సారథిన్యూస్, రామడుగు: కరీంనగర్ జల్లా రామడుగు మండలంలో ని వివిధ గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు మొక్కుబడిగా సాగుతున్నాయని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కట్ట రవీందర్ ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలపై వెంటనే దృష్టి సారించాలని కోరారు. కరోనా నేపథ్యంలో ప్రజలను అధికారులు అప్రమత్తం చేయాలని సూచించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జిట్టవేని అంజిబాబు, భరత్ చారి, కనకం శ్రీనివాస్, గజ్జెల అశోక్, మునిగంట శ్రీనివాస చారి తదితరులు ఉన్నారు.
సారథిన్యూస్, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని వెదిర గ్రామంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో రామడుగు మండల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వెదిర గ్రామంలో మంగళవారం శానిటైజేషన్ నిర్వహించారు. గ్రామంలోని విధులను శుభ్రపరిచారు. ప్రజలంతా సామాజికదూరం పాటించాలని, మాస్కులు ధరించాలని, అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని అధికారులు సూచించారు.
సారథిన్యూస్, రామడుగు: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరోవిడత హరితహారంలో భాగంగా కరీంనగర్ జిల్లా రామడుగు మండల వ్యవసాయశాఖ మంగళవారం ‘బండ్ బ్లాక్ ప్లాంటేషన్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా వెదిర గ్రామశివారులో రైతుల పొలాల గట్ల వెంబడి 200 టేకు మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీపీ కల్గెటి కవిత, చొప్పదండి డివిజన్ ఏడీఏ రామారావు, మండల వ్యవసాయ అధికారి యాస్మిన్, ఎంపీడీవో సతీశ్‌రావు, ఏపీవో చంద్రశేఖర్, ఏఈవో సంపత్, వీడీసీ చైర్మన్ శేఖర్, […]
సారథి న్యూస్, రామడుగు: కరోనాతోపాటూ అన్ని రకాల రోగాలు దరిచేరకుండా ఉండాలంటే వ్యాయమం ఎంతో అవసరమని సూచిస్తున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లా రామడుగుకు చెందిన యువకులు ఓ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతిరోజు ఓ గంట సేపు అందరూ వ్యాయామం చేసేలా ‘ఫిట్రామడుగు’ అనే కార్యక్రమం ప్రారంభించారు. ఇందులో చేరిన యువకులంతా ప్రతి రోజు స్థానిక ప్రభుత్వ పాఠశాల క్రీడా మైదానంలో వాకింగ్, రన్నింగ్, యోగా చేస్తున్నారు. అంతేకాక వీరు ఓ వాట్సప్గ్రూప్ను […]
సారథిన్యూస్, రామడుగు: ఎన్ని సార్లు ప్రయత్నించినా ఉద్యోగం రావటం లేదని మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండి గ్రామానికి చెందిన మడ్డి లచ్చయ్యకు ముగ్గురు కుమారులు, ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవటంతో, కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. చిన్న కుమారుడు పవన్‌కల్యాణ్ (23) ఇటీవల ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. ఉద్యోగం రాకపోవడంతో ఇంట్లోని దూలానికి ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని […]
సారథి న్యూస్, రామడుగు: కాంగ్రెస్రామడుగు మండలాధ్యక్షుడిగా బొమ్మరవేణి తిరుపతి ముదిరాజ్ ను నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు కవ్వంపెల్లి సత్యనారాయణ శనివారం తెలిపారు. ఈ మేరకు నియామక పత్రాన్ని అందజేశారు. ఆయన వెంట టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్, నియోజకవర్గ ఇన్చార్జ్మెడిపల్లి సత్యం ఉన్నారు.
సారథిన్యూస్, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని వివిధ గ్రామాల్లో పోలీసులు భారీగా గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నాలుగు రోజులుగా వివిధ గ్రామాల్లో సోదాలు చేపట్టారు. అక్రమంగా విక్రయిస్తున్న నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. 22, 600 విలువ గల గుట్కాప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. మోతే గ్రామానికి చెందిన తిరుపతి, పుదారి శ్రీనివాస్, లక్ష్మీపూర్‌కు చెందిన సురేశ్, గుండికి చెందిన చిట్ల మునీందర్లపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై అనూష వెల్లడించారు.
సారథి న్యూస్, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం షానగర్ వరద కాల్వపై మోతె కాల్వల నిర్మాణానికి భూమి పూజ చేసి ఏడాది గడిచినా ఇప్పటికి పనులు ప్రారంభించకపోవడంతో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ చార్జ్మేడిపల్లి సత్యం, ఆ పార్టీ నాయకులు శుక్రవారం వినూత్నరీతిలో చెవిలో పువ్వులతో నిరసన వ్యక్తం చేశారు. ఏడాది క్రితం ఎంతో అట్టహాసంగా జిల్లా మంత్రి ఈటల రాజేందర్ శంకుస్థాపన చేసి ఇప్పటివరకు ఒక్క రూపాయి పని కూడా మొదలు పెట్టలేదని ఎద్దేవా చేశారు. […]