Breaking News

Month: June 2020

నాటిన మొక్కలను రక్షిద్దాం

పెద్దపల్లి: మొక్కలు నాటడమే కాక వాటిని సంరక్షించడం ముఖ్యమని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్​ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్​ పరిధిలోని మల్కాపూర్ వద్ద ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను సంరక్షించేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. మరోవైపు కరీంనగర్​ జిల్లా చొప్పదండి పోలీస్​స్టేషన్​లో సీఐ రమేశ్​, ఎస్సై అనూష మొక్కలు నాటారు. పెద్దపల్లి జిల్లాలోని ఎరువుల కర్మాగారం ప్రాంగణంలో ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​ రాజన్​ […]

Read More

రెవెన్యూశాఖలో భారీగా అక్రమాలు

సారథిన్యూస్​, ఖమ్మం: రెవెన్యూశాఖ అధికారులు భారీగా అక్రమాలకు పాల్పడుతున్నారని గోండ్వానా సంక్షేమపరిషత్​ నాయకుడు విద్యాసాగర్​ ఆరోపించారు. గురువారం ఆయన ఖమ్మం జిల్లా కోయవీరాపురంలో పర్యటించి ప్రజల భూసంబంధిత సమస్యలు తెలుసుకున్నారు. ఆదివాసి గ్రామమైన కోయవీరాపురం రెవెన్యూ అధికారుల అక్రమాలతో కొట్టుమిట్టాడుతున్నదని చెప్పారు. ఆదివాసులు సాగుచేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వకుండా రెవెన్యూ అధికారులు వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. రెవెన్యూ అధికారులు చట్టాన్ని అమలుచేయడం లేదన్నారు. ఆయనవెంటన గిరిజనసంఘం నాయకులు చాప శాంతమ్మ, సోడి రాంబాయి, పీర్ల చెన్నమ్మ తదితరులు […]

Read More

సామాన్యుడి నడ్డి విరుస్తున్న కేంద్రం

సారథిన్యూస్​, గోదావరిఖని: కేంద్రప్రభుత్వం పెట్రోలు, డీజిల్​ ధరలు పెంచుతూ సామాన్యుడి నడ్డి విరుస్తున్నదని వామపక్ష నాయకులు ఆరోపించారు. గురువారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. కరోనాను అరికట్టడంలో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వై యాకయ్య , సీపీఐ (ఎంఎల్ ) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు నరేశ్​, వామపక్ష నాయకులు తోకల రమేశ్​, మహేశ్వరీ, లావణ్య, ఫైముదా, పీర్ మహ్మద్, మోగిలి, ఎం దుర్గయ్య, […]

Read More

కరోనాను ఎదుర్కొందాం

సారథి న్యూస్, కర్నూలు: కనిపించని వైరస్‌తో ప్రపంచ దేశాలు పోరాటం చేస్తున్నాయని, నిర్లక్ష్యంతోనే వైరస్‌ వ్యాప్తి చెందుతుందని సోషల్‌ వెల్ఫేర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ రమాదేవి అన్నారు. ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలతో కరోనా మహమ్మారిని ఎదుర్కొందామని ఆమె పిలుపునిచ్చారు. గురువారం కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో సంస్కృతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వెయ్యి మాస్కులు, మూడొందల శానిటైజర్లు పంపిణీ చేశారు. అత్యవసరం అయితే తప్ప బయటికి రాకూడదని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించే ఉపాధి పనులను […]

Read More

‘రైతుబీమా’ గొప్పపథకం

సారథిన్యూస్, రామడుగు: సీఎం కేసీఆర్​ ప్రవేశపెట్టిన రైతుబీమా పథకం అన్నదాతల పాలిట గొప్పవరమని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ పేర్కొన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇటువంటి పథకం లేదని చెప్పారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండి గ్రామానికి చెందిన దుర్గం రములు అనే రైతు ఇటీవలే చనిపోగా అతడి కుటుంబానికి బుధవారం ఎమ్మెల్యే రైతు బీమా ప్రొసీడింగ్స్​ అందజేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్​ ఏనుగు రవీందర్ రెడ్డి, ఎంపీపీ కల్గెటి కవిత, జెడ్పీటీసీ మారుకొండ […]

Read More

అప్పు పుట్టదు.. ఎవుసం సాగదు

తెలంగాణ రైతుల పరిస్థితి ఇది ఖరీఫ్​ రుణాలకు సవాలక్ష కొర్రీలు ఈ ఏడాది రూ.33,713 కోట్ల లక్ష్యం ఇప్పటి వరకు ఇచ్చింది రూ.500కోట్లు సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో రైతులు పంట పెట్టుబడులకు నానా ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకులు రైతులందరికీ లోన్లు ఇవ్వడం లేదు. ఖరీఫ్ వ్యవసాయ పనులు ఊపందుకున్నా.. నిర్దేశించిన లక్ష్యంలో ఒక శాతం మేర కూడా బ్యాంకర్లు రుణాలు ఇవ్వలేదు. దీంతో రైతులు వడ్డీ వ్యాపారుల నుంచి అప్పు తీసుకోవాల్సి వస్తోంది. బ్యాంకులు పంట […]

Read More

కోదాడలో తొలి కరోనా

సారథిన్యూస్​, కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడలో తొలి కరోనా కేసు నమోదైంది. పట్టణానికి చెందిన ఓ యువకుడు హైదరాబాద్​లో సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​గా పనిచేస్తున్నాడు. ఈ నెల 11న ఓ వివాహవేడుకలో పాల్గొనేందుకు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వెళ్లాడు. రెండ్రోజుల పాటు అక్కడే ఉన్నాడు. పెళ్లి నుంచి వచ్చినప్పటి నుంచి అస్వస్థతతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో అతడికి వైద్యపరీక్షలు చేయగా కరోనా పాజిటివ్​గా తేలింది. దీంతో అతడిని సూర్యాపేట దవాఖానకు తరలించారు. కాగా ఆ యువకుడి ప్రైమరీ కాంటాక్ట్​లను […]

Read More

సబ్​రిజిస్ట్రార్​ పెద్దమనసు

సారథి న్యూస్, ములుగు: ములుగు జిల్లా కేంద్రంలో సబ్​రిజిస్ట్రార్​కు పనిచేస్తున్న తస్లీమా.. నిబద్ధతతో విధులు నిర్వర్తించడమే కాక తన వద్దకు వచ్చిన నిరుపేదలకు తోచిన సాయం చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాన్ని పోషించుకోలేక ఇబ్బందులు పడుతున్న నేపాల్​కు చెందిన ధీరజ్​ జోషి అనే గుర్ఖాకు గోధుమపిండి, నిత్యావసరసరుకులు పంపిణీ చేశారు. అనంతరం పందికుంట గ్రామానికి చెందిన అనిత అనే మహిళకు 25 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వారి పిల్లల చదువులకు సంబంధించిన బాధ్యత […]

Read More