సారథి న్యూస్, రామగుండం: ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరుగా కరోనా బారినపడుతున్నారు. తాజాగా, పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కు పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రి చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు ఆయన సోమవారం హైదరాబాద్ నుంచి ఒక ప్రత్యేక వీడియోను రామగుండం ప్రజల కోసం విడుదల చేశారు. కరోనా మహమ్మారి పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే కోరుకంటి కోరారు.
రాఖీ పౌర్ణమిపై కరోనా ప్రభావం వ్యాపారులకు ఈ ఏడాది తీవ్రనష్టం సారథి న్యూస్, రామగుండం: కరోనా మహమ్మారి రాఖీల దందాపై కూడా తీవ్రప్రభావం చూపుతోంది. రాఖీ పర్వదినానికి వారం రోజుల ముందు నుంచే ఉమ్మడి కరీంనగర్ జిల్లా గోదావరిఖని మార్కెట్ లో సందడి ఉండేది. గతేడాది వరకు జోరుగా రాఖీల విక్రయాలు జరిగేవి. కానీ ఈసారి దుకాణాలన్నీ కళతప్పి వెలవెలబోతున్నాయి. కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో మార్కెట్లకు ఎవరూ రావడం లేదు. ఒకవేళ వచ్చినా రాఖీలను కొనేందుకు ధైర్యం […]
సారథి న్యూస్, రామగుండం: పారిశుద్ధ్యం విషయంలో రామగుండం మున్సిపాలిటీ సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని ఏఐటీయూసీ నగర అధ్యక్ష, కార్యదర్శులు శనిగల శ్రీనివాస్, శనిగరపు చంద్రశేఖర్ ఆరోపించారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా రామగుండంలో విలేకరులతో మాట్లాడుతూ.. కరోనాతోపాటు ఇతర వ్యాధుల ముంపు పొంచిఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఎంతో నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం టెస్టులు చేయకపోవడంతో పేదలు కరోనా భయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తీరు మారకపోతే ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని చేపడతామని పేర్కొన్నారు.
సారథి న్యూస్, రామగుండం: ఏఐటీయూసీ నాయకుడు గట్టయ్యపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సింగరేణి రామగుండం జీఎంపై చర్యలు తీసుకోవాలని కార్మికసంఘాల నాయకులు మిట్టపల్లి వెంకటస్వామి తదితరులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కొందరు అధికారుల తీరుతో కార్మికులతో యాజమాన్యానికి సత్సంబంధాలు లేకుండా పోతాయని.. అంతిమంగా సింగరేణి యాజమాన్యానికి ఎంతో నష్టం చేకూరుతుందని చెప్పారు. కార్మికులతో స్నేహపూర్వకమైన వాతావరణంలో చర్చలు జరపాలని వారు పేర్కొన్నారు.
సారథి న్యూస్, రామగుండం: గ్రామాల్లో ఎవరైనా బెల్ట్‌షాపులు ఏర్పాటుచేసి అక్రమంగా మద్యం విక్రయిస్తే కఠినచర్యలు తీసుకుంటామని రామగుండం సీపీ సత్యనారాయణ హెచ్చరించారు. గురువారం పాలకుర్తి మండలం తక్కళ్లపల్లి గ్రామంలో పోలీసులు, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది తనిఖీలు చేపట్టి ఓ ఇంట్లో నిలువ ఉంచిన రూ.31,405 విలువైన మద్యాన్ని సీజ్‌చేశారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో రెండు రోజులుగా బెల్టుషాపులపై దాడులు కొనసాగుతున్నాయి. తనిఖీల్లో టాస్క్ ఫోర్స్ సీఐ రాజ్ కుమార్, ఎస్సై షేక్ మస్తాన్, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది శేఖర్, మహేందర్, […]
సారథి న్యూస్, రామగుండం: మూడు నెలల క్రితం ఆస్పత్రిలో వదిలేసిన పసిపాప ప్రాణాలను నిలిపి, అరోగ్యవంతురాలుగా తీర్చిదిద్ది మానవత్వం చాటిన ప్రభుత్వాసుపత్రి సిబ్బంది సేవలు అభినందనీయమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. శుక్రవారం గోదావరిఖని ప్రభుత్వాసుపత్రిలో ఎమ్మెల్యే ఆ చిన్నారిని ఐసీడీఎస్, శిశు సంక్షేమశాఖ అధికారులకు అప్పగించారు. రాష్ట్రంలో తల్లీబిడ్డల సంరక్షణే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. ఆయన వెంట నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, […]
సారథిన్యూస్, రామగుండం: విరసం నేత, విప్లవకవి, రచయిత వరవరరావును వెంటనే విడుదల చేయాలని పలువురు ప్రజాసంఘాలు, దళిత సంఘాల నేతలు డిమాండ్ చేశారు. వృద్ధుడైన వరవరరావును ప్రధాని హత్యకు కుట్రపన్నాడంటూ అరెస్ట్ చేయడం సరికాదని పేర్కొన్నారు. సోమవారం పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఆల్ఇండియా అంబేద్కర్ యువనజనం సంఘం నేతలు వివిధ సంఘాలతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొంకూరు మధు, వివిధ పార్టీలు, ప్రజాసంఘాల నేతలు మల్లారెడ్డి, […]
సారథిన్యూస్, గోదావరిఖని/రామగుండం: గోదావరిఖని నియోజకవర్గానికి గీట్ల జనార్దన్‌రెడ్డి సేవలు మరువలేనివని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. సాహితీవేత్తగా, రాజకీయనాయకుడిగా గీట్ల ఈ ప్రాంతానికి ఎన్నోసేవలు చేశారని కొనియాడారు. శుక్రవారం ఆయన 82వ జయంతి సందర్భంగా గోదావరిఖనిలోని గీట్ల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆయన సేవలకు గుర్తుగా మంత్రి కొప్పుల ఈశ్వర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయించారని తెలిపారు. అంతకుముందు ఎమ్మెల్యే రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 10, 48వ డివిజన్లలో హరితహారంలో […]