Breaking News

TESTS

కరోనా కొత్తకేసులు

మొత్తం కేసులు @ 24 లక్షలు

న్యూఢిల్లీ: మనదేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చుతున్నది. ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 24,61,190 కు చేరుకున్నది. గత 24 గంటల్లోనే 64,553 కొత్తకేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపిన లెక్కల ప్రకారం.. ఇప్పటివరకు 48,040 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. 17,51,555 మంది కరోనానుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 6,61,595 మంది వివిధ దవాఖానల్లో చికిత్సపొందుతున్నారు.

Read More

చిన్నశంకరంపేటలో రెండు కేసులు

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: మెదక్​ జిల్లా చిన్నశంకరంపేట మండలం చందాపూర్ గ్రామంలో బుధవారం రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు మెడికల్ ఆఫీసర్ డాక్టర్​ శ్రావణి తెలిపారు. మొత్తం 11 మందికి టెస్టులు నిర్వహించగా వారిలో ఇద్దరికి పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే మాస్కులు ధరించి బయటకు రావాలని సూచించారు. కరోనా లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంప్రదించి టెస్టులు చేసుకోవాలన్నారు.

Read More
సింగరేణిలో కరోనా కట్టడికి చర్యలు

కరోనా కట్టడికి చర్యలు

సారథి న్యూస్​, రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియా ఆస్పత్రిని బుధవారం సింగరేణి జీఎం నారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. రామగుండం ఏరియా​-1 లోని కొందరు ఉద్యోగులకు కరోనా ప్రబలింది. వారంతా రామగుండం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సింగరేణిలోని ఉద్యోగులు, వారికుటుంబసభ్యులు విధిగా పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. రామగుండం ఏరియా ఆస్పత్రిలో ప్రతి రోజు 200 మందికి కరోనా టెస్టులు నిర్వహించి అదేరోజు ఫలితాలు వెల్లడిస్తారని […]

Read More

67 టెస్టులు.. 21 పాజిటివ్​

సారథిన్యూస్​, అలంపూర్​: జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్​ ప్రభుత్వా ఆసుపత్రిలో మంగళవారం 67 మందికి కోవిడ్​ పరీక్షలు నిర్వహించగా.. 21 మందికి పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. అలంపూర్​ పట్టణంలో 14 మందికి, శాంతినగర్​లో 1, కాశాపూర్​లో 1, పుల్లూర్​లో 2, బుక్కపూర్​లో 1, పెద్దపోతులపాడులో 1, బైరపూర్​లో 1 కేసులు నమోదైనట్టు వైద్యశాఖ అధికారులు తెలిపారు.మనోపాడ్ మండలంలో..36 మందికి టెస్టులు చేయగా 14 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. మొన్నిపాడులో 1, పుల్లూర్ 3, మద్దూర్ […]

Read More
కరోనా కట్టడికి ఏంచేద్దాం?

కరోనా కట్టడికి ఏంచేద్దాం?

సారథి న్యూస్, రామగుండం: కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్​ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో శానిటైజేషన్​ విధిగా చేయాలని.. కరోనా పేషెంట్లు క్వారంటైన్​లో ఉండేలా చూసుకోవాలని అధికారులకు సూచించారు. సోమవారం పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్​లో ఆయన కలెక్టర్​, అధికారులతో సమావేశమయ్యారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, జడ్పీచైర్మన్ పుట్ట మధుకర్, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావు, ఇంచార్జి కలెక్టర్ భారతి […]

Read More
మానోపాడులో కరోనా విజృంభణ

మానవపాడులో కరోనా హైరానా

సారథి న్యూస్​, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడులో కరోనా విజృంభిస్తోంది. తాజాగా 44 మందికి కరోనా రాపిడ్​ టెస్టులు నిర్వహించగా 14 మందికి కరోనా సోకింది. మానవపాడు -2, కొర్రిపాడు -1, మద్దూరు -2, ఉండవెల్లి మండలంలోని ఉండవెల్లి -1, పుల్లూరు -5, అలంపూర్ క్రాస్​ రోడ్డు -2, ఇటిక్యాల మండలంలో – 1 చొప్పున కేసులు నమోదైనట్టు డాక్టర్​ దివ్య తెలిపారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని, విధిగా […]

Read More
కరోనా కొత్తకేసులు

22 లక్షలు దాటిన కేసులు

న్యూఢిల్లీ: మనదేశంలో కరోనా కరాళనృత్యం చేస్తున్నది. ఇప్పటివరకు 22,15,074 కేసులు నమోదయ్యాయి. కేవలం గత 24 గంటల్లోనే 62,064 మందికి కొత్తగా కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. 6,34,949 యాక్టివ్​ కేసులున్నాయి. ఇప్పటివరకు 44,386 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 1,077 మంది కరోనాతో చనిపోయారు. ఇప్పటివరకు 2.45 కోట్ల పరీక్షలు చేసినట్టు ఐసీఎంఆర్​ తెలిపింది.

Read More
భారీగా పెరుగుతున్న కేసులు

కరోనా కేసులు@ 20 లక్షలు

ఢిల్లీ: మనదేశంలో కరోనా కరాళనృత్యం చేస్తోంది. గురువారం నాటికి కేసుల సంఖ్య 20 లక్షలకు చేరింది. గత 24 గంటల్లో 62,538 మందికి కొత్తగా కరోనా సోకింది. ఇప్పటివరకు మొత్తం 20,27075 మందికి కరోనా సోకగా, 41,585 మంది ప్రాణాలు కోల్పోయారు. 6,07384 మందికి ఆస్పత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 13,78,106 మంది కోలుకున్నారు. ఒక్క రోజులో 60వేల కేసులు దాటడం ఇదే తొలిసారి. ప్రస్తుతం కరోనా దేశంలో మరణాల రేటు 2. […]

Read More