Breaking News

TELANGANA

బీజేపీ స్టేట్​కమిటీ నియామకం

బీజేపీ స్టేట్ ​కమిటీ నియామకం

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ మరింతగా బలపడేందుకు ప్లాన్ ​చేస్తోంది. అందుకు అనుగుణంగా కమిటీలను నియమిస్తోంది. సమర్థవంతమైన నేతలకు బాధ్యతలు అప్పగిస్తోంది. ఈ క్రమంలోనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ​కుమార్​ ఆదివారం పూర్తి కమిటీని ప్రకటించారు. జి.విజయరామారావు, చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, బండారు శోభారాణి, సంకినేని వెంకటేశ్వరరావు, ఎండల లక్ష్మీనారాయణ, యెన్నం శ్రీనివాస్​రెడ్డి, జి.మనోహర్​రెడ్డి, బండారు శోభారాణిని ఉపాధ్యక్షులుగా నియమించారు. అలాగే ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, బంగారు శృతి […]

Read More
తెలంగాణలో 1,891 కేసులు

తెలంగాణలో 1,891 కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి పెరుగుతోంది. ఈ క్రమంలో ఆదివారం 1,891 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 66,677కు చేరింది. తాజాగా 10 మంది కరోనా వ్యాధిబారినపడి మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు మృతుల సంఖ్య 540కు చేరింది. రాష్ట్రంలో 18,547 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఒక్కరోజులో 1088 మంది డిశ్చార్జ్​అయ్యారు. జీహెచ్‌ఎంసీ పరిధితో అత్యధికంగా 517 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. […]

Read More
ప్రకృతి వనం.. ఆహ్లాదభరితం

ప్రకృతివనం.. ఆహ్లాదభరితం

సారథిన్యూస్, రామడుగు: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘పల్లె పకృతి వనం’ కార్యక్రమంలో గ్రామాలన్నీ ఆహ్లాదభరితంగా మారనున్నాయని పీడీ వెంకటేశ్వరరావు, ఏపీడీ మంజుల, ఏపీవో చంద్రశేఖర్​ పేర్కొన్నారు. శనివారం ఆయన కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామంలో ప్రకృతివనాన్ని పరిశీలించారు. అనంతరం అక్కడ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. పల్లెలను ఆహ్లాదభరితంగా ఉంచాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. కార్యక్రమంలో పీడీ వెంకటేశ్వర్లు, ఏపీడీ మంజుల, ఏపీవో చంద్రశేఖర్​, పంచాయతీ కార్యదర్శి అనిల్ తదితరులు […]

Read More
5న తెలంగాణ కేబినెట్ మీటింగ్​

5న తెలంగాణ కేబినెట్ మీటింగ్​

సారథి న్యూస్, హైదరాబాద్: ఆగస్టు 5న (బుధవారం) ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్​రావు అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. నూతన సెక్రటేరియట్ నిర్మాణం, నియంత్రిత సాగు పద్ధతిలో వ్యవసాయం, కరోనా నేపథ్యంలో విద్యాసంస్థల నిర్వహణ, విద్యారంగంలో తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

Read More
మెదక్​ జిల్లాలో వేగంగా

పంట వివరాలు పక్కాగా

సారథిన్యూస్​, నిజాంపేట: వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం నియంత్రిత సాగు విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయాధికారులు రైతులు ఏయే పంటలు సాగుచేశారో పరిశీలిస్తున్నారు. ఈ మేరకు క్షేత్రస్థాయిలో పర్యటించి పంటవివరాలు నమోదు చేసుకుంటున్నారు. మెదక్​ జిల్లాలోనూ ఈ కార్యక్రమం చురుగ్గా సాగుతున్నది. జిల్లాలో ఇప్పటికే 95 శాతం పంటనమోదు ప్రక్రియ పూర్తయినట్టు అధికారులు పేర్కొన్నారు. రైతులు తమ పంటలను మార్కెట్​ చేసుకొనేందుకు ఇబ్బందులు పడకుండా ముందుగానే పంటవివరాలు […]

Read More
11 మంది మృతి.. 2,083 కరోనా కేసులు

11 మంది మృతి.. 2,083 కరోనా కేసులు

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో(శనివారం) 2,083 కరోనా పాజిటివ్​ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తంగా 64,786 కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారినపడి ఒకేరోజు 11 మంది మృతిచెందారు. ఇప్పటివరకు మరణాల సంఖ్య 530కు చేరింది. ప్రస్తుతం 17, 754 యాక్టివ్​ కేసులు ఉన్నాయి. రికవరీ అయిన కేసుల సంఖ్య 1,114 గా నమోదైంది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 578 కేసులు నమోదయ్యాయి. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే రంగారెడ్డి […]

Read More
ఇంటర్​ మెమోలు వచ్చేశాయి

ఇంటర్​​ మెమోలు వచ్చేశాయి

సారథిన్యూస్​, హైదరాబాద్​: కరోనా సంక్షోభం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్​ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్​ బోర్డు ఫెయిల్​ అయిన విద్యార్థులకు కనీస పాస్​మార్కులు (35 శాతం) వేసి కంపార్ట్​మెంటల్​లో పాస్​చేసింది. విద్యార్థులందరినీ పాస్​చేస్తామని సీఎం కేసీఆర్​ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,50,941 మంది విద్యార్థులను పాస్​చేసినట్టు ఇంటర్​ బోర్డు కార్యదర్శి శుక్రవారం ప్రకటించారు. విద్యార్థులు ఈ నెల 31వ తేదీ (శుక్రవారం) మధ్యాహ్నం 2 […]

Read More
బెస్ట్ టీచర్ అవార్డుకు దరఖాస్తు చేసుకోండి

బెస్ట్ టీచర్ అవార్డుకు దరఖాస్తు చేసుకోండి

సారథి న్యూస్​, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లు, హెడ్‌మాస్టర్లు, ప్రిన్సిపల్స్, లెక్చరర్లు స్టేట్ లెవెల్ బెస్ట్ టీచర్ అవార్డుకు దరఖాస్తు చేసుకోవాలని స్కూలు ఎడ్యుకేషన్ డైరెక్టర్​ శ్రీదేవసేన కోరారు. ఆగస్టు 7లోగా డీఈవోలకు అప్లికేషన్స్ పంపించాలని సూచించారు. హెడ్‌మాస్టర్లు, ప్రిన్సిపల్స్ కు 10, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్టీజీ, పీజీటీ, టీజీటీలకు 31, డైట్, సీటీఈ, ఐఏఎస్ఈ లెక్చరర్లకు రెండు అవార్డుల చొప్పున ఇవ్వనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు సంబంధిత డీఈవో ఆఫీసుల్లో సంప్రదించాలని సూచించారు.

Read More