Breaking News

TRUMP

ట్రంప్​ పరిస్థితి విషమం..

ట్రంప్​ ఆరోగ్య పరిస్థితి ఎంతో విషమంగా ఉన్నట్టు సమాచారం. కరోనాతో ట్రంప్​ ఇటీవలే ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. మరో 48 గంటలు దాటితే గానీ ఏ విషయం చెప్పలేమని వైద్యులు చెబుతున్నారు. అయితే ట్రంప్​ మాత్రం ప్రస్తుతం మాట్లాడుతున్నారు. ‘ఇప్పటికైతే నేను ఆరోగ్యంగానే ఉన్నాను. కానీ రానున్న కొన్ని గంటలే కీలకం’ అంటూ ఆస్పత్రి నుంచే ఓ వీడియోను పోస్ట్​ చేశారు. వాషింగ్టన్ డీసీలోని వాల్టర్​ రీడ్​ నేషనల్​ మిలటరీ మెడికల్​ సెంటర్​లో ఆయన చికిత్స […]

Read More

కరోనా పుట్టింది వూహాన్​లోనే.. ఇదే సాక్ష్యం!

కొంతకాలంగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వైరస్​ పుట్టిన దేశమైన చైనా సేఫ్​జోన్​లో ఉండగా.. మిగిలిన దేశాలన్నీ ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరయ్యాయి. చైనాలోని వూహాన్ ల్యాబ్​లోనే ఈ వైరస్​ను పట్టించారని తొలినుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే చైనాకు చెందిన ఓ వైరాలజిస్ట్​ చేస్తున్న ఆరోపణలు ప్రస్తుతం ఈ వాదనలకు బలం చేకూరుస్తున్నాయి. కరోనా వైరస్​ జంతువుల మాంసం నుంచి రాలేదు. ఇది మనుషులే తయారు చేశారు. దీనిపై నావద్ద ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు […]

Read More

టీకా ఇప్పట్లో రాదు.. ట్రంప్​వి అబద్ధాలు

వాషింగ్టన్​: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​పై.. కమలా హారిస్​ నిప్పులు చెరిగారు. డెమొక్రాటిక్​ తరఫున కమల ఉపాధ్యక్ష పదవికి పోటీచేస్తున్న విషయం తెలిసిందే. వ్యాక్సిన్​ విషయంలో ట్రంప్​ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఒక వేళ ఆయన చెప్పిన తేదీకి వ్యాక్సిన్​ వచ్చినా.. దాని సేఫ్టీ విషయాన్ని నమ్మలేమన్నారు. మరోవైపు కరోనా కట్టడిలో ట్రంప్​ ఘోరంగా ఫెయిల్​ అయ్యారని డెమోక్రాట్లు విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కమలా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నవంబర్​ 1నాటికి వ్యాక్సిన్​ […]

Read More

అధ్యక్ష పదవికి ట్రంప్​ నామినేషన్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికి డొనాల్డ్​ ట్రంప్​ రెండోసారి అధికారికంగా నామినేషన్​ స్వీకరించారు. రిపబ్లికన్ పార్టీ తరపున వైట్​హౌస్​ సౌత్​లాన్​ నుంచి ఆయన అధ్యక్ష పదవికి నామినేట్​ అయ్యారు. తాను సగర్వంగా ఈ నామినేషన్​ను స్వీకరిస్తున్నట్టు ట్రంప్​ ప్రకటించారు. అనంతరం ట్రంప్​ మాట్లాడుతూ.. గత నాలుగేండ్లలో చేసిన పురోగతికి తాను గర్వపడుతున్నానని చెప్పారు. రెండోసారి తనను గెలిపించేందుకు అమెరికా ప్రజలు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. డెమోక్రాట్​ అభ్యర్థి జో బిడెన్​​కు అధికారం కట్టబెడితే ఆమెరికాను నాశనం చేస్తాడని […]

Read More
యూస్​ ఉపాధ్యక్ష రేసులో ఇండియన్​ వుమెన్​

యూఎస్​ ఉపాధ్యక్ష రేసులో కమలాహారిస్​

వాషింగ్టన్​: భారతసంతతికి చెందిన ఓ మహిళ అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. ఏకంగా అమెరికా ఉపాధ్యక్ష పదవికే ఆమె పోటీపడనున్నారు. ప్రస్తుతం కాలిఫోర్నియా సెనెటర్​గా ఉన్న కమలా హారీస్​ను డెమొక్రాట్ల తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీచేసేందుకు ఎంపిక చేశారు. ఈ మేరకు మంగళవారం డెమొక్రాటిక్​ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్​ ఓ ప్రకటన విడుదల చేశారు. ఉపాధ్యక్ష పదవి కోసం నెలరోజుల పాటు కసరత్తు చేసి.. చివరకు సరైన అభ్యర్థిని ఎంపిక చేశామని ఆయన చెప్పారు. కమలా […]

Read More
నవంబర్​లో వ్యాక్సిన్​

నవంబర్​లో కరోనా వాక్సిన్​

వాషింగ్టన్​: నవంబర్ 3 నాటికి కరోనాకు వాక్సిన్​ అందుబాటులోకి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా మహమ్మారి అంతానికి రోజులు దగ్గర పడుతున్నాయని పేర్కొన్నారు. కరోనా వ్యాక్సిన్​ను అమెరికానే తయారు చేస్తుందని ఆయన చెప్పారు. ఓ రేడియో కార్యక్రమంలో ట్రంప్​ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే పలు అమెరికా సంస్థలు వ్యాక్సిన్​ తయారీలో సత్ఫలితాలు సాధిస్తున్నాయని చెప్పారు. ఈ ఏడాది నవంబర్ 3నే అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో […]

Read More
ట్రంపా.. అయితే మాకేంటి

అమెరికా అధ్యక్షుడా.. అయితే మాకేంటి

వాషింగ్టన్​: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ న​కు ఫేస్ బుక్​, ట్విట్టర్​ షాకిచ్చాయి. తప్పుడు సమాచారాన్ని పోస్టు చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పాయి. ఏకంగా అమెరికా అధ్యక్షుడు పోస్టు చేసిన ఓ వీడియోను డిలిట్​ చేశాయి ఈ సంస్థలు. ‘చిన్నపిల్లల్లో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వారికి కరోనా సోకదు’ అని ట్రంప్ ఇటీవల ఫేస్​బుక్​, ట్విట్టర్​లో​ ఓ వీడియోను పోస్ట్​ చేశాడు. దీనిపై ఫేస్​బుక్​, ట్విట్టర్​ తీవ్రంగా స్పందించాయి. ట్రంప్​ వీడియోలో తప్పడు […]

Read More
టిక్​టాక్​పై నిషేధం

అమెరికాలోనూ టిక్​టాక్​పై నిషేధం

వాషింగ్టన్​: అమెరికాలోనూ త్వరలో టిక్​టాక్​పై నిషేధం విధించనున్నారు. ఈ విషయంపై ఇప్పటికే పలువురు వైట్​హౌస్​ ఉన్నతాధికారులు క్లారిటీ ఇచ్చారు. కాగా తాజాగా ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ తమ దేశంలో టిక్​టాక్​పై నిషేధం విధించాలని యోచిస్తున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు త్వరలోనే తాను ఎగ్జిక్యూటివ్​ ఆర్డర్​పై సంతకం చేయబోతున్నట్టు ప్రకటించారు. టిక్​టాక్​, మైక్రోసాఫ్ట్​ ఒప్పందానికి తాను వ్యతిరేకమని ఆయన ప్రకటించారు.

Read More