముక్కున వేలేసుకున్నారు. మరదలితో చోరీ చేయించి.. ఆ డబ్బుతో జల్సా చేస్తున్న బావ ఆట కట్టించారు. రూ.25.5 లక్షలు, రూ.22 లక్షల విలువైన వ్యవసాయ భూమికి సంబంధించిన పత్రాలను […]
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా విలయతాండవం సృష్టిస్తున్నది. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 45,720 కొత్తకేసులు నమోదయ్యాయి. ఈ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. మొత్తం కేసుల సంఖ్య 12,38,635కు చేరింది. కాగా ఒకే రోజులో 29,557మంది కోలుకున్నారు. కాగా ఇప్పటివరకు 7,82,606 మంది కోలుకున్నారు. ఇప్పటివకరు 29,861 మంది ఈ వ్యాధితో మరణించారు. దేశంలో కేసులు విపరీతంగా పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. రానున్న రోజుల్లో కేసుల […]
సారథి న్యూస్, పశ్చిమ గోదావరి: తెలంగాణా రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తరలిస్తున్న అక్రమ మద్యాన్ని ఎస్ఈబీ జీలుగుపల్లి చెక్‌పోస్ట్ వద్ద మెరుపుదాడి చేసి పట్టుకుంది. తెలంగాణ నుంచి ఏపీలోకి అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు జీలుగుమిల్లి చెక్ పోస్ట్ వద్ద ఎస్ఈబీ ఏఎస్పీ కరీముల్లా షరీఫ్ దాడి చేసి పట్టుకున్నారు. పట్టుబడ్డ మద్యం విలువ దాదాపు రూ.20లక్షలు ఉంటుంది. ఈ కేసులో సుమారు 20 లక్షల విలువచేసే 4275 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకొని […]
అప్పులబాధ భరించలేక ఓ సీరియల్ నటి, గాయని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఏపీలోని గుంటూరుకు చెందిన రేఖ నటనపై ఆసక్తితో హైదరాబాద్ కు వచ్చి కొంతకాలం టీవీ సీరియల్స్ నటించింది. తర్వాత అవకాశాలు తగ్గడంతో గుంటూరుకు వెళ్లింది. అక్కడ అహ్మద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. కుమార్తె పుట్టిన తర్వాత మనస్పర్థలు రావడంతో భర్తతో విడిపోయారు. అనంతరం చైతన్య అనే రియల్ఎస్టేట్ వ్యాపారిని వివాహం చేసుకున్నారు. గుంటూర్ విద్యానగర్‌లో ఉంటున్న రేఖ పెళ్లి వేడుకల్లో పాటలు పాడటం, యాంకరింగ్ […]