Breaking News

POLICE

ప్రభుత్వ భూమి కబ్జా.. 40 మందిపై కేసు

పుట్టాన్‌దొడ్డి(ఇటిక్యాల): ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించిన 40 మందిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై కృష్ణయ్య తెలిపారు. జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం పుట్టాన్‌దొడ్డి శివారులో 171, 172 సర్వేనంబరులోని ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు గ్రామస్థులు ప్రయత్నించారు. దీనిపై రెవెన్యూ సిబ్బంది బుధవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేసి ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసి ఆక్రమించేందుకు యత్నించిన 40 మందిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.

Read More

తప్పడు ప్రచారం చేస్తే కఠినచర్యలు

సారథి న్యూస్, రామడుగు: కరోనాపై సామాజిక మాధ్యమాల్లో తప్పడు ప్రచారం చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని కరీంనగర్​ జిల్లా రామడుగు ఎస్సై అనూష హెచ్చరించారు. కరోనా వచ్చిందని రోగుల వివరాలు బయటపెడితే చర్యలు తప్పవన్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే గ్రూప్​ అడ్మిన్లపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఐపీసీ, డిజాస్టర్ మేనేజ్​మెంట్​ ఆక్ట్, ఎపిడమిక్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కరోనా కట్టడిలో మండల ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.

Read More
బెంగళూరులో అల్లర్లు

ఫేస్​బుక్​ పోస్టు.. బెంగళూరులో విధ్వంసం

బెంగళూరు: ఒక్క ఫేస్​బుక్​ పోస్టుతో బెంగళూరు నగరం అట్టుడికింది. తీవ్ర అల్లర్లు చెలరేగాయి. ఆందోళనకారులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కాంగ్రెస్​ ఎమ్మెల్యే పులికేశినగర్ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి సమీపబంధువు ఫేస్​బుక్​లో ఓ కులానికి చెందిన వారిని కించపరుస్తూ ఓ పోస్ట్​పెట్టాడు. దీంతో ఆ కులానికి చెందినవారంతా భారీగా ఎమ్మెల్యే ఇంటివద్దరకు చేరుకొని ఆందోళనకు దిగారు. బెంగళూరులోని పులకేశి నగర్, భారతి నగర్, కమర్షియల్ స్ట్రీట్, టన్నెరీ రోడ్‌లో బలవంతంగా దుకాణాలను […]

Read More
అలంపూర్​లో సీసీ కెమెరాలు ఏర్పాటు

అలంపూర్​లో సీసీ కెమెరాల ఏర్పాటు

సారథి న్యూస్​, అలంపూర్​: నేరాలను అరికట్టేందుకు పటిష్ఠమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ రంజన్​ రతన్​ కుమార్​ పేర్కొన్నారు. మంగళవారం ఆయన ‘నేనుసైతం’ కార్యక్రమంలో భాగంగా అలంపూర్​ చౌరస్తాలో సీసీ కెమెరాలను ప్రారంభించారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు నారాయణ గౌడ్ ఆర్థికసాయం చేశారని ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్పీ కృష్ణ, డీఎస్పీ యాదగిరి, సీఐ వెంకట్రామయ్య, ఎస్సై మధుసూదన రెడ్డి, ఏఎస్సై అయ్యన్న తదితరులు పాల్గొన్నారు.

Read More
గణేశ్​ మండపాలకు అనుమతి లేదు

గణేశ్​ మండపాలకు నో పర్మిషన్​

సారథి న్యూస్​, నల్లగొండ: ప్రస్తుత పరిస్థితుల్లో గణేశ్​ మండపాలు, నవరాత్రి ఉత్సవాలకు అనుమతి ఇవ్వలేమని నల్లగొండ ఎస్పీ ఏవీ రంగనాథ్​ స్పష్టం చేశారు. కరోనా విపత్తువేళ హిందూ సోదరులంతా పోలీస్​శాఖకు సహకరించాలని ఆయన కోరారు. గణేశ్​ మండపాల నిర్వాహకులకు త్వరలోనే కౌన్సెలింగ్​​ నిర్వహిస్తామన్నారు. ప్రజలంతా ఇండ్లల్లోనే పూజలు చేసుకోవాలని కోరారు. తయారీదారులు విగ్రహాలను తయారు చేసి ఇబ్బందులు తెచ్చుకోవద్దని.. కరోనా పోయేంత వరకు ఇతర ఉపాధి మార్గాలను వెతుక్కోవాలని సూచించారు.

Read More
రియా చుట్టూబిగిస్తున్న ఉచ్చు

రియాకు ఉచ్చు బిగుస్తోంది

ముంబై: సుశాంత్​సింగ్ రాజ్​పుత్ ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సుశాంత్​ మాజీ ప్రేయసి రియాచక్రవర్తికి చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. ఈ కేసులో రియా తీరుపై మొదటి నుంచి అనుమానాలు ఉన్నాయి. మరోవైపు రియా చక్రవర్తి కనిపించకుండాపోవడం అనుమానాలకు తావిచ్చింది. రియాను కాపాడేందుకు ముంబై పోలీసులు రియాను కాపాడేందుకు యత్నిస్తున్నారన్న ఆరోపణలు వినిపించాయి. ఈ కేసు విషయంలో ముంబై పోలీసులకు. బీహార్​ పోలీసులకు వాదోపవాదాలు సాగిన విషయం తెలిసిందే. కాగా ఈ ఘటనల నేపథ్యంలో రియా శుక్రవారం ఈడీ […]

Read More
75 ఏళ్ల బామ్మపై రేప్​

75 ఏళ్ల బామ్మపై లైంగికదాడి

ఎర్నాకుళం: మహిళలపై దాడులు, అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా 75 ఏళ్ల బామ్మపై ఇద్దరు దుర్మార్గులు లైంగికదాడికి పాల్పడ్డారు. కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళంలో ఈ దారుణం చోటుచేసుకున్నది. ప్రస్తుతం బాధితురాలు దవాఖానలో చికిత్సపొందుతున్నది. ఎర్నాకుళంలో ఉంటున్న ఓ వృద్ధురాలికి మతిస్థిమితం లేదు. దీంతో ఆమెను ఇద్దరు దుర్మార్గులు బలవంతంగా ఓ ఇంట్లోకి తీసుకెళ్లారు. మద్యం మత్తులో లైంగికదాడికి పాల్పడటమేకాక ఆమెను చిత్రహింసలకు గురిచేశారు. మరో 66 ఏండ్ల వృద్ధురాలు నిందితులకు సహకరించినట్టు సమాచారం. ఈ కేసులో పోలీసులు […]

Read More
పోలీసులపై అమృత ఫైర్​

ముంబై పోలీసులపై అమృత ఫైర్​

ముంబై: ముంబై పోలీసులపై మహారాష్ట్ర మాజీసీఎం ఫడ్నవీస్​ సతీమణి అమృత ఫడ్నవీస్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ముంబై నగరం మానవత్వాన్ని కోల్పోయింది. ఇక్కడి పోలీసుల తీరు బాధ్యతారాహిత్యాన్ని తలపిస్తుంది. వీరంతా నిజానిజాలను పక్కనపెట్టి అధికారంలో ఉన్నవారికి కొమ్ము కాస్తున్నారు. పోలీసుల వ్యవహారశైలితో ముంబైలో బతకడం అంత సురక్షితం కాదేమో అనిపిస్తుంది’ అంటూ ఆమె ట్వీట్​ చేశారు. సుశాంత్​ కేసులో మహారాష్ట్ర, బీహార్​ పోలీసుల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న ప్రస్తుత తరుణంలో అమృత వ్యాఖ్యాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. […]

Read More