Breaking News

ROAD

రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి

రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి

సామాజిక సారథి, నార్కెట్ పల్లి: ముందు వెళుతున్న లారీని డీసీఎం ఢీకొట్టడంతో, క్యాబిన్లో ఇరుక్కుని ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతిచెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నార్కట్ పల్లిలో సోమవారం రాత్రి జరిగింది. నెల్లూరు జిల్లా లక్ష్మీపురం గ్రామానికి చెందిన చుండి హర్షవర్ధన్ రెడ్డి(30) సూర్యాపేట నుంచి హైదరాబాద్ కు డీసీఎంలో ప్రయాణిస్తున్నాడు. నార్కెట్ పల్లి గ్రామ శివారులోని నల్లగొండ ఫ్లై ఓవర్ దగ్గరకు రాగానే అతివేగం, డ్రైవర్ అజాగ్రత్తతో ముందు వెళుతున్న లారీని ఢీకొట్టింది. […]

Read More
శభాష్.. శివ!

శభాష్.. శివ!

యువకుడి సేవాస్ఫూర్తి సొంత ఖర్చుతో రోడ్డుపై గుంతల పూడ్చివేత అభినందన తెలిపిన వాహనదారులు సామాజిక సారథి, వర్ధన్నపేట: నిత్యం మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంతోమంది ఉన్నతాధికారులు వెళ్లే జాతీయ రహదారి అది. ప్రతిరోజూ వందలాది వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే ప్రధాన మార్గం. ఆ హైవేపై గుంతలు ఏర్పడి ప్రయాణికులకు ప్రాణసంకటంగా మారాయి. ఎన్నో ప్రమాదాలు కూడా జరిగాయి. కానీ ఎవరూ పట్టించుకున్న దాఖలాల్లేవ్. ఎవరూ బాధ్యతగా ముందుకొచ్చి ఆ గుంతలను పూడ్చే ప్రయత్నమూ చేయలేదు. కానీ ఐనవోలు […]

Read More
వాహనాలు ఢీ.. చెలరేగిన మంటలు

వాహనాలు ఢీ .. చెలరేగిన మంటలు

– ఔటర్​ రింగ్ ​రోడ్డుపై ఘోరప్రమాదం సామాజికసారథి, హైదరాబాద్‌: హైదరాబాద్ నగర శివార్లలోని పెద్ద అంబర్‌ పేట ఔటర్‌ రింగురోడ్డుపై ఘోరప్రమాదం జరిగింది. ఓఆర్‌ఆర్‌పై వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ముందుగా వెళ్తున్న లారీని వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారు, లారీ దగ్ధమయ్యాయి. అయితే రెండు వాహనాల్లో డ్రైవర్లు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై కేసు […]

Read More
నేలకొరిగిన బూరుగ వృక్షం

నేలకొరిగిన అరుదైన వృక్షం

కోదాడ : సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో అశోక్ నగర్ వద్ద ఉన్న ఆసియాలో అరుదైన ఆఫ్రికన్ జాతికి చెందిన వృక్షం అదన్ సోనియా డిజిటేటన్ లీన్(బూరుగ వృక్షం) నేలకొరిగింది. రోడ్డు విస్తరణకు అడ్డం రాకపోయినా కావాలని కూల్చేశారని పర్యావరణ వేత్తలు ఆరోపిస్తున్నారు. ఇటువంటి వృక్ష జాతిని సందర్శనా ప్రదేశాలుగా మార్చి పర్యాటకులకు, విద్యార్థులకు వాటి ప్రాముఖ్యం తెలుపుతూ అందుబాటులో ఉంచేలా చూడాల్సిన ప్రభుత్వ అటవీ శాఖ యంత్రాంగం పట్టించుకోకపోతే భావితరాలు ఎలా విజ్ఞానం పొందుతారని ప్రజలు […]

Read More

కల్వర్టులు లేక కష్టాలు

సారథి న్యూస్,​ బెజ్జంకి: రహదారులపై కల్వర్టులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని యువజన కాంగ్రెస్​ నేత పోతిరెడ్డి రాజశేఖర్​రెడ్డి ఆరోపించారు. వర్షాకాలంలో కురిసిన భారీవర్షాలకు వాగులు, ఒర్రెలు పొంగి పొర్లుతున్నాయన్నారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని తాళ్లపల్లి, గూడెం, వడ్లూర్, బేగంపేట్, లక్ష్మీపూర్, ఎల్లంపల్లి, తలారివానిపల్లి గ్రామాలకు వెళ్లేదారుల్లో కల్వర్టులు లేక రాత్రివేళల్లో ప్రజలు అనేక రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి కల్వర్టులు నిర్మించాలని డిమాండ్​ చేశారు.

Read More

రోడ్డంతా గుంతలమయం

సారథి న్యూస్, చొప్పదండి: గత మూడురోజులుగా కురుస్తున్న వర్షాలతో కరీంనగర్​ జిల్లా చొప్పదండి మండలం గుమ్లాపూర్​ గ్రమాంలోని శివారుప్రాంతం నుంచి సాంబయ్యపల్లి వెళ్లే కమాన్​వరకు తారు రోడ్డు లేకపోవడంతో మట్టిరోడ్డు గుంతలుగా మారింది. గాయత్రి పంప్ హౌస్ నిర్మాణం కోసం నిత్యం కంకర సరఫరా చేసే లారీలతో రద్దీగా మారడంతో రోడ్డంతా గుంతల మయం అయింది. దీంతో ఎప్పుడ ఏ ప్రమాదం జరుగుతుందోనని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. గతంలోనూ ఈ రోడ్డుపై అనేకప్రమాదాలు జరిగాయి. అధికారులు దృష్టిసారించి […]

Read More

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

సూర్యాపేట జిల్లా: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన ఘటన సూర్యాపేట జిల్లానాగారం మండలం ఫణిగిరి స్టేజీ సమీపంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్నది. బైక్​పై వెళ్తున్న ఇద్దరు యువకులను కారు ఢీకొట్టడంతో వారు అక్కడిక్కడే మృతి చెందారు. మృతులను తిరుమలగిరి మండలం తొండ గ్రామానికి చెందిన నర్రా సందీప్, జేరిపోతుల హరీశ్ గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Read More