నాబార్డ్ చైర్మన్ గోవిందరాజులు సారథి, నర్సాపూర్: ఆకలి ఉన్నంత కాలం వ్యవసాయం అవసరం ఉంటుందని నాబార్డు చైర్మన్ గోవిందరాజులు అన్నారు. గ్రామాల్లో వ్యవసాయం ఇప్పుడు ఫ్యాషన్ గా మారిందన్నారు. రూ.లక్షల కోట్లతో నాబార్డ్ సంస్థ వ్యవసాయరంగానికి చేయూతనిస్తుందన్నారు. విద్యార్థులు ఫీల్డ్ లో నేర్చుకున్న వ్యవసాయ సాంకేతికత దేశానికి ఉపయోగపడాలన్నారు. సోమవారం మెదక్జిల్లా నర్సాపూర్ మండలం తునికి గ్రామ శివారులోని విజ్ఞాన జ్యోతి పాలిటెక్నిక్ కాలేజీ 24వ స్నాతకోత్సవ సభ నిర్వహించారు. డాక్టర్ రామానాయుడు విజ్ఞానజ్యోతి, బెయర్ రూరల్ […]
సారథి, చొప్పదండి: చొప్పదండి ఆటో యూనియన్ అధ్యక్షుడిగా కొలిమికుంట గ్రామానికి చెందిన చొక్కల్ల లక్ష్మణ్ ఏకగ్రవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా చీకట్ల శంకర్, ప్రధాన కార్యదర్శి ఎండీ జహంగీర్, క్యాషియర్ గా లంక రవిని ఎన్నుకున్నారు. ఈ కార్యవర్గాన్ని సోమవారం చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ తన క్యాంపు ఆఫీసులో సన్మానించారు. ఆటోడ్రైవర్లు, ఓనర్ల సమస్యలను పరిష్కారిస్తామన్నారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ అరెళ్లి చంద్రశేఖర్ గౌడ్, యూనియన్ అధ్యక్షుడు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, ముఖ్య సలహాదారులుగా పాలురి ప్రసాద్, […]
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్ గౌడ్ సారథి, బిజినేపల్లి: వట్టెం ప్రాజెక్టు నిర్మాణ పనుల నాణ్యతపై సమగ్ర విచారణ జరిపి, ఆలస్యం, నిర్లక్ష్యానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం పాలమూరు –రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన వట్టెం రిజర్వాయర్ 11వ ప్యాకేజీ పనులను పరిశీలించారు. రిజర్వాయర్ వద్ద నాణ్యత లేని పనులు […]
సారథి, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా జవహర్ నవోదయ విద్యాలయం తెలుగు అధ్యాపకుడు, ప్రముఖకవి శేషం సుప్రసన్నాచార్యులు రచించిన ‘హిమాలయాలకు చెమట పడుతుంది’ కవితా సంకలనం ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం కరీంనగర్ అడినషనల్ కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్ లాల్ తన క్యాంపు ఆఫీసులో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రసన్న కవిత్వంలో అనేక సామాజికాంశాలు ఉండటమే కాకుండా వారు నేర్చుకున్న సంస్కృతభాష ప్రభావం, పురాణేతిహాసాల ప్రయోగాలు విస్తృతంగా ఉన్నాయని, పదప్రయోగం అనిర్వచనీయమని కొనియాడారు. పుస్తక పరిచయకర్త, […]
సారథి, చొప్పదండి: సీఎం కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే వెంటనే నిరుద్యోగ భృతి ప్రకటించి నిరుద్యోగులను ఆదుకోవాలని యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు ముత్యం శంకర్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు జి.సంపత్, కల్లేపల్లి ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో చొప్పదండి మండల కేంద్రంలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఉద్యోగ క్యాలెండర్ను విడుదల చేయకపోతే […]
సారథి, చొప్పదండి: ప్రైవేట్ టీచర్లను ఆదుకోవాలని అసోసియేషన్అధ్యక్షుడు మాచర్ల మహేశ్ప్రభుత్వాన్ని డిమాండ్చేశారు. సోమవారం కరీంనగర్జిల్లా చొప్పదండి ఆకాశ్ పబ్లిక్ స్కూలులో ఆయన విలేకరులతో మాట్లాడారు. కరోనా కారణంగా స్కూళ్లు మూతపడి 18 నెలలు అవుతోందని, ప్రైవేట్ఉపాధ్యాయులు మానసికంగా కృంగిపోయారని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన రూ.2వేల ఆర్థిక సాయం, 25 కేజీల బియ్యం కొంత స్వాంతన కలిగించిందన్నారు. కానీ ప్రభుత్వం మూడునెలలకే ఆ సహాయాన్ని నిలిపివేసిందన్నారు. ప్రీ ప్రైమరీ టీచర్లు, ప్రైమరీ టీచర్లకు జీవనోపాధి లేక వారి బతుకుదెరువు […]
సారథి, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల పంచాయతీకి సోమవారం బీజేపీ నాయకులు భారతమాత చిత్రపటాన్ని బహూకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేందుకే ఈ చిత్రపటాలను బహూకరిస్తున్నట్లు తెలిపారు. వెలిచాల సర్పంచ్ వీర్ల సరోజ, మాజీ సర్పంచ్ వీర్ల రవీందర్ రావు, బీజేపీ నాయకులు కట్ట రవీందర్, ముడుగంటి శ్రీనివాసాచారి పాల్గొన్నారు.