Breaking News

జర్నలిస్టులు

ర్నలిస్టులకు హ్యాండ్ కర్చీఫ్ లు పంపిణీ

జర్నలిస్టులకు హ్యాండ్ కర్చీఫ్ లు పంపిణీ

సారథి, రామగుండం ప్రతినిధి: కరోనా కష్టకాలంలో వార్తలను సేకరించి ప్రజలకు చేరవేస్తున్న గోదావరిఖని ప్రెస్, మీడియా రిపోర్టర్లకు ఏసీపీ ఉమెందర్ చేతి రుమాలు అందజేశారు. జర్నలిస్టులు వడదెబ్బ బారినపడకుండా చూసుకోవడం తమ బాధ్యత అన్నారు. కరోనా సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో గోదావరిఖని వన్ టౌన్ సీఐలు రమేశ్ బాబు, రాజ్ కుమార్ గౌడ్, ఎస్సైలు ప్రవీణ్, ఉమాసాగర్, రమేష్, సిబ్బంది పాల్గొన్నారు.

Read More
ఫ్రంట్‌లైన్‌ వర్కర్లుగా జర్నలిస్టులు

ఫ్రంట్‌లైన్‌ వర్కర్లుగా జర్నలిస్టులు

కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ వెల్లడి న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నియంత్ర నిబంధనలు పాటించాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ కోరారు. జర్నలిస్టులను కూడా ఫ్రంట్‌లైన్‌ వర్కర్లుగా గుర్తిస్తున్నామని స్పష్టంచేశారు. ఆయా రాష్ట్రాలు అప్రమత్తత పాటిస్తూ నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు. 12 రాష్ట్రాల్లో లక్షకు పైగా క్రీయాశీలక కేసులు ఉన్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌, అసోం, బీహార్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, తమిళనాడు, […]

Read More
జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలి

జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలి

సారథి, వేములవాడ: జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలని వేములవాడ టీయూడబ్ల్యూజేహెచ్(143) ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు మహమ్మద్ రఫీ ప్రభుత్వాన్ని కోరారు. జర్నలిస్టులందరికీ కరోనా టెస్టులు చేసి మెరుగైన వైద్యం అందించాలన్నారు కోరారు. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల అడిషనల్ కలెక్టర్ అంజయ్యకు వినతిపత్రం అందజేశారు. వేములవాడతోపాటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు కరోనా వ్యాక్సిన్​ వేయాలని విజ్ఞప్తిచేశారు. జర్నలిస్టులకు అక్రిడిటేషన్​కార్డులు ఇవ్వాలని డిమాండ్​చేశారు. ఆయన వెంట ప్రెస్​క్లబ్​ప్రధాన కార్యదర్శి భాస్కర్​రెడ్డి, ఇతర జర్నలిస్టులు […]

Read More
జర్నలిస్టులకు రూ.50లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి

జర్నలిస్టులకు రూ.50లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి

ఫ్రంట్​ లైన్​ వారియర్స్​ గా గుర్తించాలి జాట్​ రాష్ట్ర అధ్యక్షుడు పగుడాకుల బాలస్వామి నేత సారథి, వికారాబాద్​: విధి నిర్వహణలో భాగంగా కోవిడ్ బారినపడి ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టులకు రూ.50 లక్షల బీమా తరహా ఎక్స్​గ్రేషియా చెల్లించాలని జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ(జాట్​) రాష్ట్ర అధ్యక్షుడు పగుడాకుల బాలస్వామి నేత డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఇల్లు వదిలి బయటికి రానీ విపత్కర పరిస్థితుల్లో కూడా కుటుంబాన్ని పక్కనపెట్టి విధి నిర్వహిస్తున్న జర్నలిస్టులను కొవిడ్ మహమ్మారి కబళించడం దురదృష్టకరమని […]

Read More
తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్రే కీలకం

తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్రే కీలకం

సారథి న్యూస్, రామగుండం: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో జర్నలిస్టుల పాత్రే కీలకమని, పాత్రికేయుల సంక్షేమానికి సీఎం కేసీఆర్​ కృషిచేస్తున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. శనివారం ఆయన రూ.20లక్షల వ్యయంతో నిర్మించనున్న గోదావరిఖని ప్రెస్​క్లబ్​ భవన నిర్మాణానికి రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే గోదావరిఖని ప్రెస్ క్లబ్ చైతన్యానికి మారుపేరుగా నిలిచిందని, తెలంగాణ ఉద్యమంలో ఇక్కడి జర్నలిస్టు సాగించిన పోరాటం మరువలేనిదన్నారు. మొట్టమొదట […]

Read More
జర్నలిస్టులపై కేసులొద్దు

జర్నలిస్టులపై కేసులొద్దు

న్యూఢిల్లీ: ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(పీసీఐ) లేదా ఇతర జ్యుడీషియరీ అథారిటీ అనుమతి లేకుండా జర్నలిస్టులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేయొద్దని, ఈ మేరకు ప్రభుత్వానికి తగిన ఆదేశాలివ్వాలని కోరుతూ అడ్వొకేట్‌ ఘనశ్యామ్‌ ఉపాధ్యాయ్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సంఘ విద్రోహ, జాతి వ్యతిరేక శక్తుల బండారం బయటపెడుతున్న న్యూస్‌ చానళ్లను కొందరు లక్ష్యంగా చేసుకుంటున్నారని, జర్నలిస్టులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ అర్నాబ్‌ గోస్వామి, జీ […]

Read More

టీ సర్కార్​కు హైకోర్టు కీలక ఆదేశాలు

సారథిన్యూస్​, హైదరాబాద్​: జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనాతో జర్నలిస్టులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. వారిని రాష్ట్రప్రభుత్వం పట్టించుకోవడం లేదని రంగారెడ్డి జిల్లాకు చెందిన తెలంగాణ వర్కింగ్​ జర్నలిస్ట్​ ఫెడరేషన్​ నాయకుడు సత్యనారాయణ హైకోర్టులో రిట్​ పిటిషన్​​ దాఖలు చేశారు. నాలుగు నెలలుగా జర్నలిస్టులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఆర్టికల్ 14 ప్రకారం జర్నలిస్టులను ఆదుకోవాలని పిటిషనర్​ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. స్పందించిన ధర్మాసనం.. పిటిషనర్​ విన్నవించిన […]

Read More
జర్నలిస్టుల అక్రిడిటేషన్ కాలపరిమితి పొడిగింపు

జర్నలిస్టుల అక్రిడిటేషన్ కాలపరిమితి పొడిగింపు

సారథి న్యూస్, విజయవాడ: ఆంధ్రప్రదేశ్​రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల కాలపరిమితి జూన్ 30 నాటికి ముగిసిందని, మరో మూడునెలల పాటు పెంచుతున్నట్లు సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి.విజయ్ కుమార్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జులై 1 నుంచి సెప్టెంబర్​ 30వ తేదీ వరకు కొత్త కార్డులను జారీచేయడం లేదా, కరోనా పరిస్థితి ఇలాగే ఉంటే మరోసారి కాలపరిమితిని పొడిగిస్తున్నట్లు తెలిపారు. జర్నలిస్టులు ఈ విషయాన్ని గమనించి సంబంధిత జిల్లా సమాచార పౌర […]

Read More