సారథి న్యూస్, ములుగు: ములుగు జిల్లా కేంద్రంలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే సీతక్క విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి, ప్రభుత్వ ఉపాధ్యాయులు, కాంగ్రెస్ నాయకులు నల్లెల కుమారస్వామి, గొల్లపల్లి రాజేందర్ గౌడ్, ఎండీ చాంద్ పాషా, చెన్నోజు సూర్యనారాయణ, బండి శ్రీనివాస్, తిరుపతిరెడ్డి, సాంబయ్య, రమణా కర్, అజ్జు తదితరులు పాల్గొన్నారు.
స్టాక్‌హోమ్: కరోనా మహమ్మారి ప్రబలుతున్న కారణంగా ఏటా నోబుల్ బహుమతుల గ్రహీతలకు ఇచ్చే విందును రద్దు చేశారు. కరోనా వ్యాప్తి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నోబెల్ ఫౌండేషన్ ఒక ప్రకటనలో చెప్పింది. ఏటా అవార్డు గ్రహితలతో పాటుసుమారు 1300 మందికి స్టాక్‌హోమ్‌లో విందును ఇస్తారు. ఈ సారి అవార్డులు ప్రకటిస్తామని, కానీ ఆడియన్స్ లేకుండా బాంకెట్ నిర్వహిస్తామని చెప్పారు. ఏటా డిసెంబర్ 10న ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. 1956లో హంగేరీ సోవియెట్ యూనియన్ దురాక్రమణను వ్యతిరేకిస్తూ, […]
సారథిన్యూస్, జోగుళాంబ గద్వాల: కరోనా విపత్తువేళ మనుషులల్లో మానవత్వం మంటగలుస్తున్నది. సన్నిహితులు, కుటుంబసభ్యులు, కన్నవాళ్లు, తోబుట్టువుల పట్ల కూడా అమానుషంగా వ్యవహరిస్తున్నారు కొందరు వ్యక్తులు. తాజాగా జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం రామాపురంలో ఓ వ్యక్తి (35) చనిపోగా.. కరోనాతో మరణించాడేమోనన్న అనుమానంతో అతడి మృతదేహాన్ని ప్రొక్లెయిన్‌లో తీసుకెళ్లి ఖననం చేశారు కుటుంబసభ్యులు. చనిపోయిన వ్యక్తికి కరోన లేదని వైద్యులు నిర్ధారించినప్పటికి కొందరు ఇలాంటి పనులకు పాల్పడుతున్నారు.
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో బుధవారం 1,554 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇలా మొత్తంగా రాష్ట్రంలో 49,259కు కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇప్పటి వరకు రికవరీ అయిన కేసులు 37,666 కేసులు నమోదయ్యాయి. తాజాగా 9 మంది మృతిచెందారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 429 మరణాలు సంభవించాయి. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. జీహెచ్ఎంసీ 842 కేసులు అత్యధికంగా నిర్ధారణ అయ్యాయి. రంగారెడ్డి 132, మేడ్చల్ 96, సంగారెడ్డి 24, ఖమ్మం 22, కామారెడ్డి 22, వరంగల్ అర్బన్ […]
ముబై: ‘నేనేమీ ట్రంప్‌ను కాదు. ప్రజలు బాధపడుతుంటే చూస్తూ ఊరుకోను’ అని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే అన్నారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. శివసేన పత్రిక సామ్నా కోసం సంజయ్‌రౌత్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో థాక్రే ఈ కామెంట్స్ చేశారు. ఈ వీకెండ్‌లో ‘అన్‌లాక్’ ఇంటర్వ్యూ పేరుతో రెండు భాగాలుగా ప్రసారం కానున్న వీడియో టీజర్‌ను సంజయ్ రౌత్ తన ట్విట్టర్‌లోఓ పోస్ట్ చేశారు. అయితే థాక్రే ఈ కామెంట్స్ ఏ ఉద్దేశంతో […]
సారథిన్యూస్, ఖమ్మం: తెలంగాణ రాష్ట్రంలో పేదవిద్యార్థులకు కార్పొరేట్ స్ఠాయి విద్య అందుతున్నదని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. బుధవారం ఆయన ఖమ్మం నగరంలోని ఇందిరానగర్‌లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. కరోనా నేపథ్యంలో పాఠశాల విద్యార్థుల చదువులకు ఆటంకం కలగకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మేయర్ పాపాలాల్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, డీఈవో మదన్ మోహన్, కార్పొరేటర్ చావా నారాయణ రావు తదితరులు పాల్గొన్నారు.
సారథిన్యూస్, కొత్తగూడెం: తెలంగాణ ఉద్యమకారుల మనోభావాలను అవమానించొద్దని భద్రాద్రి కొత్తగూడెం బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ (చిన్నీ) పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొత్తగూడెంలో ఉద్యమకారుల స్థూపాన్ని శ్మశానవాటిక అయిన ప్రగతి మైదానంలో నిర్మించడమేమిటని ప్రశ్నించారు. పాత అమరవీరుల స్థూపం ఉన్నచోట కొత్త స్థూపాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
ఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. 24 గంటల్లో 37,724 పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 648 మంది చనిపోయారు. దీంతో కరోనా బాధితుల సంఖ్య 11,92,915కు చేరింది. వీరిలో ఇప్పటి వరకు 28,732 మంది చనిపోయారని కేంద్ర హెల్త్ మినిస్ట్రీ బులిటెన్ రిలీజ్ చేసింది. దీంతో ప్రస్తుత లెక్కల ప్రకారం మరణాల్లో మన దేశం స్పెయిన్‌ని దాటేసింది. 7వ స్థానంలోకి వెళ్లింది. ఇప్పటి వరకు 28,400 మరణాలతో 7వ స్థానంలో ఉన్న స్పెయిన్ […]