Breaking News

TODAY

నేడు ‘బంగార్రాజు’ సాంగ్‌ రిలీజ్‌

నేడు ‘బంగార్రాజు’ సాంగ్‌ రిలీజ్‌

‘సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కలం ఆగిపోయింది. పాట హృదయం చెదిరిపోయింది’..అంటూ టాలీవుడ్‌ హీరో నాగార్జున ట్వీట్‌ చేశారు. ప్రముఖ సాహిత్య రచయిత ’సిరివెన్నెల’ సీతారామశాస్త్రి మంగళవారం సాయంత్రం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ సంఘటన చిత్రపరిశ్రమకు తీరని విషాదాన్ని కలిగించింది. ఎంతోమంది గుండెలు బద్ధలయ్యేలా చేసింది. సీతారామశాస్త్రి మరణవార్త తెలిసిన సినీ ప్రముఖులంతా కన్నీటి నివాళులర్పించారు. ఈ క్రమంలో నాగార్జున కూడా ‘సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కలం ఆగిపోయింది. పాట హృదయం చెదిరిపోయింది’..అని ట్వీట్‌ చేశారు. ఇదే […]

Read More

ఐలమ్మ ఆదర్శ మహిళ

సారథిన్యూస్, రామాయంపేట / చేవెళ్ల: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ ఆదర్శమహిళ అని పలువురు వక్తలు కొనియాడారు. ఆమె పోరాట పటిమను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఐలమ్మ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని పలుచోట్ల ఆమెకు నివాళి అర్పించారు. మెదక్ జిల్లా రామాయంపేటలో రజక సంఘం అధ్యక్షులు సంగుస్వామి ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నిర్వహించారు. మరోవైపు చేవెళ్ల మండల కేంద్రంలో రజకసంఘం, కాంగ్రెస్​ పార్టీ ఆధ్వర్యంలో ఐలమ్మ […]

Read More

అపార్ట్​మెంట్ కూలి​.. 8 మంది మృతి

మూడంతస్థుల ఆపార్ట్​మెంట్​ కుప్పకూలి అందులో ఉన్న 8 మంది మృతిచెందగా.. పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని భివాండిలో అదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భివాండిలో 1984లో ఓ భవనాన్ని నిర్మించారు. ఇక్కడ దాదాపు 21 కుటుంబాలు నివసిస్తున్నాయి. అయితే ఈ భవనం శిథిలావస్థకు చేరుకుందని, వెంటనే అక్కడ నివాసం ఉన్నవారంతా భవంతిని ఖాళీచేయాలని మున్సిపల్​ సిబ్బంది ఇప్పటికే నోటీసులు కూడా జారీచేశారు. అయినప్పటికే ఈ భవంతిని ఎవరూ ఖాళీ […]

Read More

నిరాడంబర నేత దుర్గాప్రసాద్​

సారథి న్యూస్​, అమరావతి: అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయిన దుర్గాప్రసాద్​కు పేదల నేతగా ప్రజల్లో పేరుంది. నిత్యం ప్రజలతో కలిసిమెలిసి ఉంటే దుర్గాప్రసాద్​ నిరాడంబరంగా మెలిగేవారు. తన అనుచరులను నిత్యం పేరుపెట్టి పిలుస్తూ పలకరించేవారు. ఏ కష్టమొచ్చినా వెంబడే స్పందించారు. అలాంటి నేత తమ మధ్య లేకపోవడంతో కార్యకర్తలు నిర్ఘాంతపోయారు. ఇదీ రాజకీయ చరిత్ర..టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్​ పిలుపుతో 26 ఏళ్ల వయస్సులోనే దుర్గాప్రసాద్​ రాజకీయాల్లోకి వచ్చారు. అంతకు ముందు ఆయనకు నెల్లూరు మంచి లాయర్​గా పేరు ఉండేది. […]

Read More
దర్శకుడు తేజకు కరోనా

దర్శకుడు తేజకు కరోనా

తెలుగు సినీ దర్శకుడు తేజకు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయింది. ఇటీవల ఆయన కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. దీంతో కరోనా ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం ఆయన ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవల తనను కలిసిన వారంతా వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని.. క్వారంటైన్​లో ఉండాలని ఆయన సూచించారు. తేజ నెల క్రితం కరోనాపట్ల జాగ్రత్తగా ఉంటాలంటూ ఓ వీడియోను విడుదల చేశాడు. భారతీయుల అటిట్యూడ్​ వల్ల కరోనా కేసుల […]

Read More
తమిళనాడు గవర్నర్​కు కరోనా

తమిళనాడు గవర్నర్‌కు కరోనా

చెన్నై: తమిళనాడులో కరోనా వైరస్‌ విలయ తాండవం చేస్తున్నది. తాజాగా ఆ రాష్ట్ర గవర్నర్‌ భన్వరిలాల్‌ పురోహిత్‌కు కరోనా సోకింది. దీంతో ఆయన చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం గవర్నర్‌ భన్వరిలాల్‌ ఆరోగ్యం నిలకడగా ఉన్నదని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఇటీవల గవర్నర్​ను కలిసిన వారంతా హోం క్వారంటైన్​కు వెళ్లారు.

Read More
ఒకే రోజు 50 వేల కేసులు

ఒకేరోజు 50వేల కేసులు

ఢిల్లీ : మనదేశంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. గత 24 గంటల్లోనే 49,931 కేసులు నమోదయ్యాయి. కేవలం రెండు రోజుల్లోనే 13లక్షల నుంచి కేసుల సంఖ్య 14 లక్షలకు చేరింది. కాగా, దేశంలో కరోనా వైరస్ మరణాల సంఖ్య 32,771 కు పెరిగింది. ఇప్పటివరకు 9,17,567 మందికి రోనా నయం కాగా, ప్రస్తుతం 4,85,114 మంది వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు.

Read More
మధ్యప్రదేవ్​ సీఎంకు కరోనా

మధ్యప్రదేశ్​ సీఎంకు కరోనా

భోపాల్​: మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి శివరాజ్​సింగ్​(61) చౌహాన్​కు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. కాగా ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. ‘ నాకు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. దయచేసి ఇటీవల నన్ను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోండి. నేను ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నాను. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దు. డాక్టర్ల సూచన మేరకు మందులు వాడుతూ ఐసోలేషన్​లో ఉన్నాను. ప్రజలంతా జాగ్రత్తగా ఉండండి’ అంటూ ఆయన శనివారం ఓ ప్రకటన విడుదల […]

Read More