Breaking News

TELANGANA

బార్లు, క్ల‌బ్బులు కుల్లా

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణ‌లోని బార్లు, క్ల‌బ్బుల య‌జ‌మానుల‌కు ఊరట ల‌భించింది. క‌రోనా లాక్‌డౌన్ కార‌ణంగా బార్లు, క‌బ్బుల‌ను మూసివేయాల‌ని ప్ర‌భుత్వం ఆరు నెల‌ల క్రితం ఆదేశాలు జారీ చేసిన విష‌యం విదిత‌మే. ఇప్ప‌టికే వైన్ షాపులు తెరుచుకోగా, మొత్తానికి దాదాపు ఆరు నెల‌ల‌ కాలం త‌ర్వాత తెలంగాణ‌లో బార్లు, క్ల‌బ్బులు తెరుచుకోనున్నాయి. ఈ మేర‌కు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ప‌ర్మిట్ రూమ్‌ల‌కు మాత్రం ప్ర‌భుత్వం అనుమ‌తి ఇవ్వ‌లేదు. బార్లు, క్ల‌బ్బుల‌లో మ్యూజిక‌ల్ ఈవెంట్స్, డ్యాన్స్‌ల‌ను […]

Read More

ప్రగతిపథంలో పల్లెలు

సారథి న్యూస్​, మల్దకల్: గ్రామాల అభివృద్దిపై అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని జోగుళాంబ గద్వాల జిల్లా జడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య పేర్కొన్నారు. మంగళవారం ఆమె మల్దకల్​ మండల ప్రజాపరిషత్​ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఫైళ్లను పరిశీలించారు. మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను గురించి అడిగి తెలుసుకున్నారు.

Read More

ఎల్ఆర్ఎస్ పేదలకు శాపం

సారథి న్యూస్, రామడుగు/ రామాయంపేట /చిన్నశంకరంపేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్ పేద ప్రజలకు గుదిబండ అని బీజేపీ రాష్ట్ర కార్య వర్గ సభ్యుడు మురళి విమర్శించారు. ఎల్​ఆర్​ఎస్​ను నిరసిస్తూ మంగళవారం కరీంనగర్​ జిల్లా రామడుగు మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎల్ ఆర్ ఎస్ పేరుతో తీసుకొచ్చిన జీవో 131 ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్​ చేశారు. మరోవైపు ఎల్​ఆర్​ఎస్​ను రద్దు చేయాలని డిమాండ్​ […]

Read More

పక్కాగా.. ఫీవర్ సర్వే

సారథి న్యూస్​, శ్రీకాకుళం: ఇంటింటి ఫీవర్ సర్వే పక్కాగా నిర్వహించాలని శ్రీకాకుళం మున్సిపల్ అర్బన్ ప్రత్యేక అధికారి టీవీఎస్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన నగరంలోని బాకర్ సాహెబ్ పేట, పుణ్యపు వీధి రైతు బజార్,.. సచివాలయ ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బంది నుంచి ఫీవర్ సర్వే రిపోర్టులు అడిగి తెలుసుకున్నారు. సర్వే చేసేటప్పుడు ఏ ఇంటిని మర్చిపోవద్దని సూచించారు.

Read More

ఇలా చేస్తే.. కరోనా ఎందుకు రాదు

మానోపాడు: ఒకవైపు కరోనా మహమ్మారి ఇంకా ప్రబలుతుంటే కొందరేమో సామాజిక దూరం, మాస్కు ధరించకుండా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా మానోపాడు మండల కేంద్రంలోని ఎస్​బీఐ బ్యాంకు దగ్గర బ్యాంకు రుణాలపై మహిళా సంఘాలకు, సమైక్య అధికారులు ఎస్​బీఐ బ్యాంక్ సిబ్బంది అవగాహన కల్పించారు. అయితే ఈ సమావేశానికి100 మంది దాకా హాజరయ్యారు. అయితే వారేవరూ మాస్కు ధరించకపోవడం, భౌతికదూరం పాటించకపోవడంతో విమర్శలు వస్తున్నాయి.

Read More
అక్టోబర్ 9 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ

అక్టోబర్ 9 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ

సారథి న్యూస్, హైదరాబాద్: అక్టోబర్ 9 నుంచి బతుకమ్మ చీరలను పంపిణీ చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, ఐటీ పరిశ్రమశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. 287 డిజైన్లతో బంగారు, వెండి అంచులో చీరలను తయారుచేసినట్లు వెల్లడించారు. రైతన్నల, నేతన్నల ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. బతుకమ్మ పండుగకు కానుకగా ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డలకు చీరలు పంపిణీ చేస్తుందన్నారు. మంగళవారం బేగంపేట హరితప్లాజాలో ఏర్పాటుచేసిన బతుకమ్మ చీరల ప్రదర్శనను మంత్రులు కె.తారక రామారావు, సబితాఇంద్రారెడ్డి, […]

Read More

దుబ్బాకలో ఎన్నికల సందడి

నోటిఫికేషన్ రాక ముందే రాజకీయ వేడి మండలాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల హాడావిడి బీజేపీ నేతల మకా..గాడిన పడని కాంగ్రెస్ పల్లెల్లో నేతల మోహరింపు సారథి న్యూస్, దుబ్బాక: రాజకీయ పార్టీలు అధికారికంగా తమ అభ్యర్థులను ప్రకటించకముందే దుబ్బాక నియోజకవర్గంలో ప్రచారం ముమ్మరమైంది. ఎవరికి వారే అన్నట్లుగా ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటివరకు ఏ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించకున్నా స్థానికంగా మాత్రం రాజకీయ సందడి నెలకొన్నది. ఇప్పటికి ఎన్నికల ప్రకటన సైతం వెలువడలేదు […]

Read More

డ్రగ్స్​కేసుపై దివ్యవాణి షాకింగ్​ కామెంట్స్​

తెలుగుదేశం పార్టీ మహిళా నేత దివ్య వాణి తెలంగాణ ప్రభుత్వం, డ్రగ్స్​ కేసుపై షాకింగ్ కామెంట్స్​ చేశారు. ‘గతంలో ఓ సారీ టాలీవుడ్​లో డ్రగ్స్​కేసు అంటూ హడావుడి చేశారు. ఈ కేసు ఎందుకు మరుగున పడింది. విచారణ ఎందుకు ఆగిపోయింది. అందులో ఎవరెవరు ఉన్నారు.’ అంటూ వ్యాఖ్యానించారు. సోమవారం టీడీపీ-టీఎస్‌ మహిళా విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్​లో ‘తెలంగాణ మహిళా కమిషన్‌ ఆవశ్యకత-ఏర్పాటు’ అనే అంశంపై రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దివ్యవాణి మాట్లాడారు. ఇంకా ఆమె […]

Read More