కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు సామాజిక సారథి, హైదరాబాద్ : ఖమ్మం జిల్లా పాల్వంచలో జరిగిన రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటన నిర్భయ కేసు కన్నా దారుణమని మాజీ ఎంపీ వీ హనుమంతరావు అన్నారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ మీ చుట్టాల్లో ఎవరైనా చనిపోతే పోతావు.. ఎంతోమంది రైతులు చనిపోతున్నారు.. కనీసం పాల్వంచ కైనా పోవాలి కదా అన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యపై ఇంత వరకూ మాట్లాడక పోవడం విచారకరం […]
కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ నయీంను 2016 ఆగస్టు 8న పోలీసులు ఎన్కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. అయితే నయీం ఎన్కౌంటర్ తర్వాత అతడి అక్రమాలు ఒక్కొక్కటీ బయటికొచ్చాయి. నయీం పోలీసులను అడ్డుపెట్టుకొని అనేక అక్రమాలు చేశాడని వార్తలు వినిపించాయి. అప్పట్లో నయీం అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం సిట్‌తో దర్యాప్తు చేయించింది. అయితే దర్యాప్తు చేసిన సిట్.. నయిం అక్రమాల్లో పోలీసుల పాత్ర ఏమీలేదని తేల్చిచెప్పింది. నయీం భూ అక్రమాలకు సహకరించినట్టు పలువురు ప్రజాప్రతినిధులతో పాటు పోలీసు అధికారులపై ఆరోపణలు […]