సారథి న్యూస్, మెదక్: మెదక్ జిల్లాలో మరో కొత్త మండలం ఏర్పాటు కానుంది. వెల్దుర్తి మండలంలోని మాసాయిపేట కేంద్రంగా కొత్త మండలం ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ బుధవారం ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేశారు. వెల్దుర్తి మండలంలోని 6 గ్రామాలు, చేగుంట మండలంలోని 3 గ్రామాలను కలిపి కొత్త మండలం ఏర్పాటు కానుంది. గతనెల 25న హరిత హారం కార్యక్రమ ప్రారంభం కోసం సీఎం కేసీఆర్ నర్సాపూర్ కు వచ్చిన సందర్భంగా […]
సారథి న్యూస్, మెదక్: మెదక్ జిల్లా కలెక్టర్ ఓ సర్పంచ్ పై సస్పెన్షన్ వేటువేశారు. ప్రభుత్వ ఆదేశాలు పాటించకపోవడం, నిధుల దుర్వినియోగం నేపథ్యంలో మనోహరాబాద్ మండలం కళ్లకల్ సర్పంచ్ ను ఆరు నెలల పాటు సస్పెండ్ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతనెల 6న పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ కళ్లకల్ గ్రామాన్ని సందర్శించారు. హరితహారం మొక్కలు చనిపోవడంతో పాటు తడి పొడి చెత్తను వేరు చేయకపోవడం, గ్రామంలో పారిశుద్ధ్యం లోపించడంపై కలెక్టర్ సర్పంచ్ […]
సారథిన్యూస్, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో పోలీసులు తనిఖీ చేసి వ్యభిచార ముఠాను అదుపులోకి తీసుకున్నారు. పాల్వంచలోని ఓ ఇంజిరింగ్ కళాశాల సమీపంలోని ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు తనిఖీచేసి ముగ్గురు మహిళలతోపాటు ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నారు.
సారథి న్యూస్, చొప్పదండి: ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీని అరికట్టాలని ఏబీవీపీ పట్టణ ఉపాధ్యక్షుడు అనుమల్ల కోటేశ్ డిమాండ్ చేశారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు కరోనా సాకుతో ఆన్లైన్ క్లాసులంటూ లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నాయని మండిపడ్డారు. బుధవారం కరీంనగర్ జిల్లా చొప్పదండిలోని శక్తిభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ అనుమతి లేకుండా కరోనా సమయంలో అడ్మిషన్లు నిర్వహిస్తున్న విద్యాసంస్థల గుర్తింపు రద్దు చేయాలన్నారు. చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు సంతోష్, సాయి గణేష్, లక్ష్మీపతి, అఖిల్, […]
సారథిన్యూస్, నల్లగొండ: పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని నల్లగొండ అదనపు ఎస్పీ నర్మద పేర్కొన్నారు. హరితహారంలో భాగంగా బుధవారం ఆమె నల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమానికి అధిక ప్రాధాన్యమిస్తున్నదని చెప్పారు. కార్యక్రమంలో వన్ టౌన్ సీఐ నిగిడాల సురేశ్, ఎస్ఐ గుత్తా వెంకట్ రెడ్డి, సిబ్బంది శ్రీనివాస్, సతీశ్, రాము, షకీల్, కిరణ్, లతీఫ్ తదితరులు పాల్గొన్నారు.
సారథి న్యూస్, గంగాధర: నవోదయ విద్యాలయంలో సీటు సాధించిన ఓ విద్యార్థిని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అభినందించారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం సర్వారెడ్డి పల్లె సర్పంచ్ చిలుమల రమేశ్ కూతురు రష్మిక నవోదయ పాఠశాలలో సీటు సాధించింది. ఎమ్మెల్యే ఆ విద్యార్థినిని అభినందించారు.
సారథి న్యూస్, కర్నూలు: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. బుధవారం ఒకే రోజు 657 పాజిటివ్‌కేసులు నమోదయ్యాయి. ఇందులో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారినుంచి 39, ఇతర దేశాల నుంచి ఏడుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మొత్తంగా ఇప్పటి వరకు 15,252 పాజిటివ్‌కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు 8,071 ఉన్నాయి. ఇప్పటివరకు 6,988 మంది వ్యాధి బారినపడి డిశ్చార్జ్అయ్యారు. ఇప్పటి వరకు 193 మంది చనిపోయారు. అయితే జిల్లాల వారీగా పరిశీలిస్తే .. అనంతపురం జిల్లాలో […]
సారథి న్యూస్, కర్నూలు: తుంగభద్ర పుష్కరాలు సమీపిస్తున్న నేపథ్యంలో భారీ స్థాయిలో ఏర్పాట్లు చేయాని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. 12 ఏళ్ల ఒకసారి వచ్చే పుష్కరాల్లో స్నానం చేస్తే.. ఎంతో పుణ్యఫం భిస్తుందని పేర్కొన్న ఆయన.. నవంబర్‌లో జరిగే పుష్కరాలకు తుంగభద్ర నదిలో నీళ్లు పుష్కలంగా ఉండేలా, మురుగు కలవకుండా, భక్తులకు ఇబ్బందులు లేకుండా ఘాట్లు ఏర్పాటు చేయాలని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డిని కోరారు. ఈ మేరకు […]