సారథి న్యూస్, హైదరాబాద్: టీ.సైబర్ ప్రాజెక్టుతో విద్యావైద్యం, సాగు నీటి రంగాల్లో ప్రజలకు త్వరితగతిన సేవలు అందుతాయని అన్నారు. మంత్రి కె.తారక రామారావు అన్నారు. టీ.సైబర్ ప్రాజెక్టు పనుల పురోగతిపై మంగళవారం ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ(ఐటీ) శాఖ అధికారులతో సమీక్షించారు. నాలుగేళ్లలో ఏ గ్రామంలో ఏం పనులు చేయాలనే విషయమై ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఈ వివరాలతో డిస్ట్రిక్ట్ కార్డును తయారుచేయాలని సీఎం కేసీఆర్ చెప్పారని గుర్తుచేశారు.మంత్రి పర్యటన రద్దుమంత్రి కేటీఆర్ ఈనెల 17న వరంగల్ జిల్లా […]
సారథిన్యూస్, సూర్యాపేట: భారత్ – చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో సూర్యాపేటకు చెందిన ఆర్మీ అధికారి మృతిచెందారు. సూర్యాపేటకు చెందిన సంతోష్ కుమార్ భారత్-చైనా సరిహద్దులో కల్నల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. మంగళవారం ఇరుదేశాల బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో సంతోష్ ప్రాణాలు కోల్పోయాడు. ఆర్మీ అధికారులు సూర్యాపేటలోని ఆయన కుటుంబసభ్యులకు మరణవార్తను తెలిపారు. ఆయనకు భార్య సంతోషి, కుమార్తె అభిజ్ఞ(9), కుమారుడు అనిరుధ్(4) ఉన్నారు. సంతోష్ కోరుకొండ సైనిక్ స్కూలులో విద్యాభ్యాసం పూర్తి చేశారు. సంతోష్ మరణ […]
సారథిన్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా రోజురోజుకు కోరలు చాస్తున్నది. తాజాగా హైదరాబాద్ కోఠిలోని గోకుల్ చాట్ యాజమాని విజయ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో అధికారులు దుకాణాన్ని మూసివేయించారు. షాప్‌లో పనిచేసే 20 మంది సిబ్బందిని క్వారంటైన్‌కు తరలించారు. దీంతో ఇటీవల గోకుల్‌చాట్‌కు వెళ్లిన వారిలో ఆందోళన మొదలైంది. అధికారులు ఇటీవల షాపునకు వెళ్లినవారి వివరాలు సేకరిస్తున్నారు.
సారథి న్యూస్ నారాయణఖేడ్: మహిళా ఎంపీటీసీపై దాడి జరిగిన ఘటన సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలో చోటుచేసుకున్నది. దెగుల్ వాడి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ ఎంపీటీసీ సుశీలమ్మపై కాంగ్రెస్ పార్టీకి చెందిన సొసైటీ మెంబర్ కుపేందర్ రెడ్డి అయన కుటుంబ సభ్యులు దాడి చేశారు. మహిళా అన్ని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్లు దుర్భాషలాడి దాడి చేసినట్లు ఎంపీటీసీ సుశీలమ్మ ఆరోపించారు. సొయా విత్తనాల కోసం రైతులకు టోకెన్లు అందిస్తున్న సమయంలో మాటమాట పెరిగి దాడికి దారి […]
సారథిన్యూస్, ఖమ్మం: మధిర నియోజకవర్గం అభివృద్ధిపథంలో కొనసాగుతున్నదని జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు పేర్కొన్నారు. మధిరలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలకతీతంగా మధిర అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు పరుగులు పెడుతుందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు రావూరి శ్రీనివాసరావు, దేవిశెట్టి రంగారావు, మొండితోక జయకర్, బిక్కి ప్రసాద్, రంగిశెట్టి కోటేశ్వరరావు, భరత్ వెంకటరెడ్డి, అరిగే శ్రీను వైవీ అప్పారావు, ఇక్బాల్ కొటారి రాఘవరావు, కనుమూరు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
సారథిన్యూస్, గోదావరిఖని: కల్లు తీసేందుకు వెళ్లిన ఓ గీతకార్మికుడికి.. మోకు మెడకు చుట్టుకొని ఊపిరాడక అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా గుర్రంపల్లి గ్రామంలో విషాదం నింపింది. గుర్రంపల్లికి చెందిన మామిడి రాజు ప్రతిరోజు మాదిరిగానే కల్లు తీసేందుకు మోకు సాయంతో తాటిచెట్టు ఎక్కాడు. ఈ క్రమంలో మోకు.. మెడకు చుట్టుకున్నది. దీంతో ఉపిరాడక అక్కడికక్కడే మృతిచెందాడు. గమనించిన తోటి గీతకార్మికులు మృతదేహాన్ని చెట్టుపైనుంచి కిందకు దించారు.
నారాయణఖేడ్, సారథి న్యూస్: సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలోనూ రైతు బంధు నిధులు విడుదల చేసిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు. మంగళవారం తన కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో కంగ్టి ఎంపీపీ సంగీత వెంకట్ రెడ్డి, జడ్పీటీసీ లలిత ఆంజనేయులు, సర్పంచ్ పూజ కృష్ణ ముదిరాజ్ టీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
సారథిన్యూస్, నారాయణఖేడ్: మెదక్ జిల్లా కంగ్టి మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం మోస్తరు వర్షం కురిసింది. గత వారం రోజులు క్రితం రైతులు తమ పొలాల్లో విత్తనాలు వేశారు. వర్షం రాకపోవడంతో నిరాశలో ఉన్న రైతులకు ప్రస్తుతం కురిసిన వర్షంతో ఆశలు చిగురించాయి. పత్తి, కందులు, పేసర్లు, మినుములు, సొయా వంటి పంటలకు ఈ వర్షం ప్రాణం పోసిందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు.