సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి తగ్గడం లేదు. తాజాగా గురువారం 1,410 కేసులు నమోదయ్యాయి. పాజిటివ్ కేసులు 30,945కు చేరాయి. తాజాగా ఏడుగురు మృతి, ఇప్పటి వరకు 331 మంది మృతిచెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 918 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 125 కేసులు, మేడ్చల్ జిల్లాలో 67, సంగారెడ్డి 79, వరంగల్ అర్బన్‌జిల్లాలో 34 కేసుల చొప్పున నమోదయ్యాయి. ఇప్పటివరకు 1,40,755 కరోనా పరీక్షలు నిర్వహించారు.
సారథిన్యూస్, కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్రంలోకి మావోయిస్టులు ఎంటరయ్యారా? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగురు అటవీప్రాంతంలో మూడు మావోయిస్టు బృందాలు తిరుగుతున్నాయా? అంటే అవుననే సమాధానం వినవస్తుంది. మణుగురు అటవీప్రాంతంలో మావోయిస్టులు తిరుగుతున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో మణుగురు అటవీ ప్రాంతాన్ని 20 ప్రత్యేకబృందాలు జల్లెడ పడుతున్నాయి. ఈ ప్రాంతంలోని వ్యక్తులపై ఏ మాత్రం అనుమానం వచ్చినా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. సుమారు 400 మంది పోలీసులు మావోయిస్టుల కదలికలపై ముమ్మరంగా గాలిస్తున్నారు.
సారథిన్యూస్, చేవెళ్ల: భూ వివాదంలో లంచం తీసుకుంటూ ఓ సీఐ ఏసీబీకి చిక్కాడు. రంగారెడ్డి జిల్లా షాబాద్ సీఐ శంకరయ్య ఓ వ్యక్తికి సంబంధించిన భూ వివాదాన్ని పరిష్కరించేందుకు రూ. లక్ష 20వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో సదరు వ్యక్తి ఏసీబీని ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు గురువారం షాబాద్ పీఎస్‌లో శంకరయ్య యాదవ్, ఏఎస్సై రాజేందర్.. బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సీఐ శంకరయ్యపై గతంలోనూ అవినీతి కేసులున్నాయి. రంగారెడ్డి […]
చెన్నై: అద్దె చెల్లించమని అడిగిన పాపానికి ఇంటి ఓనర్‌ను హత్యచేశాడో వ్యక్తి. ఈ ఘటన చెన్నైలోని కుండ్రటూర్లో చోటుచేసుకున్నది. కుండ్రటూర్కు చెందిన గుణశేఖర్(51) ఇంట్లో కొంతకాలంగా ధనరాజ్ అనేవ్యక్తి అద్దెకు ఉంటున్నాడు. అయితే నాలుగునెలలుగా ధనరాజ్ యజమానికి అద్దె కట్టడం లేదు. దీంతో బుధవారం రాత్రి రెంట్ కట్టాలంటూ గుణశేఖర్.. ధనరాజ్‌పై ఒత్తిడి చేశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. కోపోధ్రిక్తుడైన ధనరాజ్ కుమారుడు అజిత్.. ఇంటి ఓనర్‌పై కత్తితో విచక్షణారహితంగా దాడిచేయడంతో అతడు […]
మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న బిగ్‌బాస్4లో ఆర్జీవీ పరిచయం చేసిన ‘నగ్నం’ హీరోయిన్ శ్రీరాపాకకు చోటు దక్కనున్నట్టు సమాచారం. ఇందులో భాగంగానే ఆమె పలు యూట్యూబ్ చానెళ్లలో బోల్డ్ కామెంట్స్ చేస్తున్నట్టు టాక్. బిగ్ బాస్ సీజన్ 4 కోసం ఇప్పటికే కంటెస్టంట్ల ఎంపిక ప్రక్రియ మొదలైందని టాక్. ఈ క్రమంలో ఈ షోలో పాల్గొనేందుకు గాను పలువురు సినీ తారలు పోటీ పడుతున్నారు. అయితే ఈ రేసులో ‘నగ్నం’ హీరోయిన్ శ్రీ రాపాక కూడా ఉన్నట్టు […]
తిరువనంతపురం: ఓ వైపు కరోనా మహమ్మారి దేశాన్ని కుదిపేస్తుంటే.. కొందరేమో నిబంధనలు గాలికి వదిలేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల కేరళలోని ఓ రిసార్ట్‌లో జరిగిన విందులో సుమారు 300 మంది పాల్గొన్నట్టు సమాచారం. అనంతరం ఆ వీడియోలను సోషల్‌మీడియాలో షేర్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేరళలోని హిల్లీ జిల్లా ఉదుంబంచోలలో ఈ ఘటన చోటుచేసుకున్నది. రిసార్టు మేనేజర్ సహా ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ ప్రైవేట్ కంపెనీ ప్రారంభోత్సవం సందర్భంగా జూన్ 29న ఈ […]
సీనియర్ నటి జయంతి ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం ఆమె బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఆమె శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది పడుతూ ఆస్పత్రిలో చేరినట్టు ఆమె కుమారుడు తెలిపారు. ప్రస్తుతం జయంతికి వెంటిలేటర్‌పై చికిత్స నందిస్తున్నారు. ఆమెకు కరోనా టెస్టులు నిర్వహించగా, నెగిటివ్ గా తేలినట్టుగా తెలిపారు. ఆమె చాలాకాలంగా ఆస్తమాతో బాధపడుతున్నట్టుగా సమాచారం. తెలుగు, కన్నడ, తమిళ, మరాఠి భాషల్లోని పలు చిత్రాల్లో జయంతి నటించారు. 1960లో ఆమె నటిగా కెరీర్ ఆరంభించారు. హీరోయిన్ […]
సారథి న్యూస్, మెదక్: నామినేటెడ్ పదవులపై అధికార పార్టీ నాయకులు ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వం ఇటీవల కొన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ లకు కొత్త పాలకవర్గాల నియమించింది. దీంతో మెదక్ జిల్లాలో మార్కెట్ కమిటీ, దేవాలయ కమిటీ చైర్మన్, డైరెక్టర్ పదవులు ఆశిస్తున్న టీఆర్ఎస్ నాయకులు ఆయ పదవుల కోసం జోరుగా లాబియింగ్ చేస్తున్నారు. మెదక్ జిల్లాలో పలు నామినేటెడ్ పోస్టులు చాలా కాలంగా ఖాళీగా ఉన్నాయి. గత పాలక వర్గాల పదవీ కాలం ముగిసిపోయినప్పటికి కొత్త […]