సారథిన్యూస్, రామడుగు: జాతీయ ఉపాధి హామీ పథకం కింద రైతులు కల్లాలు నిర్మించుకొనేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని కరీంనగర్ జిల్లా రామడుగు మండల వ్యవసాయ అధికారి యాస్మిన్ పేర్కొన్నారు. రైతులు ధాన్యాన్ని ఆరబోసుకోటానికి ఈ కల్లాలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. ఈ కల్లాలకు చిన్న సన్నకారు రైతులు అర్హులని పేర్కొన్నారు. 50 చ.మీ కల్లాలకు రూ. 56 వేలు, 60 చ. మీ రూ. 68 వేలు, 75 చ.మీ రూ. 85వేలు నిర్ధారించారని చెప్పారు. […]
సారథిన్యూస్, ఖమ్మం: కరోనా వచ్చిందంటూ తనపై సాక్షాత్తూ ఖమ్మం డీఎమ్హెచ్వో డాక్టర్ మాలతి దుష్ప్రచారం చేశారని జిల్లాకు చెందిన డాక్టర్ శంకర్‌నాయక్ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. డీఎమ్‌హెచ్‌వోపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తనకు కరోనా నెగిటివ్ వచ్చినప్పటికీ కావాలని తనకు పాజిటివ్ వచ్చందంటూ రిపోర్టులు మార్చి కొందరు తప్పుడు సమాచారాన్ని వైరల్ చేశారని మండిపడ్డారు. తన కరోనా నెగెటివ్ వచ్చన రిపోర్టులను శంకర్‌నాయక్ కలెక్టర్ కు చూపించారు. డీఎంఅండ్‌హెచ్‌వో పనితీరు సక్రమంగా లేదని ఆమె […]
సారథి న్యూస్, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ కలెక్టర్ ఈ.శ్రీధర్‌పై ఆదివారం బదిలీవేటు పడింది. వనపర్తి జిల్లా కలెక్టర్ యాష్మిన్బాషాకు నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్‌గా ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను సరిగ్గా నిర్వహించలేదనే కారణంతో బదిలీ వేటుపడినట్లు తెలుస్తోంది. అలాగే గృహనిర్మాణశాఖ అదనపు బాధ్యతల నుంచి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామచంద్రన్‌ను ప్రభుత్వం తప్పించింది. ఆమె స్థానంలో సునీల్‌శర్మకు అదనపు బాధ్యతలు అప్పగించింది.
సారథి న్యూస్, కర్నూలు: ప్రతి ఒక్కరి అభ్యున్నతే లక్ష్యంగా బీజేపీ ముందుకెళ్తుందని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం బీజేపీ కార్యదర్శి మధుకర్ జి, బైరెడ్డి శబరి, రాష్ట్ర కార్యదర్శి హరీశ్ బాబు, కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు రామస్వామి, పార్టీ నాయకులతో కలిసి పాణ్యం నియోజకవర్గం కల్లూరు మండలం లక్ష్మీపురం గ్రామంలో ఇంటింటికి తిరిగి దేశ ప్రజల కోసం ప్రధాని నరేంద్రమోడీ 2.0 ప్రభుత్వం చేపట్టిన పథకాలను వివరించారు. దేశంలోని ప్రతి […]
సారథి న్యూస్, కర్నూలు: ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగానే కర్నూలు నగర పాలక పరిధిలో వ్యాపారాలు చేసుకోవాలని కమిషనర్ డీకే బాలాజీ సూచించారు. ఆదివారం ఆయన నగరంలోని కృష్ణానగర్, గణేష్ నగర్, ఎస్.నాగప్ప వీధి, నంద్యాల చెక్ పోస్టు ప్రాంతాల్లో కోవిడ్–19 నిబంధనలు పాటించని వారికి ఫైన్విధించారు. పాత బస్టాండ్ ఎస్.నాగప్ప వీధిలోని ఓ షాపు రెగ్జిన్ కవర్ ఏర్పాటు చేసుకోకపోవడంతో పాటు ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారాన్ని నిర్వహిస్తున్నందుకు సదురు దుకాణ యజమానికి రూ.500, అలాగే మాస్క్ […]
బిజినేపల్లి , సారథి న్యూస్: ఆర్ఎంపీ వైద్యం వికటించి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఆగ్రహించిన బాధితుడి కుటుంబసభ్యులు ఆర్ఎంపీ దవాఖాన ఎదుట ఆందోళన చేపట్టారు. పోలీసులు వచ్చి ఆర్ఎంపీని అదుపులోకి తీసుకున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం మంగనూర్‌కు చెందిన శ్రీనివాస్‌రెడ్డి(35) తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబసభ్యులు అదే గ్రామంలోని వేంకటేశ్వర ప్రాథమిక చికిత్స కేంద్రం లో ఉన్న ఆర్ఎంపీ వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లారు. అతడికి పెరాలసిస్ వచ్చినట్టు నిర్దారించుకొన్న వైద్యుడు అతడికి మందులు, […]
సారథి న్యూస్, హైదరాబాద్: ఏపీలో కొత్తగా ఆదివారం 755 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 50 మందికి, బయటి దేశాల నుంచి వచ్చిన 8 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇలా రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13,098కు చేరింది. గత 24 గంటల్లో 25,778 శాంపిల్స్‌ను పరీక్షించగా 755 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కరోనా మహమ్మారితో కర్నూలులో ఆరుగురు, కృష్ణా జిల్లాలో […]
డిఫరెంట్ కథలనే ఎంచుకుంటాడు యంగ్ హీరో శ్రీవిష్ణు. ‘అప్పట్లో ఒకడుండేవాడు’, ‘నీది నాది ఒకే కథ’, ‘మెంటల్ మదిలో’, ‘బ్రోచే వారెవరురా’, ‘తిప్పరా మీసం’.. ఇలా విష్ణు సినిమాలన్నీ వైవిధ్యంగానే ఉంటాయి. అలా స్టైల్ మెయిన్ టెయిన్ చేయడంతో ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు పొందాడు విష్ణు. ప్రస్తుతం వివేక ఆత్రేయ అసిస్టెంట్ అసిత్ గోలి డైరెక్షన్లో ‘రాజ రాజ చోర’ సినిమా చేస్తున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ కలిసి కట్టుగా ఈ […]