Breaking News

ప్రైవేటీకరణ

భారత అంతరిక్ష పరిశోధనా రంగంలో సంస్కరణలు

భారత అంతరిక్ష పరిశోధనా రంగంలో సంస్కరణలు

న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)ను ప్రైవేటుపరం ఎప్పటికీ కాదని సంస్థ చైర్మన్, సెక్రటరీ కె.శివన్ గురువారం స్పష్టంచేశారు. అంతరిక్ష పరిశోధనా రంగంలో అనేక సంస్కరణలు తీసుకురానున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిందని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పేస్ సెక్టార్‌లో సంస్కరణలు తెస్తున్నట్టు ప్రకటించగానే కొందరు ఇస్రోను ప్రైవేటుపరం చేస్తారనే అపోహలను తెరపైకి తెచ్చారని, ఇస్రో ప్రైవేట్​పరం కాదని పదేపదే నేను చెబుతూనే ఉన్నాను.. అని శివన్ పేర్కొన్నారు. ప్రైవేట్​వ్యక్తులు కూడా అంతరిక్ష కార్యక్రమాలు […]

Read More

విద్యా ప్రైవేటీకరణపై పోరాడుతాం

సారథి న్యూస్, హుస్నాబాద్: విద్యారంగ సమస్యలపై ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ (ఏఐఎస్​బీ) 70 ఏండ్లుగా పోరాడుతున్నదని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గవ్వ వంశీధర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కరీంనగర్​ జిల్లా హుస్నాబాద్​లో ఏఐఎస్​బీ వార్షికోత్సవ వాల్​పోస్టర్​ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కొలుగూరి సూర్యకిరణ్, అతికం రాజశేఖర్ గౌడ్, జిల్లా కార్యదర్శి బద్ధం ప్రవీణ్ రెడ్డి, చల్లురి విష్ణు వర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

Read More

ప్రైవేటీకరణకు ఒప్పుకోం..

సారథి న్యూస్​, గోదావరిఖని: బొగ్గు బ్లాక్​లను ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణి జాతీయసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గోదావరిఖనిలోని జీఎం కార్యాలయ ఎదుట ఆందోళన చేపట్టారు. ఇప్పటికైనా కేంద్రప్రభుత్వం బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి, నాయకులు మెండ శ్రీనివాస్, ఏఐటీయూసీ నాయకులు వై. గట్టయ్య, మేరుగు రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

Read More