Breaking News

YSRCP

ఆయుష్మాన్ హాస్పిటల్ పునఃప్రారంభం

ఆయుష్మాన్ హాస్పిటల్ పునఃప్రారంభం

సారథి న్యూస్​, కర్నూలు: కర్నూలు జిల్లా పేద మధ్యతరగతి ప్రజల సౌకర్యార్థం శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పాచక్రపాణి రెడ్డి, కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి గాయత్రి హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో సోమవారం కోవిడ్​19 ఆయుష్మాన్ హాస్పిటల్​ను ప్రారంభించారు. కార్యక్రమంలో గాయత్రి హాస్పిటల్స్ ఎండీ ఎస్.జిలానీ, సోమిశెట్టి హరి, వైఎస్సార్​సీపీ నాయకులు రామయ్య, సురేందర్​రెడ్డి, రాజావిష్ణువర్ధన్​రెడ్డి, నాగరాజు యాదవ్, సీహెచ్ మద్దయ్య, కటారి సురేష్, ధనుంజయ ఆచారి పాల్గొన్నారు.

Read More
మాజీమంత్రి సాంబశివరాజు ఇకలేరు

మాజీమంత్రి సాంబశివరాజు ఇకలేరు

విజయనగరం: మాజీమంత్రి, వైఎస్సార్​సీపీ సీనియర్ నేత పెనుమత్స సాంబశివరాజు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్​ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగి రాజకీయ కురువృద్ధుడిగా గుర్తింపు పొందారు. మంత్రి బొత్సకు రాజకీయ గురువుగా గుర్తింపు పొందారు. అనంతరం మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో సాంబశివరాజు వైఎస్సార్​సీపీలో చేరారు. రాజకీయాల్లో మచ్చలేని నాయకుడు సాంబశివరాజు ఏపీ రాజకీయాల్లో మచ్చలేని నాయకుడిగా గుర్తింపు పొందారు. రెండుసార్లు మంత్రిగా, […]

Read More
ఏపీలో మహిళల కోసం ఎన్నో పథకాలు

ఏపీలో మహిళల కోసం ఎన్నో పథకాలు

సారథి న్యూస్, కర్నూలు: రక్షాబంధన్ ​సందర్భంగా సోమవారం మాజీ ఎమ్మెల్యే ఎస్​వీ మోహన్ రెడ్డికి వైఎస్సార్​సీపీ మహిళా నేతలు రాఖీలు కట్టి ఆయన మిఠాయిలు తినిపించారు. రక్షాబంధన్ సోదరిసోదరుల బంధాన్ని తెలియజేస్తుందన్నారు. సీఎం వైఎస్​జగన్​మోహన్​రెడ్డి మహిళలకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో భారతి, సుమలత, లలితమ్మ పాల్గొన్నారు.

Read More
కర్నూలులో మిన్నంటిన సంబరాలు

కర్నూలులో మిన్నంటిన సంబరాలు

సారథి న్యూస్​, కర్నూలు: కర్నూలు నగరంలోని జిల్లా పరిషత్ సమీపంలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద కర్నూలు ఎమ్మెల్యే హఫిజ్ ఖాన్ ఆధ్వర్యంలో ఆదివారం వైఎస్సార్​సీపీ విద్యార్థి విభాగం నాయకులు సంబరాలు జరుపుకున్నారు. సీఎం వైఎస్​ జగన్​ మోహన్​రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. న్యాయ రాజధాని ద్వారా విద్యాసంస్థలు, యూనివర్సిటీలు అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్​సీపీ విద్యార్థి విభాగం జిల్లా కార్యదర్శి కటిక గౌతమ్, భాను ప్రకాశ్​, ఖయూమ్, సాయికృష్ణారెడ్డి, కృష్ణకాంత్ రెడ్డి, అసిఫ్ […]

Read More
ఆ మాజీ అధికారి వ్యాఖ్యలతో తలనొప్పులు

ఆ మాజీ అధికారి వ్యాఖ్యలతో తలనొప్పులు

ఓ వైపు నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం. మరోవైపు పార్టీ గుర్తింపుపై కేంద్ర ఎన్నికల కమిషన్‌ నోటీసులు, ఇంకోపక్క రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ వ్యవహారంపై హైకోర్టు వ్యాఖ్యలు. వీటితోనే జగన్‌ సర్కారు సతమతమవుతుంటే.. ఇప్పుడు రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి, సీఎంవో మాజీ అధికారి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పీవీ రమేష్‌ వ్యాఖ్యలు కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టాయి. శుక్రవారం ఆయన ట్వీట్‌ చేసిన అంశాలు ఏపీలోని రాజకీయ, అధికారవర్గాల్లో పెద్ద దుమారాన్నే లేపాయి. […]

Read More
హే.. రఘురామా!

హే.. రఘురామా!

సారథి న్యూస్​, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్​లో అధికార పార్టీ వైఎస్సార్​సీపీకి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టుగా అయింది ఏపీలోని యువజన శ్రామిక రైతు పార్టీ పరిస్థితి. ఓ ఎంపీపై వేటు వేసేందుకు వేసిన ప్లాన్‌ బెడిసికొట్టి ఆ పార్టీ గుర్తింపే ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ఆ పార్టీ పెద్దలు సీన్‌ రివర్స్‌ అయిందేంటబ్టా! అని తలలు పట్టుకుంటున్నారు. కొంతకాలం నుంచి జగన్‌ పార్టీకి చెందిన నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు పార్టీ […]

Read More
రాజుల మ‌ధ్య రాజకీయ యుద్ధం

రాజుల మ‌ధ్య రాజకీయ యుద్ధం

సారథి న్యూస్​, హైదరాబాద్​: ఉత్తరాంధ్ర.. గోదావ‌రి తీరంలో మకుటం లేని మ‌హారాజులు. రాజ్యాలు పోయినా రాజ‌భోగాలు అలాగే ఉన్నాయి. రాజ‌కీయ పార్టీలు కూడా రాజుల వార‌సుల‌ను త‌మ రాజ‌కీయ ప్రాభ‌వానికి మెట్లుగా వాడుకుని వారికి సింహాస‌నం క‌ట్టబెడుతూ వ‌స్తున్నారు. ఇప్పుడు ఆ రాజుల మ‌ధ్య వార‌స‌త్వపోరు అనుకోండి.. అహం దెబ్బతినడం వ‌ల్ల కావ‌చ్చు.. ర‌చ్చ మొద‌లైంది. ఇది గ‌తంలో ఎన్నడూలేనంత‌గా అంత‌ర్గత యుద్ధంగా ప‌రిగ‌ణించ‌డమే ఇందుకు కార‌ణం.. సింహాచ‌ల చైర్మన్​ గిరీ అశోక‌గ‌జ‌ప‌తిరాజు నుంచి సంచ‌యిత‌కు చేర‌డం […]

Read More
సీఎంవో కోఆర్డినేటర్​కు సన్మానం

సీఎంవో కోఆర్డినేటర్​కు సన్మానం

సారథి న్యూస్, కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ గా నియమితులైన వైఎస్సార్​సీపీ ఆఫీసు ఇన్​చార్జ్​శ్రీకాంత్ రెడ్డిని కర్నూలు పార్లమెంటరీ అధ్యక్షుడు బీవై రామయ్య శుక్రవారం సన్మానించారు. కార్యక్రమంలో రాయలసీమ యూనివర్సిటీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డిపొగు, జిల్లా ప్రధాన కార్యదర్శి కటికె గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.

Read More