సారథి న్యూస్, ములుగు: వెంకటాపురం మండలంలోని మరికాల గ్రామంలో ఖమ్మం ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ మంగళవారం పర్యటించారు. హరితహారంలో భాగంగా మరికాల పంచాయతీ ఆవరణలో మొక్కలు నాటారు. గ్రామంలోని ప్రతి ఇంటికి పూలు, పండ్ల మొక్కలు పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలోని డంపింగ్ యార్డ్ పనులు, రైతు వేదిక పనులు పరిశీలించారు. ఆయన వెంట నుగూర్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బుచ్చయ్య, జడ్పీటీసీ రమణ, తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీవో అనురాధ ఉన్నారు.
సారథిన్యూస్, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో భారీగా నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. సుమారు రూ. 30 లక్షలు విలువైన 15 క్వింటాళ్ల పత్తి విత్తనాలను, వాటిని ప్యాకింగ్ చేసే మిషనరీని, సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నల్లగొండ జిల్లా చండూరు మండలం కమ్మగూడెంలో నకిలీ విత్తనాలు ఉన్నట్టు పోలీసులకు సమాచారమందింది. కూపీ లాగగా.. ఏపీ, తెలంగాణకు చెందిన ఓ ముఠా ఈ నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు జోగుళాంబ గద్వాల, […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో మంగళవారం కొత్తగా 879 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ముగ్గురు మృత్యువాతపడ్డారు. కరోనా కేసుల సంఖ్య 9,553కి చేరింది. యాక్టివ్ కేసులు 5,109 ఉన్నాయి. వ్యాధిబారినపడి 4,224 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో మరణాల సంఖ్య 220కు చేరింది. కేవలం జీహెచ్ఎంసీ పరిధిలోనే 652 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లా నుంచి 64, మేడ్చల్ జిల్లా నుంచి 112, వరంగల్ రూరల్ జిల్లాలో 14, కామారెడ్డి జిల్లాలో 10చొప్పున కేసులు నమోదయ్యాయి.
సారథి న్యూస్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల ప్రగతి స్ఫూర్తిదాయకమని మంత్రి కె.తారక రామారావు అన్నారు. సిరిసిల్లలో రూ.5.15 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆధునికత రైతు బజార్ ను మంగళవారం ఆయన ప్రారంభించారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తిచేయడం సీఎం పనితీరుకు అద్దంపడుతుందన్నారు.
లాక్ డౌన్ లేకుంటే కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ పుట్టినరోజును పెద్ద ఎత్తున జరుపుకునే వాళ్లు ఫ్యాన్స్. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు అభిమానులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సందేశాలు పోస్ట్ చేశారు. ఈ క్రమంలో ‘మహానటి’ కీర్తి సురేష్ మాత్రం విజయ్ కు చాలా స్పెషల్ గా బర్త్ డే విషెస్ తెలియజేశారు. ‘మాస్టర్’ చిత్రం నుంచి విడుదలైన కుట్టి స్టోరీ సాంగ్ కు ఆమె వయోలిన్ […]
టాలీవుడ్ టాప్ కమెడియన్లలో ఒకరిగా ఉండేవారు సునీల్. కొద్దికాలం కిందట హీరోగా తన సత్తా చాటేందుకు మరో అడుగు ముందుకేసాడు సునీల్. హ్యస్యనటుడిగా పీక్ స్టేజీలో ఉన్నప్పుడు ‘అందాల రాముడు’ సినిమాతో హీరోగా మారాడు. ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది. ఆ తర్వాత రాజమౌళి తెరకెక్కించిన ‘మర్యాదరామన్న’ కూడా అంతే సక్సెస్‌ను అందుకున్నాడు సునీల్. వెంటనే వరుసగా సినిమా ఛాన్స్‌లు రావడంతో హీరోగా కంటిన్యూ అయ్యాడు. అయితే తర్వాత రోజుల్లో సునీల్ హీరోగా నటిస్తున్న సినిమాలు […]
సారథిన్యూస్, రామడుగు: ఇసుకను అక్రమంగా రవాణాచేసే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని కరీంనగర్ జిల్లా రామడుగు ఎస్సై అనూష హెచ్చరించారు. ఎన్నిసార్లు హెచ్చరించినా కొందరిలో మార్పు రావడం లేదన్నారు. అటువంటి వారిని ఉపేక్షించబోమన్నారు. బుధవారం మండలంలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను సీజ్‌చేశారు.
వాషింగ్టన్: కరోనా కాలంలో ఉద్యోగాలు పోయిన అమెరికన్లకు సాయం చేసేందుకు హెచ్1బీ వీసాలను రద్దుచేయాలని ట్రంప్ నిర్ణయించిన విషయంపై గూగుల్, ఆల్ఫాబెల్ సీఈవో సుందర్‌పిచాయ్ అసంతృప్తి వ్యక్తంచేశారు. ట్విట్టర్ ద్వారా స్పందించారు. వీసాలు జారీ చేయబోమని ట్రంప్ చెప్పినప్పటికీ తాము మాత్రం ఇమ్మిగ్రెంట్లకు మద్దతుగా నిలుస్తామని అన్నారు. ‘ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం నిరుత్సాహపరిచింది. . అమెరికా ఆర్థిక ప్రగతిలో ఇమ్మిగ్రేషన్ విధానం చాలా హెల్ప్ చేస్తోంది. ఆ కారణంగానే అమెరికా టెక్నాలజీలో గ్లోబల్ లీడర్‌గా నిలిచింది. […]