Breaking News

ప్రాణం తీసిన వివాహేతర బంధం

ప్రాణం తీసిన వివాహేతర బంధం
  • యువతిని చంపి పొంగిపోయిన యువకుడు
  • నాగర్​ కర్నూల్​ జిల్లాలో సంచలనం

సామాజికసారథి, బిజినేపల్లి: వివాహేతర సంబంధాలు పచ్చని సంసారంలో నిప్పులు పోస్తున్నాయి. పిల్లలు, ఫ్యామిలీ సంబంధాలను రోడ్డు పాలు చేస్తున్నాయి. ఈ అక్రమబంధానికి మరో వివాహిత బలైపోయింది. ఈ బంధంలో చిక్కుకున్న ఓ యువతి దారుణ హత్యకు గురైంది. సంచలనం రేకెత్తించిన ఈ ఘటన నాగర్​ కర్నూల్​ జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం గ్రామంలో వెలుగుచూసింది. పోలీసులు, గ్రామస్తుల కథనం మేరకు.. వట్టెం పరిధిలోని కల్వకుంటతండాకు చెందిన గిరిజన యువతి చిట్టెమ్మ(28) తన భర్తతో విడాకులు తీసుకుంది. అనంతరం బిజినేపల్లి గ్రామానికి చెందిన శివ అనే యువకుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. కాగా, చిట్టెమ్మను వట్టెం గ్రామంలోని పొలంలోకి రమ్మని శివ ఫోన్ చేయగా ఇద్దరూ కలిసి ఆదివారం రాత్రి అక్కడే గడిపారు. ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణ, పెనుగులాటలో చిట్టెమ్మ మృతిచెందింది. ఈ హఠాత్పారిణామంతో శివ భయంతో వణికిపోయి ఆమె శవాన్ని అక్కడే ఉన్న పత్తి చెత్తలో కప్పి స్థానిక బిజినేపల్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది.