సారథి న్యూస్, హుస్నాబాద్: విద్యారంగ సమస్యలపై ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ (ఏఐఎస్బీ) 70 ఏండ్లుగా పోరాడుతున్నదని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గవ్వ వంశీధర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో ఏఐఎస్బీ వార్షికోత్సవ వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కొలుగూరి సూర్యకిరణ్, అతికం రాజశేఖర్ గౌడ్, జిల్లా కార్యదర్శి బద్ధం ప్రవీణ్ రెడ్డి, చల్లురి విష్ణు వర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
సారథిన్యూస్, పాల్వంచ: ఓ మహిళా అధికారి లంచం తీసుకుంటూ రెడ్‌హ్యండెడ్‌గా ఏసీబీకి చిక్కింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలానికి చెందిన ఓ బాధితురాలు .. కల్యాణలక్ష్మి కోసం దరఖాస్తు చేసుకున్నది. ఆ దరఖాస్తును అప్రూవల్ చేసేందుకు వీఆర్వో పద్మ లంచం డిమాండ్ చేసింది. బాధితురాలు ఏసీబీని ఆశ్రయించగా .. రంగంలోకి దిగిన అధికారులు మంగళవారం తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్వో పద్మ.. లంచం తీసుకుంటుండగా అధికారులు గా పట్టుకున్నారు.
న్యూఢిల్లీ: అమెరికాలో ఇరుక్కుపోయిన మనవాళ్లను ఇక్కడికి తీసుకొచ్చేందుకు ఎయిర్ ఇండియా నడుపుతున్న వందేభారత్ ఫ్లైట్లపై అమెరికా ఆంక్షలు విధించింది. అమెరికా ప్రభుత్వం ఇలాంటి ఫ్లైట్లు నడపకుండా ఇండియన్ గవర్నమెంట్ నిషేధం విధించిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అమెరికన్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ చెప్పింది. ఇప్పటి నుంచి ఫ్లైట్లు నడపాలంటే కచ్చితంగా 30 రోజుల ముందే అప్లికేషన్ పెట్టుకోవాలని కొత్త నిబంధనలు ఇచ్చింది. మూడో విడత వందేభారత్ మిషన్ కింద అమెరికాలోని వివిధ ప్రదేశాల నుంచి ఇండియా ఈ […]
హరిద్వార్: ప్రపంచాన్ని వణికిస్తున్న కంటికి కనిపించని మహమ్మారికి చెక్ పెట్టేందుకు ఆయుర్వేద మందు వచ్చేసింది. ప్రముఖ దేశీయ కంపెనీ పతంజలి దీన్ని మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ‘కొరోనిల్’ పేరుతో ఈ మందును ప్రముఖ యోగా గురువు రామ్‌దేవ్ బాబా మంగళవారం హరిద్వారలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆవిష్కరించారు. మెడిసిన్‌ను డెవలప్ చేసేందుకు సైంటిస్టుల టీమ్ పనిచేస్తోందని సీఈవో ఆచార్య బాలకృష్ణ గతంలోనే ప్రకటించారు. పతంజలి రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (పీఆర్‌ఐ), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్ జైపూర్‌తో […]
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ పుల్వామా జిల్లాలోని బుందోజ్ ఏరియాలో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను సెక్యూరిటీ సిబ్బంది మట్టుబెట్టారు. ఉగ్రవాదులు జరిపిన ఎదురుకాల్పుల్లో సీఆర్‌పీఎఫ్ జవాన్ఒకరు ప్రాణాలు విడిచినట్లు అధికారులు చెప్పారు. బుందూజ్ ఏరియాలో టెర్రరిస్టులు దాక్కురనే పక్కా సమాచారంతో మన సైనికులు కార్డెన్ సర్చ్ నిర్వహించారు. ఆ సమయంలో ఒక ఇంట్లో నక్కి ఉన్న టెర్రరిస్టులు కాల్పులకు దిగడంతో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ నేపథ్యంలో ఒక జవాన్‌కు తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్‌కు తరలించగా అతడు […]
న్యూఢిల్లీ: ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితురాలు జామియా ఇస్లామియా స్టూడెంట్ సఫూరా జార్గర్‌కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. ఎంఫిల్ చదువుతున్న సఫూరా 23 వారాల ప్రెగ్నెంట్ కావడంతో పోలీసులు తరఫున కోర్టుకు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బెయిల్ ఇచ్చేందుకు అబ్జక్షన్ చెప్పలేదు. ఆమె ప్రెగ్నెంట్ కావునా బెయిల్ ఇచ్చేందుకు తమకు అభ్యంతరం లేదని ఆయన కోర్టులో చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన అల్లర్లకు […]
అమరావతి: ఏపీలో 24 గంటల్లో 462 కేసులు నమోదయ్యాయి. వాటిలో రాష్ట్రంలోని వారికి 407 కేసులు కాగా.. విదేశాల నుంచి వారిలో 15 మందికి, వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన 40 మందికి వైరస్ ప్రబలినట్లు అధికారులు మంగళవారం హెల్త్ బులిటెన్ రిలీజ్ చేశారు. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసులు 7858 కాగా.. ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చిన వారితో కలిపి మొత్తం 9834కు చేరాయి. ఇప్పటి వరకు 3,566 మంది డిశ్చార్జ్ అయ్యారు. 4,173 […]
సారథి న్యూస్, హుస్నాబాద్ : సీఎం కేసీఆర్ గిరిజనుల ఆత్మ బంధువని అక్కన్నపేట ఎంపీపీ మాలోతు లక్ష్మి పేర్కొన్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లా అక్కన్నపేట మండలం కపూర్ నాయక్ తండాలో కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు, కల్యాణ లక్ష్మితో పాటు అనేక సంక్షేమ పథకాలు పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సంతోష్ నాయక్, ఉప సర్పంచ్ స్వరూప, అధికారులు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.