సారథి న్యూస్, హైదారాబాద్: సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియా ఆస్పత్రుల్లో కోవిడ్ 19 వైద్యసేవల కోసం ఇప్పటివరకు రూ.8కోట్ల విలువైన మందులు, కిట్లు, సూట్లు పరికరాలను సిద్ధంగా ఉంచామని, మరో 21మంది డాక్టర్లను వైద్యసేవల కోసం తాత్కాలికంగా నియమించామని సంస్థ చైర్మన్, ఎండీ ఎం.శ్రీధర్ తెలిపారు. సోమవారం హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుతం సింగరేణి ఆస్పత్రిల్లో కరోనాకు కేటాయించిన 643 బెడ్లకు అదనంగా మరో 600 బెడ్లను సిద్ధం చేసుకోవాలని వైద్యాధికారులకు సూచించారు. […]
సారథి న్యూస్, రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియా ఆస్పత్రిని బుధవారం సింగరేణి జీఎం నారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. రామగుండం ఏరియా-1 లోని కొందరు ఉద్యోగులకు కరోనా ప్రబలింది. వారంతా రామగుండం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సింగరేణిలోని ఉద్యోగులు, వారికుటుంబసభ్యులు విధిగా పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. రామగుండం ఏరియా ఆస్పత్రిలో ప్రతి రోజు 200 మందికి కరోనా టెస్టులు నిర్వహించి అదేరోజు ఫలితాలు వెల్లడిస్తారని […]
సారథి న్యూస్, రామగుండం: ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి అన్నిరంగాల్లోనూ అద్భుతాలు సాధించవచ్చని సింగరేణి డైరెక్టర్ (ఆపరేషన్స్) చంద్రశేఖర్ పేర్కొన్నారు. సోమవారం మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఆధ్వర్యంలో ఓ జాతీయ సదస్సును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. మైనింగ్ ఇంజినీరింగ్ నిపుణులు, వివిధ శాఖల అధికారులు ఈ సదస్సులో పాల్లొన్నారు. వారంపాటు ఈ వీడియో కాన్ఫరెన్స్ కొనసాగనున్నది. కార్యక్రమంలో మైనింగ్ సేఫ్టీ (సౌత్ సెంట్రల్ జోన్) డిప్యూటీ డైరెక్టర్ మలయ్ టికేదార్, డిప్యూటీ డెరెక్టర్ ఆఫ్ మైన్ […]
సారథి న్యూస్, గోదావరిఖని: సింగరేణిలో పనిచేస్తున్న ఓ కార్మికుడు కరోనా లక్షణాలతో మృతిచెందాడు. దీంతో గురువారం సింగరేణి వ్యాప్తంగా పనిచేస్తున్న కార్మికులు విధులను బహిష్కరించారు. సింగరేణిలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో యాజమాన్యం వెంటనే లాక్డౌన్ ప్రకటించాలని సింగరేణి ఎంప్లాయీస్ యూనియన్ సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సారయ్య, గని కార్యదర్శి కే రంగారావు కోరారు. సింగరేణి ఆర్జీవన్ డివిజన్లోని జీడీకే రెండవ గనిలో పనిచేస్తున్న టామర్ కార్మికుడు బుధవారం కరోనా లక్షణాలతో మృతిచెందాడు. దీంతో కార్మికవర్గం ఒక్కటైంది.
సారథిన్యూస్, గోదావరిఖని: సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులను ఆదుకోవాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులకు కోవిడ్ క్వారంటైన్ వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సింగరేణి ఎండీకి లేఖ పంపినట్టు సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు తిరుపతి, మధు తెలిపారు. సింగరేణిలో కాంట్రాక్ట్, పర్మినెంట్ కార్మికులందరినీ కరోనా మహమ్మారి వెంటాడుతున్నదని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పర్మినెంట్ ఉద్యోగులకు కల్పిస్తున్న సౌకర్యాలను కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా కల్పించాలని డిమాండ్ చేశారు.
సారథిన్యూస్, గోదావరిఖని: సింగరేణి తన వ్యాపార విస్తరణలో భాగంగా నూతన ప్రాజెక్టులను ఏర్పాటు చేయబోతున్నదని సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ తెలిపారు. సోమవారం ఆయన సింగరేణి ఉన్నతాధికారలతో సమావేశమయ్యారు. సింగరేణి సంస్థ రిజర్వాయర్ల నీటిపై తేలియాడే సోలార్ ప్లాంటులను నిర్మించేందుకు సమాయత్తమవుతుందని చెప్పారు. దాదాపు 500 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను నిర్మించనున్నామని చెప్పారు. సమావేశంలో సింగరేణి డైరెక్టర్ (ఇ&ఎం) ఎస్ శంకర్, రాష్ట్ర రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్ మెంట్ శాఖ వైస్ ప్రెసిడెంట్ జానయ్య, ప్రాజెక్టు డైరెక్టర్ […]
సారథిన్యూస్, రామగుండం: సింగరేణి యాజమాన్యం ఇష్టానుసారం కార్మికులను బదిలీ చేస్తున్నదని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి ఆరోపించారు. అక్రమ బదిలీలను వెంటనే ఆపకపోతే ప్రత్యక్ష పోరాటాలకు దిగుతామని హెచ్చరించారు. ఆర్జీవన్ డివిజన్లోని జీకే ఓకటో గని కార్మికులను యాజమాన్యం ఎందుకు బదిలీ చేస్తున్నదని ప్రశ్నించారు. శనివారం ఆయన కార్మికులను కలిశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ఒకటో గనిలో కార్మికులు అవసరం ఉన్నప్పటికీ యజమాన్యం పద్ధతి లేకుండా కార్మికులను అడ్డాయలప్రాజెక్టుకు ఆర్జీ3కి బదిలీ చేయడం ఏమిటని ప్రశ్నించారు. […]
సారథిన్యూస్, గోదావరిఖని: బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జూలై 2,3,4 తేదీల్లో నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెకు అన్ని సంఘాలు సన్నద్ధం కావాలని సింగరేణి జేఏసీ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ సమ్మె ద్వారా ప్రధాని మోదీకి కనువిప్పు కలిగించాలని కోరారు. సోమవారం గోదావరిఖనిలో జేఏసీ నాయకులు సమ్మెపోస్టర్ను విడుదల చేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు వేల్పుల కుమార్ స్వామి, నరేశ్, ఎంఏ గౌస్, శ్రీనివాస్, తోకల రమేశ్, ఉపేందర్ ఎండీ గని తదితరులు పాల్గొన్నారు.